
సాక్షి, ముంబై: దేశీయ కార్ మేకర్ మారుతిసుజుకి కార్లపై తగ్గింపురేట్లను ప్రకటించింది. ఎంపిక చేసిన కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా ఆల్టో, వాగన్ ఆర్, స్విఫ్, ఎర్టిగా కార్లపై ఈ డిస్కౌంట్లను అందిస్తోంది.
అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి ప్రముఖ మోడల్స్ స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, ఆల్టో, ఎర్టిగా ధరలపై రూ. 30 వేలనుంచి రూ. 40వేల దాకా తగ్గింపు అందిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. ఆల్టో 800 పై రూ .35వేలు, స్విఫ్ట్ రూ .30వే తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అలాగే ఎర్టిగా డీజిల్‌మోడల్ ధరను రూ.40 వేలు తగ్గించింది.