price war
-
జియో వర్సెస్ ఎయిర్టెల్ ! గూగుల్ షాకింగ్ నిర్ణయం ?
భారత టెలికాం రంగంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఇండియాను వేదికగా చేసుకుని వ్యాపార దిగ్గజ సంస్థలు పోటీకి దిగబోతున్నాయా ? అంటే అవుననే సమాధానమే ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోంది. దీన్ని నిజం చేస్తూ ఇటీవల జాతీయ మీడియాలో కథనాలు సైతం వెలువడుతున్నాయి. ఇండియా టెలికాం సెక్టార్‌లోకి గూగుల్? టెక్ దిగ్గజం, నంబర్ వన్ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఇండియాలోని టెలికాం సెక్టార్‌పై గురి పెట్టింది, టెలికాం పరంగా ప్రపంచంలోనే రెండో పెద్ద మార్కెట్‌గా గుర్తింపు పొందిన ఇండియాలో పాగా వేసేందుకు జాగ్రత్తగా పావులు కదుపుతోంది. ఇప్పటికే జియో నెట్‌వర్క్‌లో రూ. 34,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి 7 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి భారీ దిశగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతోంది. ఎయిర్‌టెల్‌తో చర్చలు టెలికాం సెక్టార్లో జియో నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్న ఎయిర్‌టెల్‌లో భారీ స్థాయిలో పెట్టబడులు పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఏడాది కాలంగా చర్చలు జరుగుతున్నాయని, చాలా అంశాలపై స్పష్టత వచ్చిందని, త్వరలోనే ఈ డీల్ కార్యరూపం దాల్చనుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. ఈ డీల్ ఇండియాలోనే అతి పెద్ద డీల్ అయ్యే అవకాశం ఉందని కూడా టైమ్స్ పేర్కొంది. గూగుల్ వస్తే.. ఎయిర్టెల్, గూగుల్ల మధ్య ఒప్పందం కుదిరితే టెలికాం రంగంలో మరోసారి ప్రైస్‌వార్ తప్పదని, దాని వల్ల వినియోగదారులకు తక్కువ ధరలకే మొబైల్ నెట్వర్క్ సేవలు అందుతాయనే అంచనాలు నెలకొన్నాయి. గతంలో టాటా డొకోమో రాకతో కాల్ పల్స్ రేట్లు తగ్గిపోగా జియో రాకతో డేటా, కాల్ ఛార్జీలు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎయిర్టెల్, జియోల మధ్య ఒప్పందం ఫైనల్ అయితే టెలికాం రంగంలో ప్రైస్‌వార్ తప్పదు. టెలికాంలో గట్టిపోటీ అమెరికా, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత రెండో అతి పెద్ద మార్కెట్ అయిన ఇండియాపై టెక్ దిగ్గజ కంపెనీలు కన్నేశాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గూగుల్‌కి చెందిన ఆండ్రాయిడ్‌దే అగ్రస్థానం. దేశంలో ఉన్న ఫోన్లలో నూటికి డెబ్బై శాతం ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫారమ్ మీదే పని చేస్తున్నాయి. మరోవైపు జియోతో భాగస్వామ్యంలో భాగంగా జియో నెక్ట్స్ పేరుతో బడ్జెట్ ఫోన్‌ను గూగుల్ ఇండియాలో ప్రవేశ పెడుతోంది. తాజాగా మరో అడుగు ముందుకు వేసి ఏకంగా ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లో కీలక భాగస్వామి కానుంది. చదవండి : Google-Apple Deal: గూగుల్ సెర్చ్ ఇంజిన్ కోసం లక్షా పదివేల కోట్లు! అంతకంతకు పెరుగుతూ.. -
IKEA : కొత్తగా సిటీ స్టోర్లు.. ప్రైస్‌వార్‌కి రెడీ
ప్రపంచంలోనే అతి పెద్ద హోం ఫర్నీచర్ తయారీ, అమ్మకాల సంస్థ ఐకియా మరో కొత్త కాన్సెప్టుతో మార్కెట్లోకి రానుంది. అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త ఎత్తులతో వస్తోంది. ఫర్నీచర్ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి తెర లేపనుంది. హైదరాబాద్‌తో మొదలు స్వీడన్‌కి చెందిన అతి పెద్ద ఫర్నీచర్ తయారీ సంస్థ ఐకియా తన తొలి స్టోర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నవీ ముంబైలో రెండో స్టోర్‌ను ఇటీవల ప్రారంభించింది. ఈ రెండు స్టోర్లు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఇందులో తొమ్మిది వేల రకాల ఫర్నీచర్ వస్తువులు సిద్ధంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ తరహా ఆల్ ఇన్ వన్ అనే సూత్రానే పాటిస్తూ వచ్చింది ఐకియా సంస్థ. కానీ ఇటీవల మార్కెటింగ్‌లో కొత్త సిటీ స్టోర్స్ పేరుతో కొత్త కాన్సెప్టును తీసుకొచ్చింది. సిటీ స్టోర్లు విశాలమైన ప్రాంగణంలో అన్ని వస్తువులు ఒకే చోట కష్టమర్లకు లభించాలనే మార్కెటింగ్ టెక్నిక్‌కి స్వల్ప మినహాయింపులు ఇచ్చింది. అన్ని రకాల వస్తువుల స్థానంలో ముఖ్యమైన వస్తువులు లభించే విధంగా ఐకియా ఫర్నీచర్ స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని సిటీ స్టోర్ల పేరుతో ఏర్పాటు చేస్తోంది. పరిమాణంలో ఐకియా స్టోర్ల కంటే సిటీ స్టోర్లు చిన్నవిగా ఉంటాయి. యాభై వేల చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సిటీ స్టోర్లు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ 6,500 రకాల ఫర్నీచర్లు లభిస్తాయి. ఎక్కడంటే ఐకియా సిటీ స్టోర్లు ఇప్పటికే యూరప్‌లో ముఖ్యమైన నగరాల్లో ప్రారంభం అవగా ఇండియాలో హైదరాబాద్, నవీ ముంబై స్టోర్లకు అదనంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నగర శివారు ప్రాంతాల్లో ఈ సిటీ స్టోర్లు రానున్నాయి. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రచురించింది. ధరల తగ్గింపు సిటీ స్టోర్ల ఏర్పాటుతో పాటు ధరలు తగ్గించడం ద్వారా ఎక్కువ కస్టమర్ బేస్‌ను సేల్స్‌ను సాధించాలనే లక్ష్యంతో ఐకియా ఉంది. ఈ మేరకు ఐకియా స్టోర్లలో ఎక్కువగా అమ్ముడయ్యే 50 రకాల వస్తువుల ధరలను 20 శాతం మేరకు తగ్గించాలని నిర్ణయించినట్టు ఐకియా, ఇండియా మార్కెటింగ్ మేనేజర్ పెర్ హార్నెల్ తెలిపారు. ఐకియా స్టోర్ల నిర్వహాణ సామర్థ్యం పెంచడంతో పాటు మార్జిన్లను తగ్గించుకునైనా ధరల తగ్గింపును అమలు చేస్తామన్నారయన. చదవండి: పికప్ వాహనాలకు మహీంద్రా ఫైనాన్స్ -
Samsung Vs One Plus: కెమెరాల పని అయ్యింది ఇక డిస్ప్లేల వంతు!
సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఉన్న ఇండియాలో కొత్త యుద్దానికి తెర లేచింది. ఇంత కాలం చిప్సెట్స్, కెమెరాల విషయంలో పోటాపోటీగా మోడళ్లు విడుదల చేసిన ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పుడు డిస్ప్లే కేంద్రంగా వార్ రెడీ అయ్యాయి. బ్రాండ్ వార్ స్మార్ట్‌ఫోన ఇండస్ట్రీలో గడిచిన ఐదేళ్లలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. శామ్సంగ్, యాపిల్ వంటి బడా కంపెనీలను వెనక్కి నెట్టి మరీ చైనాకు చెందిన వన్‌ప్లస్, షావోమీ, రియల్మీ, ఒప్పో, వివోలు మార్కెట్‌పై పట్టు సాధించాయి. మైక్రోమ్యాక్స్, సెల్కాన్ వంటి దేశీ కంపెనీలను చైనా మొబైల్ బ్రాండ్స్ వెనక్కి నెట్టాయి. నోకియా ఇంకా ఫీచర్ ఫోన్లను దాటి ముందుకు రాలేకపోయింది. హ్యువావే, ఎల్జీ, సోనిలు పత్తా లేకుండా పోయాయి. ప్రస్తుతం శామ్సంగ్, చైనా కంపెనీల మధ్యనే ప్రైస్‌వార్, ఫీచర్ వార్ జరుగుతోంది. ఎన్ని కెమెరాలు, పిక్సెల్ ఎంత స్మార్ట్ఫోన్లకు సంబంధించి గడిచిన నాలుగేళ్లుగా వెనుక వైపు ఎన్ని కెమెరాలు ఉన్నాయి. వాటి మెగాపిక్సెల్ ఎంత అనే అంశం చుట్టూనే ఇటు శామ్సంగ్, అటు షావోమీ వంటి చైనా కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ పోటీ పెరిగి వెనుక వైపు నాలుగు, ముందు వైపు రెండు కెమెరాలు అందించే స్థాయికి చేరుకున్నాయి. ఇక కెమెరా సామర్థ్యానికి సంబంధించి 16 మెగా పిక్సెల్స్ దగ్గర మొదలైన పోటీ 48 మెగా పిక్సెల్స్ మీదుగా 108 మెగా పిక్సెల్స్ వరకు చేరుకుందీ. ఇదే సమయంలో ర్యామ్ కెపాసిటీ విషయంలోనూ పోటీ నెలకొని ఉండేది. ఇక్కడ కూడా ఇరు వర్గాలు సమస్థాయికి చేరుకున్న బ్యాటరీ సామర్థ్యం మీద ఫోకస్ చేశాయి. టాప్ నాచ్, డ్రాప్ నాచ్ అంటూ మోడళ్లు విడుదల చేసినా అవి లాంగ్‌రన్‌లో ప్రభావం చూపలేదు. కెమెరా, ర్యామ్, ప్రాసెసర్లే ప్రధానంగా పోటీ నెలకొంది. డిస్ప్లే క్వాలిటీ విషయంలో పోటీ ఉన్నా హెచ్డీ, ఫుల్హెచ్డీ దగ్గరే చైనా కంపెనీలు ఆగిపోగా శామ్సంగ్ అమోల్డ్ డిస్ప్లే తో అదరగొట్టింది. శామ్సంగ్ నోట్, ఎస్ సిరీస్‌లో 4కే డిస్ప్లేలు ఇచ్చి టాప్‌గా నిలవగా వన్‌ప్లస్ సైతం బరిలోకి దిగింది. వీడియో కంటెంట్‌కి గిరాకీ జియో రాకతో ఒక్కసారిగా ఇండియాలో నెట్ కంటెంట్ వాడకం పెరిగింది. దీనికి తోడు లాక్డౌన్ కారణంగా వీడియో కంటెంట్‌కి డిమాండ్ పెరిగింది. రోజుకో వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ అందుబాటులోకి వస్తోంది. దీంతో డిస్ప్లే క్వాలిటీతో పాటు సైజుకి కూడా ప్రాధాన్యత పెరిగింది. గతేడాదే శామ్సంగ్ జెడ్ సిరీస్‌లో ఫ్లిప్ అంటూ డబుల్ డిస్ప్లే ఫోన్లను అందుబాటులోకి తెచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో జెడ్ సిరీస్‌కే మరిన్ని హంగులు జోడించి ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. జెడ్ సిరీస్‌లో రెండు తెరలు కలిపితే స్క్రీన్ సైజు 7.30 ఇంచులుగా ఉంది. దాదాపు ట్యాబ్ స్థాయిలో ఈ స్ర్రీన్ ఉండనుంది. శామ్సంగ్ వర్సెస్ వన్ ప్లస్ నాణత్య పాటిస్తూ తక్కువ బడ్జెట్లో హై ఎండ్ ఫీచర్లు అందిస్తూ వన్ ప్లస్ బ్రాండ్ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకుంది. హై ఎండ్ సెగ్మెంట్లో యాపిల్, శామ్‌సంగ్‌కి ధీటుగా ఎదిగింది. బడ్జెట్‌కి ప్రాముఖ్యత ఇచ్చే ఇండియన్ మార్కెట్లో స్థిరమైన స్థానం సాధించింది. అన్నింటా శామ్సంగ్, యాపిల్‌కు పోటీ ఇచ్చే వన్‌ప్లస్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదంటోంది. ఆగస్టులో బిగ్ స్క్రీన్ ఫోన్ రిలీజ్ చేస్తామంటూ శామ్సంగ్ దాదాపు రెండు నెలల ముందు నుంచే లీకులు ఇస్తూ వచ్చింది. చివరకు ఆగస్టు 11న డేట్ ఫిక్స్ చేసింది. సరిగ్గా శామ్సంగ్ ఈవెంట్‌కి ఒక్క రోజు ముందే వన్‌ప్లస్ సప్రైజింగ్ న్యూస్ చెప్పింది. తమ బ్రాండ్ నుంచి కూడా బిగ్ స్క్రీన్ ఫోన్ వస్తోందంటూ వన్‌ప్లస్ యూఎస్ఏ ట్విట్టర్ పేజీలో టీజర్ రిలీజ్ అయ్యింది. దీంతో రెండు కంపెనీల మధ్య ఆసక్తికర పోరుకి తెరలేచింది. 8.11 10am EThttps://t.co/mmPi4jlrhx pic.twitter.com/U6lPdrFnjf — OnePlus➕ (@OnePlus_USA) August 10, 2021 ప్రభావం చూపుతుందా ? మొబైల్ బ్రాండ్ల మధ్య ధర, కెమెరా, ర్యామ్, చిప్సెట్, బ్యాటరీ బ్యాకప్ విషయంలోనే గట్టి పోటీ నెలకొంది. వీటి ఆధారంగానే అమ్మకాలు సాగాయి. మధ్యలో ఫింగర్ ప్రింట్ స్కానర్, నాచ్, డిస్ ప్లే రి ఫ్రెష్ రేటు విషయంలో కంపెనీలు ప్రయోగాలు చేసినా అవేమీ అమ్మకాలపై గణనీయమైన ప్రభావం చూపలేదు. ఇప్పుడు బిగ్ స్క్రీన్ వార్ నిజంగానే ప్రభావం చూపుతుందా లేక కొద్ది కాలం హడావుడి తర్వాత సద్దుమణుగుతుందా అనేది తేలాల్సి ఉంది. -
బాలెనో, ఆల్ట్రోజ్ కంటే తక్కువ ధరలో.. i20 ఎరా!
న్యూఢిల్లీ: హ్యచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి హ్యుందాయ్ తెరలేపింది. పప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఐ 20 ధరలు తగ్గించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మార్కెట్లో పోటీగా ఉన్నా టాటా, నెక్సాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. మాగ్నాకంటే తక్కువ హ్యచ్‌బ్యాక్ సెగ్మెంట్లో హ్యుందాయ్ ఐ20కి మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఐ20 మోడల్లో మాగ్నా వేరియంట్ ధర తక్కువ. ఢిల్లీ ఎక్స్ షోరూమ్‌లో మాగ్నా ట్రిమ్ వేరియంట్ ధర రూ. 6.85 లక్షల నుంచి రూ.8.21 లక్షల వరకు లభిస్తోంది. ఇప్పుడు ఇంత కంటే తక్కువ ధరలో ఐ20 ఎరా ట్రిమ్ మోడల్‌ను మార్కెట్లోకి తెస్తోంది. రూ. 6 లక్షల దగ్గర కేవలం పెట్రోల్ వెర్షన్లోనే లభించే హ్యుందాయ్ ఐ20 ఎరా ట్రిమ్ మోడల్ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇదే సెగ్మెంట్లో టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 5.80 లక్షలు, నెక్సా బాలెనో ధర రూ. 5.98 లక్షలుగా ఉంది. ఇంచుమించు వీటికి దగ్గరగానే ఐ20 ఎరా ట్రిమ్ ప్రైస్ ఉండేలా హ్యుందాయ్ జాగ్రత్త పడుతోంది. నో కాంప్రమైజ్ ధర తగ్గించినప్పటికీ కారు బిల్ట్ క్వాలిటీలో హ్యుందాయ్ పెద్దగా కాంప్రమైజ్ కావడం లేదు.పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, మాన్యువల్ ఎయిర్ కండీషన్, మాన్యువల్ గేర్ సిస్టమ్ అందిస్తోంది. అయితే వెనుక వైపు పవర్ విండోస్‌కి బదులు మాన్యువల్ విండోస్ అందించింది. నేటి ట్రెండ్‌కి తగ్గ ఇన్ఫోంటైన్ సిస్టమ్ కాకుండా బేసిక్ ఇన్ఫోంటైన్ సిస్టమ్ అందిస్తోంది. త్వరలో ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాలు హ్యుందాయ్ వెల్లడించనుంది. -
అమ్మ నా ‘బత్తాయో’..! ధర అంతేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు విటమిన్-సీ అధికంగా ఉండే పండ్ల వినియోగానికి డిమాండ్ పెరగడంతో బత్తాయి పండ్లకు గిరాకీ పెరిగింది. దేశవ్యాప్తంగా కరోనా విస్తృతి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి సైతం వ్యాపారులు ఇక్కడికే వచ్చి రైతుల నుంచి నేరుగా కొనుగోళ్లు చేస్తుండటంతో బహిరంగ మార్కెట్లకు బత్తాయి రాక తగ్గింది. ఒక్క కొత్తపేట పండ్ల మార్కెట్‌కే కనీసంగా రోజుకు 300 టన్నుల మేర బత్తాయి సరఫరా తగ్గింది. దీంతో రాష్ట్ర మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధర అమాంతం పెరుగుతోంది. గత ఏడాది ఇదే సమయానికి కిలో రూ.20 నుంచి రూ.30 పలకగా, ఇప్పుడది ఏకంగా రూ.70కి చేరి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. పొరుగు నుంచి ఎగబడ్డ వ్యాపారులు రాష్ట్రంలో రోజుకు ఐదు వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదవుతుండగా, ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు సామాన్యులు సైతం ప్రతిరోజూ 500 మిల్లీగ్రామ్ల విటమిన్–సీ పండ్లను రోజువారీ ఆహారంగా తీసుకోవాలని, దీనిద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో సిట్రిక్ ఆమ్లం అధికంగా ఉండే బత్తాయి వైపు సామాన్యులు ఎగబడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా బత్తాయికి డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో బత్తాయి సాగు ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు నేరుగా రైతుల పంటల వద్దకే వెళ్లి కొనుగోళ్లు చేస్తున్నారు. వ్యాపారులే కోతలు చేసి, ప్యాకేజింగ్, రవాణా, లోడింగ్ ఇలా అన్నీ సొంత ఖర్చులతో కొనుగోళ్లు చేస్తుండటంతో రైతులు వీరికి అమ్ముకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎక్కువగా ఢిల్లీ, హరియాణా, కోల్‌కతాతోపాటు రాజస్తాన్ నుంచి వ్యాపారులు టన్నుకు రూ.35 వేల నుంచి 40 వేలకు కొనుగోలు చేస్తున్నారు. బయటి రాష్ట్రాలకే ఎక్కువగా ఎగుమతి అవుతుండటంతో హైదరాబాద్ మార్కెట్‌కు బత్తాయి రాక తగ్గిపోయింది. ముఖ్యంగా కొత్తపేట పండ్ల మార్కెట్‌కు దీని సరఫరా తగ్గింది. ప్రతి ఏటా కొత్తపేట మార్కెట్‌కు రోజుకు 500–600 టన్నుల మేర బత్తాయి రాగా, ఈ ఏడాది కేవలం 100–125 టన్నులు మాత్రమే వస్తోంది. ఇది మార్కెట్ అవసరాలను ఏమాత్రం తీర్చడం లేదు. వచ్చిన కొద్దిపాటి బత్తాయిని వ్యాపారులు హోల్‌సేల్‌లో టన్నుకు రూ.40 వేల నుంచి 50వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. అంటే కిలో రూ.40–50 వరకు ఉంది. ఇది గత ఏడాది ధరలతో పోలిస్తే రూ.20 అధికం. ఇదే బత్తాయిని బహిరంగ మార్కెట్‌కు వచ్చే సరికి రూ.70 వరకు కొనుగోలుదారులకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. నిమ్మ, కివీ సైతం... ఇక సీ-విటమిన్ అధికంగా ఉండే నిమ్మకాయలకు చెప్పలేనంత డిమాండ్ ఉంది. గతంలో బహిరంగ మార్కెట్లలో రూ.10కి 3 నిమ్మకాయలు విక్రయించగా, ప్రస్తుతం ఒక్క నిమ్మకాయే అమ్ముతున్నారు. సీ-విటమిన్‌కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో కివీ పండ్ల ధరలు సైతం అమాంతం పెరిగాయి. గత ఏడాది 24 పండ్లు ఉండే ఒక్క బాక్స్ ధర రూ.వెయ్యి పలుకగా, ప్రస్తుతం రూ.3 వేలకు చేరింది. రోజుకు కొత్తపేట మార్కెట్‌కు వెయ్యి బాక్స్‌ల వరకు రాగా, ఇప్పుడది 500 నుంచి 600 బాక్స్‌లకు తగ్గింది. దీంతో అటు పండ్ల లభ్యత లేక.. ఇటు అధిక ధరలకు పండ్లు కొనలేక వినియోగదారులు సతమతమవుతున్నారు. చదవండి: కరోనా ఎంతున్నా ఎన్నికలు జరుపుతాం చదవండి: ఉత్సవంతో వచ్చిన కరోనా.. అటవీ గ్రామాల్లో కల్లోలం -
25 శాతంపైగా పెరిగిన క్రూడ్
క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర గురువారం 25 శాతం పైగా పెరిగింది. రష్యా–సౌదీ అరేబియా మధ్య నెలకొన్న ‘ప్రైస్‌వార్’ ఉపశమించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్లు వచ్చిన వార్తలు దీనికి నేపథ్యం. రష్యా, సౌదీలు 10 మిలియన్ బ్యారల్స్ నుంచి 15 మిలియన్ బ్యారల్స్ వరకూ చమురు ఉత్పత్తి కోత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ అంచనావేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఒకేరోజు క్రూడ్ ఆయిల్ ఈ స్థాయిలో పెరగడం ఒక రికార్డు. ఈ వార్తరాసే 10 గంటల సమయంలో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 23% లాభంతో 30.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 35.99 డాలర్ల స్థాయినీ చూసింది. ఇక లైట్‌స్వీట్ నైమెక్స్ క్రూడ్ ధర 25 శాతం (4.5 డాలర్లు) లాభంతో 25 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా ఒక దశలో 27.30 డాలర్ల స్థాయినీ తాకింది. 40 డాలర్లకు పైగా పెరిగిన పసిడి... ఇకమరోవైపు పసిడి ఔన్స్ (31.1 గ్రా) ధర కూడా న్యూయార్క్ ప్యూచర్స్ మార్కెట్లో ఈ వార్తరాసే సమయానికి 44 డాలర్లు పెరిగి 1,635 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒకదశలో 1,637 డాలర్లను కూడా చూసింది. కరోనా ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై కొనసాగుతుందన్న అంచనాలు పసిడి పెరుగుదలకు నేపథ్యం. లాభాల్లో అమెరికా‘ఈక్విటీ’లు మరోవైపు అమెరికా స్టాక్ మార్కెట్లు ఈ వార్తరాసే 10 గంటల సమయంలో కొంత లాభాల్లో ఉండడం గమనార్హం. అయితే ఇది కేవలం షార్ట్ సెల్లింగ్ ప్రభావమని కొందరు విశ్లేషిస్తున్నారు. మార్కెట్లు బులిష్ ధోరణిలోకి వెళ్లే అవకాశం ఇప్పుడు కనబడ్డంలేదన్నది వారి అభిప్రాయం. -
ఈ-కామర్స్ దిగ్గజాల డిస్కౌంట్స్ వార్
కోల్ కత్తా : ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లు మరోసారి ధరల యుద్ధంతో భారీ ఆఫర్లకు తెరలేపబోతున్నాయి. వెనువెంటనే ఈ రెండు దిగ్గజాలు సేల్స్ డేను నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. మే 11 నుంచి మే 14 వరకు గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో అమెజాన్ డిస్కౌంట్ల పండుగ ప్రారంభించబోతుండగా.. ఆ కంపెనీ సేల్ తుది రోజు నుంచి అంటే మే 14 నుంచి 'బిగ్ 10' పేరుతో ఆఫర్ల వెల్లువకు ఫ్లిప్ కార్ట్ సిద్దమవుతోంది. ఫ్లిప్ కార్ట్ 10వ వార్షికోత్సవంలో భాగంగా ఈ రోజుల్లో డిస్కౌంట్స్ సేల్ ఆఫర్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. డీమానిటైజేషన్ దెబ్బకు రెవెన్యూలను కోల్పోయిన వ్యాపారాలకు ఓ వరంలా ఈ డిస్కౌంట్ల పండుగతో ఈకామర్స్ దిగ్గజాలు ముందుకొస్తున్నాయి. ఈ సేల్స్ లో తమ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ లోని ఉత్పత్తులకు, లీడింగ్ బ్రాండ్స్ కు 80 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. దీంతో తమ రెవెన్యూలను మూడు నుంచి నాలిగింతలు పెంచుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొంది. తాము నిర్వహించబోయే 'గ్రేట్ ఇండియా సేల్' లో కూడా ముందస్తు ఎన్నడూ చూడనివిధంగా వెయ్యికి పైగా బ్లాక్ బస్టర్ డీల్స్ ను ఆఫర్ చేయనున్నట్టు గ్లోబల్ దిగ్గజం అమెజాన్ కూడా పేర్కొంది. విక్రయదారులు తమ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్స్ ఆఫర్ చేయాలని ఫ్లిప్ కార్ట్, అమెజాన్ కంపెనీలు ఆదేశించాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తర్వాత వాటి పరిహారాలను అందిస్తామని చెప్పాయని పేర్కొన్నాయి. డిజిటల్ పేమెంట్లకు అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా అందించాలని తెలిపాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫ్లిప్ కార్ట్ సొంతం చేసుకున్న మరో ఆన్ లైన్ వెబ్ సైట్ మింత్రా సైతం, ఈ సమయంలోనే మెగా-డిస్కౌంట్ సేల్ ను ప్రారంభించబోతుంది. తమ 10వ వార్షికోత్సవంలో భాగంగా భారీ మొత్తంలో డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు ఫ్లిప్ కార్ట్ తెలిపినట్టు టాప్ ఆన్ లైన్ సెల్లర్ చెప్పారు. మే 2 నుంచి నిన్నటిదాక ఫ్లిప్ కార్ట్ సమ్మర్ షాపింగ్ డేస్ పేరిట భారీ ఆఫర్లను కస్టమర్లకు అందించింది. -
ఆ కాల్స్‌కు జియో స్పెషల్ ఆఫర్
తక్కువ ధరలకే హైస్పీడ్ 4జీ ఇంటర్నెట్, ఉచిత కాల్స్ అంటూ దేశీయ టెలికాం మార్కెట్లో ధరల యుద్ధాన్ని ప్రారంభించిన రిలయన్స్ జియో, మరో వార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతర్జాతీయ కాల్స్ పైనా ఇతర టెలికాం దిగ్గజాలతో ధరల యుద్ధాన్ని ప్రకటించింది. 'రేట్ కట్టర్ ప్లాన్' ను ప్రకటించింది. ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్న యూజర్లకు వారి అంతర్జాతీయ కాల్ ఛార్జీలు భారీగా కిందకి దిగొస్తాయని రిలయన్స్ జియో తన వెబ్సైట్లో పేర్కొంది. నిమిషానికి కనిష్టంగా మూడు రూపాయల ఛార్జీ మాత్రమే వేయనున్నట్టు పేర్కొంది. '' అమెరికా, కెనడా, న్యూజిలాండ్, హాంకాంగ్, సింగపూర్, అండోరా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, ఫ్రెంచ్ గినియా, ఇటలీ, లుక్సెంబర్గ్, మాల్టా, మంగోలియా, మోరోకో, పోలాండ్, పోర్చుగల్, రోమానియా, స్వీడన్, స్విట్జర్లాండ్, తైవాన్, యూకే వంటి దేశాలకు కాల్స్ చేసుకునే జియో యూజర్లకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది'' అని తెలిపింది. ఈ దేశాలకు కాల్స్ చేసుకునే జియో యూజర్లకు నిమిషానికి 3 రూపాయల ఛార్జీ మాత్రమే వేయనున్నట్టు వెల్లడించింది. అయితే 501 రూపాయలతో రిలయన్స్ జియో ''రేట్ కట్టర్ ప్లాన్'' ను యూజర్లు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రాన్స్, పాకిస్తాన్, ఇజ్రాయిల్, జపాన్, అర్జెంటీనా, డెన్మార్క్, దక్షిణకొరియా దేశాల కాల్స్ రేట్లను నిమిషానికి 4.8గా నిర్ణయిస్తున్నట్టు కంపెనీ వెబ్ సైట్ రిపోర్టు చేసింది. జియో ధన్ ధనా ధన్ ఆఫర్ కు పోటీగా తమ పోస్టు పెయిడ్ కొత్త ఆఫర్లు ప్రకటించిన ఎయిర్ టెల్ విదేశాలకు వెళ్లేవారికి డిస్కౌంట్ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. వెంటనే జియో కూడా అంతర్జాతీయ కాల్స్ పైనా ధరల యుద్ధానికి తెరతీసింది. -
టీవీ రంగంలో స్మార్ట్ ఫోన్ కంపెనీల దూకుడు..!
కోల్ కత్తా : ఇప్పటివరకూ ధరల పోటీ కేవలం స్మార్ట్ ఫోన్లకే అనుకున్నాం.. కానీ టెలివిజన్ రంగంలోనూ ఈ పోటీ తెరలేవబోతోంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తమదైన శైలిలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో, చైనా లీ ఎకోలు భారత టెలివిజన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయట. చౌకైన ధరలకే ఈ టీవీలను మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే టీవీ మార్కెట్లో టాప్ బ్రాండ్లగా ఉన్న శామ్ సంగ్, ఎల్ జీ, సోనీలకు పోటీగా.. వారికి సీరియస్ చాలెంజ్ లా ఈ దీపావళి కంటే ముందే మార్కెట్లోకి రావాలని రిలయన్స్ జియో, లీఎకో ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. లైఫ్ బ్రాండ్ కింద వివిధ స్క్రీన్ సైజుల్లో స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను రిలయన్స్ జియో త్వరలోనే ఆవిష్కరించబోతుందట. ప్రస్తుతం ఆ కంపెనీ 4జీ-ఎల్ టీఈ స్మార్ట్ ఫోన్లను కలిగిఉంది. మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లో ఇవి అందుబాటులో ఉండనున్నాయని తెలుస్తోంది. మూడు స్క్రీన్ సైజులు 43 అంగుళాలు, 50 అంగుళాలు, 65 అంగుళాలను టీవీ సెట్లకు రిలయెన్స్ మార్గనిర్దేశనం చేస్తుందట. హై డెఫినేషన్ 4కే స్క్రీన్లతో టీవీలను ప్రవేశపెట్టడంతో, జియో అప్ కమింగ్ 4జీ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులను కూడా జోడించనుంది. 4జీ సర్వీసులతో టీవీలను వినియోగదారుల ముందుకు తీసుకురావడం అత్యంత ముఖ్యమైన మార్గమని... మార్కెట్లో అగ్రస్థానంలో నిలవడానికి చౌకైన ధరలను ఆఫర్ చేస్తామని కంపెనీకి చెందిన ఓ ప్రతినిధి పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో దూసుకుపోతున్న మరో బ్రాండ్ లీఎకో.. చౌకైన ధరల్లో వచ్చే నెల టీవీ మార్కెట్లోకి రాబోతుందట. ఎలాంటి లాభాలను ఆశించకుండా.. స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో అనుసరించిన వ్యూహంతోనే టీవీలనూ ప్రవేశపెడుతుందని సీనియర్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్స్ తెలిపారు. మన్నిక, ప్రత్యేకతలు దగ్గర అసలు రాజీ పడకుండా టీవీ సెట్లను ప్రవేశపెడతామని చైనీస్ కంపెనీ తెలుపుతోంది. -
ఫ్లిప్‌కార్ట్ ను దెబ్బకొట్టిన అమెజాన్
బెంగళూరు : ధరల కోతతో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తో క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆటకు తెరతీసింది. తన ప్లాట్ ఫాం వాడుకున్నందుకు అమ్మకందారులకు విధించే ఫీజుల్లో కొన్ని కేటగిరీ ఉత్పత్తులకు అమెజాన్ 1 నుంచి 7శాతం వరకు కోత విధించిన్నట్టు పేర్కొంది. కరెక్టుగా తనకు ప్రత్యర్థిగా ఉన్న ఫ్లిప్ కార్ట్ పెంచిన అమ్మకదారుల కమిషన్ అమలుచేసే మూడు రోజుల ముందు అమెజాన్ ఈ నిర్ణయం ప్రకటించింది. దీంతో ఓ కొత్త రూపంలో ఈ-కామర్స్ స్పేస్ లో ధరల యుద్ధం ప్రారంభం కాబోతుందని స్పష్టమవుతోంది. పర్సనల్ కంప్యూటర్లు, మొబైల్ డివైజ్ లు, టాబ్లెట్స్, ఎలక్ట్రానిక్స్, మూవీస్, మ్యూజిక్, వీడియో గేమ్స్, వీడియో గేమ్ కన్సోల్స్, నాన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సాప్ట్ వేర్, మ్యూజికల్ ఇన్ స్ట్రుమెంట్స్, పర్సనల్ కేర్ అప్లియెన్స్ లకు ఈ కోత ఫీజులను నేటి(శుక్రవారం) నుంచి అమలు చేయనున్నట్టు కంపెనీ అమ్మకందారులకు ఈ-మెయిల్ ద్వారా ప్రకటించింది. ఈ ఫీజుల కోతతో అమ్మకందారులు ఈ ప్రయోజనాలను వినియోగదారులకు చేరవేసి, ఉత్పత్తులపై ధరలు తగ్గించాలని భావిస్తున్నారు. అమెజాన్ ఈ ఫీజు కోత నిర్ణయం ఫ్లిప్ కార్ట్ ఫ్లాట్ ఫాంపై ఉన్న అమ్మకందారులకు అవరోధంగా మారబోతోంది. ఫ్లిప్ కార్ట్ నుంచి బయటికి వెళ్లేందుకు అమ్మకందారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఫ్లిప్ కార్ట్ ఇటీవల తీసుకున్న వివిధ ఉత్పత్తులపై కమిషన్ పెంపు, ఈ నెల 20 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఫ్లిప్ కార్ట్ అమ్మకాలకు గండికొడుతున్నట్టు తెలుస్తోంది. " అవును..కొన్ని కేటగిరీల్లో ఉత్పత్తులపై అమ్మకందారులకు రెఫరల్ ఫీజులను తగ్గించాం.. ఈ సవరించిన రేట్లతో ప్లాట్ ఫామ్ అమ్మకందారుల ప్రయోజనాలు మెరుగుపడి, విజయతీరాలకు చేరుకోవడానికి గణనీయమైన సాయం అందుతుంది" అని అమెజాన్ ఇండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. -
ఇండిగో ఆఫర్ ఇదిగో..
స్పైస్ జెట్ రూ.511 ఆఫర్ అనంతరం విమానసంస్థల్లో ధరల యుద్ధం ఊపందుకుంది. స్పైస్ జెట్ కు కౌంటర్ గా భారత అతిపెద్ద విమానసంస్థ ఇండిగో సైతం అడ్వాన్స్ బుకింగ్ లపై రేట్లను తగ్గిసూ ప్రకటించింది. గుర్గావ్ కు చెందిన ఈ ఇండిగో సంస్థ దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారికి రూ.806కే టిక్కెట్ ధరను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. స్పైస్ జెట్ రూ.511 ఆఫర్ ను ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇండిగో ఈ ఆఫర్ ను ప్రకటించింది. జూలై 4 నుంచి సెప్టెంబర్ 30 వరకూ ప్రయాణించే వారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుదని, మే19 వరకూ జరిగిన బుకింగ్స్ పై ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. శ్రీనగర్ నుంచి చంఢీఘర్, శ్రీనగర్ నుంచి జమ్మూ మార్గాల్లో ప్రయాణించే ప్యాసెంజర్లకు రూ.806కే టిక్కెట్ ను అందిస్తామని పేర్కొంది. ఢిల్లీ-ముంబాయి, ఢిల్లీ-కోల్ కత్తా మార్గాలకు రూ.2,668 నుంచి, ఢిల్లీ నుంచి బెంగళూరుకు రూ.3,408 ల నుంచి టిక్కెట్ ధరలుంటాయని ఇండిగో పేర్కొంది. వచ్చే వారంలో ఢిల్లీ-ముంబాయి మార్గాల్లో ప్రయాణించే వారికి మొత్తంగా రూ.4,705లకు టికెట్ ధర అందుబాటులో ఉన్నట్టు ఇండిగో వెబ్ సైట్ తెలిపింది. కానీ ఈ డిస్కౌంట్ స్కీమ్ పై ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయో కంపెనీ వెల్లడించలేదు. స్పైస్ జెట్ ఆఫర్ చేసిన రూ.511 టికెట్ పై అదనపు పన్నులను ప్యాసెంజర్లే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ మే 19తో క్లోజ్ అవుతుంది. 2016 జూన్ 15 నుంచి 2016 సెప్టెంబర్ మధ్యలో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ట్రావెల్ పరిశ్రమకు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలం ఎక్కువగా డిమాండ్ ఉండే కాలం కావడంతో, ఈ ప్రమోషనల్ స్కీమ్ లను ఎయిర్ లైన్స్ ప్రకటిస్తున్నాయి. కొన్ని విదేశీ మార్గాలకు రూ.2,111 ధరనుంచి టికెట్లను స్సైస్ జెట్ ఆఫర్ చేస్తోంది. -
స్పైస్‌జెట్ నుంచీ చవక విమాన టికెట్లు!!
చవక విమాన ప్రయాణాల కాలం మొదలైపోయింది. నిన్న మొన్నటి వరకు ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ తన ప్రారంభ ఆఫర్‌గా 339 రూపాయల నుంచి టికెట్లు మొదలుపెడితే, ఇప్పటికే రంగంలో ఉన్న స్పైస్ జెట్ ఇప్పుడు స్వదేశీ ప్రయాణాల్లో రూ.2,999కే టికెట్ ఇస్తామంటూ ఆఫర్ మొదలుపెట్టింది. దీనికి కూడా కేవలం మూడు రోజుల పాటే టికెట్ బుకింగ్ అవకాశం ఉంది. అయితే, ప్రయాణ కాలాన్ని మాత్రం స్పైస్ జెట్ కాస్తంత ఎక్కువగానే ఇచ్చింది. మంగళ, బుధ, గురువారాల్లో బుక్ చేసుకునే ఈ టికెట్లతో జూలై 6వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 28వ తేదీ వరకు ప్రయాణాలు చేయొచ్చు. నేరుగా గమ్యానికి వెళ్లే విమానాలతో పాటు ఎక్కడైనా ఒక ఎయిర్‌పోర్టులో ఆగి మళ్లీ వెళ్లే ప్రయాణాలకు కూడా ఇది వర్తిస్తుందని, ప్రధానంగా ద్వితీయశ్రేణి నగరాల్లో ట్రాఫిక్‌ను పెంచేందుకు ఈ ఆఫర్ తీసుకొచ్చామని స్పైస్ జెట్ పేర్కొంది. మరోవైపు.. ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ తాను బుకింగ్ మొదలుపెట్టిన మొదటి రెండు రోజుల్లోనే 25వేల ప్రమోషనల్ టికెట్లు అమ్మింది. బెంగళూరు నుంచి గోవాకు వెళ్లే మొదటి విమాన టికెట్లయితే కేవలం 10 నిమిషాల్లోనే అయిపోయాయి. మార్కెట్లో తమకు చాలా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, తాము ముందునుంచి ఇచ్చిన హామీలకు కట్టుబడే ఉంటామని ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో మిట్టు శాండిల్య చెప్పారు.