ఈ–కామర్స్ సంస్థల పండుగ ఆఫర్లు
►ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 20 నుంచి
► ఇదే బాటలో అమెజాన్ కూడా
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్ రానున్న పండుగ సీజన్‌పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయి. ఇప్పటికే పలు ఈ–కామర్స్ సంస్థలు యూజర్లకు అధిక డిస్కౌంట్లు అందించ్చేందుకు పలు ప్రధాన బ్రాండ్లతో, విక్రయదారులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ విక్రయాల తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 20 నుంచి 24 వరకు ఈ సేల్ జరగనుంది. ఇందులో భాగంగా సంస్థ కేవలం భారీ డిస్కౌంట్స్‌తో మాత్రమే కాకుండా నో కాస్ట్ ఈఎంఐ, ప్రొడక్ట్ ఎక్సే్చంజ్, బై నౌ పే లేటర్, డెబిట్ కార్డులపై ఈఎంఐ వంటి పలు ఆప్షన్లతో కస్టమర్లను ఆకర్షించనుంది. ఇక అమెజాన్ కూడా వార్షిక విక్రయాల సేల్‌కు రెడీ అవుతోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ నెల చివరిలో అంటే ఫ్లిప్‌కార్ట్ సేల్ తర్వాత ఉండొచ్చు.