
సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ మేకర్ లెనోవా అమెజాన్, మోటో స్టోర్‌లో పలు స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌పై భారీ డిస్కాంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈనెల 13 నుంచి 15 వరకూ పరిమిత కాలం వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. వివిధ మోడళ్లపై రూ 6వేల వరకూ తగ్గింపును ప్రకటించింది. రూ 16,999కు లభించే మోటో జీ5ఎస్ ప్లస్‌ను రూ 13,999కే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎక్ఛ్సేంజ్‌పై మరో రూ 2,000 అదనపు ఆఫర్‌ను ముందుకుతెచ్చింది.
ఇక రూ 13,999 పలికే మోటో జీ5ఎస్‌ను రూ 11,999కి ఆఫర్ చేస్తోంది. మోటో జీ5ప్లస్‌ను రూ 11,999 నుంచి రూ 8,499కి అందుబాటులో ఉంచింది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తుండటంతో వినియోగదారులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని లెనోవా కోరింది.
Comments
Please login to add a commentAdd a comment