ఈ-కామర్స్ దిగ్గజాల డిస్కౌంట్స్ వార్
ఈ-కామర్స్ దిగ్గజాల డిస్కౌంట్స్ వార్
Published Fri, May 5 2017 3:03 PM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM
కోల్ కత్తా : ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లు మరోసారి ధరల యుద్ధంతో భారీ ఆఫర్లకు తెరలేపబోతున్నాయి. వెనువెంటనే ఈ రెండు దిగ్గజాలు సేల్స్ డేను నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. మే 11 నుంచి మే 14 వరకు గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో అమెజాన్ డిస్కౌంట్ల పండుగ ప్రారంభించబోతుండగా.. ఆ కంపెనీ సేల్ తుది రోజు నుంచి అంటే మే 14 నుంచి 'బిగ్ 10' పేరుతో ఆఫర్ల వెల్లువకు ఫ్లిప్ కార్ట్ సిద్దమవుతోంది. ఫ్లిప్ కార్ట్ 10వ వార్షికోత్సవంలో భాగంగా ఈ రోజుల్లో డిస్కౌంట్స్ సేల్ ఆఫర్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. డీమానిటైజేషన్ దెబ్బకు రెవెన్యూలను కోల్పోయిన వ్యాపారాలకు ఓ వరంలా ఈ డిస్కౌంట్ల పండుగతో ఈకామర్స్ దిగ్గజాలు ముందుకొస్తున్నాయి. ఈ సేల్స్ లో తమ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ లోని ఉత్పత్తులకు, లీడింగ్ బ్రాండ్స్ కు 80 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. దీంతో తమ రెవెన్యూలను మూడు నుంచి నాలిగింతలు పెంచుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొంది.
తాము నిర్వహించబోయే 'గ్రేట్ ఇండియా సేల్' లో కూడా ముందస్తు ఎన్నడూ చూడనివిధంగా వెయ్యికి పైగా బ్లాక్ బస్టర్ డీల్స్ ను ఆఫర్ చేయనున్నట్టు గ్లోబల్ దిగ్గజం అమెజాన్ కూడా పేర్కొంది. విక్రయదారులు తమ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్స్ ఆఫర్ చేయాలని ఫ్లిప్ కార్ట్, అమెజాన్ కంపెనీలు ఆదేశించాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తర్వాత వాటి పరిహారాలను అందిస్తామని చెప్పాయని పేర్కొన్నాయి. డిజిటల్ పేమెంట్లకు అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా అందించాలని తెలిపాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫ్లిప్ కార్ట్ సొంతం చేసుకున్న మరో ఆన్ లైన్ వెబ్ సైట్ మింత్రా సైతం, ఈ సమయంలోనే మెగా-డిస్కౌంట్ సేల్ ను ప్రారంభించబోతుంది. తమ 10వ వార్షికోత్సవంలో భాగంగా భారీ మొత్తంలో డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు ఫ్లిప్ కార్ట్ తెలిపినట్టు టాప్ ఆన్ లైన్ సెల్లర్ చెప్పారు. మే 2 నుంచి నిన్నటిదాక ఫ్లిప్ కార్ట్ సమ్మర్ షాపింగ్ డేస్ పేరిట భారీ ఆఫర్లను కస్టమర్లకు అందించింది.
Advertisement