
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల కాస్త తగ్గముఖం పట్టడంతో ఈ-కామర్స్ సంస్థలు పోటాపోటీగా కొత్త కొత్త సేల్స్‌ను కస్టమర్ల కోసం తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకోసం స్మార్ట్‌ఫోన్ కార్నివాల్ సేల్‌ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఈ సేల్ సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 8 వరకు కొనసాగుతుంది. ఈ సేల్స్‌లో భాగంగా పలు మొబైల్స్‌పై భారీ ఆఫర్లను ప్రకటించింది. రియల్ మీ నార్జో 30 5జీ, పోకో ఎమ్3, ఐఫోన్ 12, ఐఫోన్ ఎక్స్ ఆర్, ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్ వంటి ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తోంది.
స్మార్ట్‌ఫోన్ కార్నివాల్ లో భాగంగా ఐఫోన్ 12 మినీ మొబైల్ అసలు ధర రూ.69,900 కాగా, ఈ సేల్ లో మీకు రూ. 59,999కు లభిస్తుంది. కస్టమర్లు ఐఫోన్ 11ని కూడా కొనుక్కోవచ్చు. ఇతర ఐఫోన్ల మీద కూడా డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్ ధర రూ.9,499 డిస్కౌంట్ ధరకు అందుబాటులో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ పోకో ఎం3 ధరను రూ.10,999 నుంచి రూ.10,499కు తగ్గించింది. రియల్ మీ నార్జో 30 5జీ ప్రారంభ ధర రూ.14,999 కాగా, డిస్కౌంట్ కింద రూ.1,000 తగ్గించింది. ఇలా చాలా మొబైల్స్ మీద డిస్కౌంట్ అందిస్తుంది.(చదవండి: అది నకిలీది.. అలా నేను అనలేదు: ఆనంద్ మహీంద్ర)
Comments
Please login to add a commentAdd a comment