దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇటీవల ప్రకటించిన బిగ్ షాపింగ్ డేస్ సేల్‌కు అమెజాన్ కౌంటర్ ఇచ్చేసింది. తాను కూడా ఈ నెలలో సమ్మర్ సేల్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. మే 13 నుంచి మే 16 వరకు బిగ్ డీల్స్, డిస్కౌంట్లతో అలరించనున్నట్టు తెలిపింది. అయితే ఇదే తేదీల్లో ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది.
అమెజాన్ ఈ సేల్ కింద మొబైల్ ఫోన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, లార్జ్ అప్లియెన్సస్, టీవీలు, స్పోర్ట్‌లు, ఫిట్‌నెస్ వంటి పలు ఉత్పత్తులపై పలు డీల్స్‌ను అందించనుంది. క్యాష్‌బ్యాక్‌లు, నో-కాస్ట్ ఈఎంఐలు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లను అమెజాన్ ఆఫర్ చేయబోతోంది. మొత్తం ఈ సేల్‌లో 1000కి పైగా బ్రాండ్‌లలో, 40వేల డీల్స్‌ను అందించనున్నట్టు అమెజాన్ ప్రకటించింది.
స్మార్ట్‌ఫోన్లపై 35 శాతం వరకు డిస్కౌంట్లను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. హానర్ 7ఎక్స్ డిస్కౌంట్ దీనిలో ప్రత్యేకంగా నిలువనుంది. రూ.10వేల వరకు ఆఫర్ల విలువతో నోకియా 7 ప్లస్ ఈ సేల్‌లో విక్రయానికి వస్తోంది. రియల్‌మి 1 కూడా తొలిసారి ఈ సేల్‌లో అందుబాటులోకి వస్తోంది. కేవలం యాప్‌పై అందించే డిస్కౌంట్లు ఆ నాలుగు రోజుల సేల్‌లో రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు లైవ్‌గా అందుబాటులో ఉంటాయి. యాప్‌లో షాపింగ్ చేసిన ఎంపికైన కొనుగోలుదారులకు రూ.4 లక్షల వరకు బహుమతులు అందుకోనున్నారు.
మొబైల్ యాక్ససరీస్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్లు, డీల్స్ అందుబాటులో ఉంటాయి. ఫోన్ కేసులపై 70 శాతం వరకు, పవర్‌బ్యాంకులపై 70 శాతం వరకు తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. ల్యాప్‌టాప్‌లు రూ.20వేల వరకు డిస్కౌంట్లతో సేల్‌కు వస్తున్నాయి. పీసీ యాక్ససరీస్‌పై 50 శాతం తగ్గింపు లభ్యం కానుంది. కెమెరాలు, హెడ్‌ఫోన్లు, స్పీకర్లు, ఫిట్‌నెస్ ట్రాకర్లు, స్మార్ట్‌వాచ్‌లపై కూడా డీల్స్‌ను అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ ఎకో డివైజ్‌లు, ఫైర్ టీవీ స్టిక్, కిండ్లీ పేపర్‌వైట్, ఈబుక్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి.
నాలుగు రోజుల సమ్మర్ సేల్‌లో భాగంగా ఎవరైతే అమెజాన్ పే బ్యాలెన్స్‌ను వాడి రూ.250కు మించి షాపింగ్ చేస్తారో వారికి అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కూడా అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేయనుంది. స్మార్ట్‌ఫోన్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండీషనర్లు నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ స్కీమ్‌లలో విక్రయానికి వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment