Srivari
-
వైభవంగా శ్రీవారి చక్రస్నానం .. కోనేటిలో భక్తుల స్నానాలు
-
తిరుమల శ్రీవారి సేవలో క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్
-
హైదరాబాద్ : ఈనెల 11 నుంచి 15 వ తేదీ వరకు శ్రీవారి వైభవోత్సవాలు
-
గోవిందనామ స్మరణలతో మారుమోగిన పాదాల మండపం (ఫొటోలు)
-
తిరుమలలో శ్రీవారి లక్ష్మీహారం ఊరేగింపు
సాక్షి,తిరుపతి: తిరుమలలో ఆదివారం ఉదయం శ్రీవారి లక్ష్మీహారాన్ని ఆలయం నుండి వైభవోత్సవ మండపం వరకు ఊరేగించారు. అంతకు ముందు శ్రీవారి పాదాల చెంత లక్ష్మీహారాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనం రోజున శ్రీవారి ఆభరణాల ఖజానా నుంచి అత్యంత ప్రధానమైన లక్ష్మీకాసుల హారాన్ని అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఆదివారం తిరుమల నుంచి అత్యంత భద్రత నడుమ వాహనంలో శ్రీవారి లక్ష్మీహారాన్ని తిరుచానూరుకు తరలించారు. సాయంత్రం గజవాహన సేవలో శ్రీవారి లక్ష్మీహారాన్ని అమ్మవారికి అలంకరిస్తారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గజవాహనసేవకు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి చెవిరెడ్డి దంపతులు పట్టువస్త్రాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ప్రతి ఏటా గజవాహన సేవ రోజు కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలను తీసుకెళ్లి సమర్పించడం ఆనవాయితీ.. ఈ సారి భారీ వర్షం కురిసినప్పటికీ ఆ ఆనవాయితీని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులు కొనసాగించారు. -
తిరుమలేశుని తెప్పోత్సవం
-
కానుకల హుండీకి సీలువేయటంలో నిర్లక్ష్యం
–శ్రీవారి ఆలయ అధికారులపై మండిపడ్డ టీటీడీ చైర్మన్ – విజిలెన్స్ విచారణకు ఆదేశం సాక్షి, తిరుమల: భక్తులు భక్తి శ్రద్దలతో శ్రీవేంకటేశ్వర స్వామివారికి ముడుపులు, కానుకల రూపంలో చెల్లించిన హుండీ భద్రపరిచే విషయంలో తిరుమల ఆలయ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. కానుకలతో నిండిన హుండీకి ఆలయ నిబంధనల ప్రకారం సీలు వేయకుండా వదిలేసిన ఘటన సోమవారం వెలుగుచూసింది. దీనిపై టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. తిరుమల ఆలయంలో రోజూ రూ.2 నుండి 3.5 కోట్ల వరకు హుండీ (కొప్పెర) కానుకలు లభిస్తున్నాయి. ఇలా ఏటా టీటీడీకి రూ.వెయ్యికోట్ల నగదు, రూ.300 కోట్ల విలువైన బంగారు, వెండి, ఇతర ఆస్తులు లభిస్తున్నాయి. భక్తుల రద్దీ బట్టి ఆలయంలో 7 నుండి 10 హుండీలు కానుకలతో నిండుతుంటాయి. ఇలా కానుకలతో నిండిన హుండీని సోమవారం ఉదయం 10.20 గంటలు తొలగించి, దానిస్థానంలో కొత్త హుండీ ఏర్పాటు చేశారు. తొలగించిన హుండీని ఆలయ నిబంధనల ప్రకారం విధి నిర్వహణలో ఉన్న సంబంధిత ఆలయ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో హుండీకి తాడుతో గట్టిగా కట్టాలి. అధికారితోపాటు భక్తుల సమక్షంలో లక్కతో ఆలయ అధికారిక సీలు వేయాల్సి ఉంటుంది. అలాంటి నిబంధనలు పాటించలేదు. నిర్లక్ష్యంగా కేవలం జనపనార పురిదారంతో హుండీని చుట్టి పక్కన పెట్టేశారు. తర్వాత ఉదయం 11.20 గంటలకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి హుండీ వద్దకు వచ్చి కానుకలు సమర్పించారు. సమీపంలోనే నిండిన హుండీ సీలు లేకుండా , కేవలం పురిదారంతో మాత్రమే ఉండటాటాన్ని గుర్తించారు. ఈ ఘటనపై చైర్మన్ సంబంధిత ఆలయ అ«ధికారులపై మండిపడ్డారు. వీఎస్వో రవీంద్రారెడ్డిని అక్కడికి పిలిపించి జరిగిన సంఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. భక్తులు సమర్పించే కానుకల్లోనూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా? అంటూ అక్కడి సిబ్బందిని మందలించారు. భక్తులు సమర్పించే కానుకలు కాపాడటంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో వ్యవహరించాలని సూచించారు. హుండీ కానుకలు భద్రత, లెక్కింపుల్లో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ప్రత్యేక సూచనలు చేసినప్పటికీ ఆలయ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించటం గమనార్హం. -
పేదల కోసం శ్రీవారి రాగి డాలర్లు
అందుబాటులోకి తేవాలని టీటీడీ నిర్ణయం సాక్షి, తిరుమల: మూడేళ్లుగా భక్తులకు అందుబాటులో లేని శ్రీవారి 2 గ్రాముల బంగారు డాలర్లతో పాటు వెండి డాలర్ల విక్రయానికీ టీటీడీ చర్యలు చేపట్టింది. వీటితోపాటు కొత్తగా రాగి డాలర్లనూ అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఉత్తర్వులిచ్చారు. డాలర్ల కొరతపై ‘సాక్షి’ వరుస కథనాలు తిరుమల ఆలయం పక్కన లడ్డూ కౌంటర్ల సమీపంలోనే శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయ కేంద్రం ఉంది. మూడేళ్లుగా డాలర్ల విక్రయ కేంద్రంలో 3,5 గ్రాముల వెండి డాలర్లు, రెండు గ్రాముల బంగారు డాలర్లు స్టాకు సైతం రెండేళ్లుగా లేదు. దీనిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో టీటీడీ ఈవో సాంబశివరావు స్పందించారు. ఈ డాలర్లను తిరిగి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. అది కూడా బంగారు స్వచ్ఛత తెలిపే హాల్‌మార్క్‌తోనే బంగార్లు డాలర్లు విక్రయించాలని ఉత్తర్వులిచ్చారు. అలాగే పేద భక్తుల కోసం తక్కువ ధరతో రాగి డాలర్లు విక్రయించాలని నిర్ణయించారు. -
కొప్పెరకు ‘కొత్త’ కళ!
విధుల్లో చేరిన దర్జీ.. సిద్ధమవుతున్న శ్రీవారి కొప్పెర కొత్త వస్త్రాలు సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోని కొప్పెర(హుండీ)కు కొత్త వస్త్రాలు కుట్టే దర్జీ ఎట్టకేలకు గురువారం నుంచి విధులకు హాజరయ్యాడు. ‘‘శ్రీవారి కొప్పెరకు కొత్త వస్త్రాలేవ్!’’ అన్న శీర్షికతో ఈనెల 14న ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వెంటనే స్పందించింది. ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఆదేశాల మేరకు గతేడాది మార్చిలో తొలగించిన దర్జీ కె.దేవదాస్‌ను తిరిగి నియమించారు. బుధవారం ఉదయం ఫోన్ ద్వారా ఉత్తర్వులందుకున్న దేవదాస్ గురువారం నుంచి విధులకు హాజరయ్యాడు. కొప్పెరకు అవసరమైన కొత్త వస్త్రాలు సిద్ధం చేసే పని తిరిగి చేపట్టాడు. గతంలో ఈయనకు రూ.6,400 నగదు, తిరుపతి-తిరుమల మధ్య ఉచిత ఆర్టీసీ బస్‌పాస్ ఇచ్చేవారు. తాజాగా ఈవో ఆదేశాలతో ఆయనకు ఉచిత బస్‌పాస్ గురువారంనుంచి అమల్లోకి వచ్చింది. పనికి తగిన వేతనం కూడా నిర్ణయించి ఇవ్వనున్నారు. కొప్పెరకు అవసరమైన వస్త్రాలకు ఏ లోటు లేకుండా ఉండేందుకు ఏడాదికి సరిపడా సిద్ధం చేస్తామని టీటీడీ ఈవో ‘సాక్షి’కి తెలిపారు. దేవుడే తిరిగి రప్పించాడు ‘‘భక్తులు తమ మొక్కులు, ముడుపులు, కానుకలు వేసే కొప్పెరకు వస్త్రాలు కుట్టడాన్ని పనికన్నా.. సేవగాను, ైదైవకార్యంగా భావిస్తాం. గతంలో ఉద్యోగిగా ఆ పని చేశాను. తిరిగి రెండేళ్లపాటు కాంట్రాక్టు పద్ధతిన పనిచేశాను. మళ్లీ రమ్మని ఉత్తర్వులిచ్చారు. తొమ్మిది నెలల తర్వాత మళ్లీ కొప్పెర వస్త్రాలు కుట్టే అవకాశం ఆ దేవదేవుడే కల్పించారు. చాలా ఆనందంగా ఉంది. నాలో శక్తి ఉన్నంతకాలం ఈ విధులు కొనసాగిస్తాను.’’ - దేవదాస్, కొప్పెర వస్త్రాలు కుట్టే దర్జీ -
శ్రీవారి హుండీ...
మీకు తెలుసా? ఏడుకొండలవాడి దర్శనానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆ స్వామిని కన్నులారా చూసిన వెంటనే అక్కడే ఉన్న హుండీలో కానుకలను సమర్పించడం పరిపాటి. ఈ హుండీకి ఒక కథ ఉంది. అదేమిటో చూద్దాం... స్వామివారికి శ్రీవారి హుండీ ఆలయంలోని తిరుమామణి మంటపంలో ఉంది. రాగి గంగాళాన్ని శంఖుచక్రాలు, తిరునామాలు ముద్రించిన వస్త్రం లోపల ఉంచుతారు. ఆ గంగాళాన్ని హుండీ లేదా కొప్పెర అంటారు. ఈస్టిండియా కంపెనీ పాలన కాలంలో 1821, జూలై 25న ఈ హుండీని ఏర్పాటు చేసినట్లు ఆలయ పరిపాలనా విధానాలను నిర్దేశించే చట్టం బ్రూస్‌కోడ్-12 లో పేర్కొన్నారు. 1958 నవంబర్ 28న, శ్రీవారి ఒక రోజు ఆదాయం మొట్టమొదటిసారిగా లక్ష రూపాయలు దాటింది. ఇప్పుడైతే రోజువారీ హుండీ ఆదాయం కోటిన్నర దాటుతోంది. కానుకలతో కొప్పెర నిండిన ప్రతిసారీ భక్తుల సమక్షంలో సీలువేసి పారుపత్తేదారు కానుకలు లెక్కించే పరకామణికి చేరవేస్తారు. అక్కడ సీల్ తీసి అందులోని నోట్ల కట్టలు, చిల్లర నాణాలు, బంగారు ఆభరణాలను వేర్వేరుగా లెక్కిస్తారు. లెక్కింపునకు టీటీడీ ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయిస్తుంది. తిరుమల తిరుపతిలో పనిచేసే టీటీడీ సిబ్బందికి నెలకో రోజు చొప్పున ఈ విధులు కేటాయిస్తారు. లెక్కింపు ప్రక్రియ మొత్తాన్నీ సీసీ కెమెరాలలో చిత్రీకరిస్తారు. పరకామణిలోకి ప్రవేశించే సిబ్బందిని పంచె, బనియన్లతో మాత్రమే లోపలికి అనుమతిస్తారు. రోజుకు సుమారు 50 మంది రెండు బృందాలుగా ిషిఫ్టుల పద్ధతిలో పరకామణి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటారు. భద్రత తనిఖీల కారణంగా గతంలో మాదిరిగా కట్టలుకట్టలుగా హుండీలో కానుకలు పడటం లేదు. -
ముగిసిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
-
వైభవంగా శ్రీవారి బహ్మోత్సవాలు
-
శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి సూచికగా ఆలయంలో బుధవారం ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించి.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో వైఖానస ఆగమోక్తంగా పవిత్ర గరుడ పతాకాన్ని (ధ్వజపటం) బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రానికి ఆవిష్కరించి అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ధ్వజారోహణానికి ముందు తిరుచ్చివాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పరివార దేవతలైన అనంతుడు (ఆదిశేషుడు), గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, గరుడధ్వజం, సుదర్శన చక్రతాళ్వార్‌తో కలసి ఆలయ పురవీధుల్లో ఊరేగారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రి 8 గంటలకు సీఎం ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయానికి ఆయన చేరుకున్నారు. ప్రధాన అర్చకుడు ఏవీ రమణదీక్షితులు సీఎంకు తలపాగా చుట్టారు. తర్వాత వెండిపళ్లెంలో పట్టువస్త్రాలు ప్రదర్శనగా మహద్వారం నుంచి ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి సీఎం సమర్పించారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరిగ్గా 12 ఏళ్ల క్రితం అలిపిరి వద్ద మావోయిస్టులు తనపై 24 క్లెమోర్మైన్లతో దాడికి తెగబడ్డారని, ఆ సంఘటన నుంచి సాక్షాత్తు శ్రీనివాసుడే తనను రక్షించారని చంద్రబాబు అన్నారు. -
బ్రహ్మోత్సవ సంరంభం.. ఆరంభం
శాస్త్రోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నేడు ధ్వజారోహణం, పట్టువస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం వైదికంగా అంకురార్పణ నిర్వహించారు. స్వామి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు.. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వామి తరపున పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక నిర్విహంచటం అనాదిగా వస్తున్న ఆచారం. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజైన మంగళవారం సాయంసంధ్యా సమయంలో విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ యాగశాలలో లలాట, బహు, స్తన పునీత ప్రదేశంలో భూమిపూజ (మృత్సంగ్రహణం) నిర్వహించారు. తొమ్మిది పాళికలలో (కుండలు) నవధాన్యాలను మట్టిలో కలిపి మొలకెత్తించే పని ప్రారంభించారు. అంకురాలను ఆరోపించే కార్యక్రమాన్ని అంకురార్పణం (బీజావాపం) అంటారు. శుక్ల పక్ష చంద్రునిలా పాళికల్లోని నవ ధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా అర్చకులు ప్రార్థించారు. నిత్యం నీరుపోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం 5 నుంచి 5.30 గంటల్లోపు గోధూళి వేళ మీన లగ్నంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు కన్నుల పండువగా ఆరంభం కానున్నాయి. రాత్రి 9 గంటలకు శేష వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఇలా వరుసగా ఈనెల 24 వరకు ఉదయం 9 నుంచి 11 గంటలు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప.. వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరించనున్నారు. ఐదోరోజు గరుడ వాహనంపై, ఎనిమిదో రోజు రథోత్సవంలో, చివరి తొమ్మిదో రోజు చక్రస్నానంలో స్వామివారు సేదదీరుతారు. నేడు ఏపీ సీఎం పట్టువస్త్రాల సమర్పణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి బుధవారం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 8 గంటల తర్వాత ఇక్కడి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి సీఎం పట్టువస్త్రాలు ఆలయంలో సమర్పిస్తారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని, వెలుపల పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు. -
ఈ నెల 16 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
పుష్పపల్లకిలో పురుషోత్తముడు
ఆణివార ఆస్థానం సందర్భంగా వేడుకగా పుష్పపల్లకీ సేవ తిరువీధుల్లో సుగంధ పరిమళం ప్రత్యేక ఆకర్షణగా పుష్కరిణి హారతి తిరుమల : ఆణివార ఆస్థానం సందర్భంగా తిరుమలలో శుక్రవారం పుష్పపల్లకీ సేవ వేడుకగా సాగింది. దంతపల్లకీపై ఐదు వందల కేజీల సంప్రదాయ, విదేశీ కట్ పుష్పాలతో చెన్నై, బెంగళూరుకు చెందిన నిపుణులు పల్లకిని విశేషంగా అలంకరించారు. ఆలయంలో సాయంత్రం వైదిక కార్యక్రమాలు ముగించుకున్న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారిని పల్లకిలో వేంచేపుచేశారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య సాయంత్రం 6 గంటలకు పల్లకీ ఉత్సవ ఊరేగింపు ప్రారంభించా రు. సాయం సంధ్యాసమయంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో పల్లకీపై ఊరేగిన ఉత్సవమూర్తులను భక్తులు కనులారా దర్శించుకుని తన్మయం పొందారు. తిరువీధులు పుష్పపరిమళం వెదజల్లాయి. రెండేళ్లకు ముందు అధిక బరువు వల్ల జరిగిన అపశ్రుతులు పునరావృతం కాకుండా పల్లకీ మొత్తం బరువును మూడు టన్నుల నుంచి రెండు టన్నులకు కుదించారు. ఉత్సవమూర్తులు, తండ్లు, అర్చకులు, ఇతర సామగ్రి కలిపి మరో టన్ను బరువు ఉండేలా అధికారులు జాగ్రత్తపడ్డారు. పల్లకీ ఎత్తు 15 అడుగులు, పొడవు 22 అడుగులు, 10 అడుగులతో సిద్ధం చేశారు. పుష్పాలంకరణలో ఆరు రకాల కట్పుష్పాలు, మరో ఆరు రకాల సంప్రదాయ పుష్పాలు వినియోగించారు. ఆకర్షణగా పుష్కరిణి హారతి శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపులో భాగంగా శుక్రవారం నిర్వహించిన పుష్కరిణి హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు పుష్కరిణికి హారతి సమర్పించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి గోదారిగట్టున రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన పుష్కరిణి హారతిలో వేలాది మంది భక్తులు పాల్గొంటున్న విషయం తెలిసిందే. కార్యక్రమంలో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, అదనపు సీవీ ఎస్వో శివకుమార్‌రెడ్డి, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఈఈ కృష్ణారెడ్డి, గార్డెన్ సూపరింటెం డెంట్ శ్రీనివాసులు పాల్గొన్నారు.