Moto G5 Plus
-
అమెజాన్‌లో ఆ ఫోన్లు చౌక
సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ మేకర్ లెనోవా అమెజాన్, మోటో స్టోర్‌లో పలు స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌పై భారీ డిస్కాంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈనెల 13 నుంచి 15 వరకూ పరిమిత కాలం వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. వివిధ మోడళ్లపై రూ 6వేల వరకూ తగ్గింపును ప్రకటించింది. రూ 16,999కు లభించే మోటో జీ5ఎస్ ప్లస్‌ను రూ 13,999కే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎక్ఛ్సేంజ్పై మరో రూ 2,000 అదనపు ఆఫర్‌ను ముందుకుతెచ్చింది. ఇక రూ 13,999 పలికే మోటో జీ5ఎస్‌ను రూ 11,999కి ఆఫర్ చేస్తోంది. మోటో జీ5ప్లస్‌ను రూ 11,999 నుంచి రూ 8,499కి అందుబాటులో ఉంచింది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తుండటంతో వినియోగదారులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని లెనోవా కోరింది. -
మోటో జీ5 ప్లస్‌పై భారీ డిస్కౌంట్: రేపే ఆఖరు
సాక్షి, ముంబై: మోటో జీ 5 ప్లస్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. ప్రముఖ మొబైళ్ల తయారీ సంస్థ మోటరోలా..మోటో జీ సిరీస్‌లో భాగంగా గత ఏడాది లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇపుడు రూ.5వేల తగ్గింపుతో లభిస్తోంది. ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా 20 మొబైల్స్, 18 బొనాంజా పేరుతో జనవరి 3-5వరకు పరిమిత కాల ఆఫర్‌గా ఈ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ తాజా తగ్గింపుతో మోటరోలా ట్విట్టర్ సమాచారం ప్రకారం ఐదో జనరేషన్ స్మార్ట్‌ఫోన్ మోటో జీ 5 ప్లన్ ఇపుడు రూ 9,999 లభ్యం. ఈ ఆఫర్ జనవరి 5వ తేదీవరకుమాత్రం అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ లో సమాచారం 32జీబీ స్టోరేజ్ మోటో జీ 5 ప్లన్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 7వేల తగ్గింపుతో 9,999కే అందిస్తోంది. దీని అసలు ధరను రూ.16,999. మోటో జీ 5 ప్లన్ ఫీచర్లు 5.2 అంగుళాల టచ్‌స్క్రీన్ 2 గిగాహెడ్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ మరోవైపు ఇప్పటివరకూ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న మోటో ఈ4 ప్లస్ అమెజాన్లోకూడా ఇపుడు అందుబాటులోకి వచ్చింది. #Uncompromise this #NewYear with #motog5plus at a price off of Rs. 4000/- Valid till 5th Jan only! https://t.co/qDphPu5i0p — Motorola India (@motorolaindia) January 4, 2018 -
మోటో జీ5 ప్లస్ ధర తగ్గింది
లెనోవో బ్రాండు మోటోరోలా తన మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. మోటో జీ5ఎస్ ప్లస్ లాంచింగ్ అనంతరం వెంటనే మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గిస్తున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. మార్చిలో లాంచింగ్ సందర్భంగా రూ.16,999గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర, అనంతరం రూ.15,999కు దిగొచ్చింది. ప్రస్తుతం మరో వెయ్యి రూపాయల మేర తగ్గి 14,999 రూపాయలకే మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కంపెనీ చెప్పింది. ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే ఈ ఫోన్ అప్పట్లో లభ్యమయ్యేది. ఇటీవలే అమెజాన్ ఇండియా ద్వారా కూడా ఈ ఫోన్‌ను మోటో విక్రయిస్తోంది. మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు... 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ 2గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 625 ఆక్టాకోర్ ఎస్ఓసీ 4జీబీ ర్యామ్ 12 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 4జీ ఎల్టీఈ -
అదరగొట్టే ఆఫర్లతో మోటో జీ5 ప్లస్ లాంచ్
అదరగొట్టే ఆఫర్లతో మోటో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. న్యూ ఢిల్లీ ఈవెంట్ గా మోటో జీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను, రూ.14,999కు ఆవిష్కరించింది. గత ఫిబ్రవరిలో బెర్సిలోనాలో జరిగిన ఎండబ్ల్యూసీ 2017 ఈవెంట్లో గ్లోబల్ గా ఆవిష్కరించిన ఈ ఫోన్ ను, కొన్ని వారాల వ్యవధిలోనే ఇండియా మార్కెట్లోకి తెచ్చేసింది. నేటి అర్థరాత్రి 11.59 నుంచి ఎక్స్ క్లూజివ్ గా ఈ ఫోన్ ఫ్లిప్ కార్డ్ లోనే అందుబాటులో ఉండనుంది. లాంచింగ్ డే సందర్భంగా పలు ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఎక్స్చేంజ్ పై 1,500 ఆఫ్ ను, ఎస్ బీఐ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ను కంపెనీ అందించనుంది. అదనంగా రూ.1,199 విలువతో ఉచిత బైబ్యాక్ గ్యారెంటీని ఇది కల్పిస్తోంది. ఈ బైబ్యాక్ ఆఫర్ కింద మోటో జీ5 ప్లస్ ను కొనుగోలు చేసిన ఆరు లేదా ఎనిమిది నెలల్లో మరో స్మార్ట్ ఫోన్ ను యూజర్లు ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పై పొందవచ్చు. అంతేకాక ఎలాంటి ఈఎంఐ ఖర్చులు లేకుండా నెలకు రూ.1889 చెల్లింపుతో దీన్ని కొనుగోలు చేయొచ్చు. రూ.599, రూ.1299 విలువ కలిగిన మోటో పల్స్ హెడ్ సెట్లను యూజర్లు పొందవచ్చు. 2జీబీ, 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ వెర్షన్లలో ఇది లాంచ్ అయింది. మోటో జీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు... 5.2 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ డిస్ ప్లే ఆండ్రాయిడ్ నోగట్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ 3జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ధర రూ.14,999 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ ధర రూ.16,999 12ఎంపీ రియర్ ఫేసింగ్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ పూర్తిగా మెటల్ బాడీతో లాంచ్ అయిన తొలి మోటో ఫోన్ ఇదే. -
మోటో రెండు స్మార్ట్ ఫోన్లు
-
మోటో రెండు స్మార్ట్ ఫోన్లు
బార్సిలోనా: లెనోవా బ్రాండ్ మోటో కొత్త స్మార్ట్ ఫోన్లను పరిచయం చేయనుంది. వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ 2017 లో మోటో 5, మోటా 5 ప్లస్ మొబైళ్లను అప్ గ్రేటెడ్ స్పెసిఫికేషన్స్‌తో, కాంపిటీటివ్ధరలతో ఫ్రెష్‌లుక్ లో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ల ఫస్ట్‌లుక్ లాంచ్ చేసింది. అయితే మోటో 5 ప్లస్ ను భారత మార్కెట్లో మార్చి 15న విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానాలను ఇప్పటికే మీడియాకు పంపిస్తోంది. ఈ రెండు ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టంఆధారంగా పనిచేయనున్నాయి. అలాగే జి 5 ప్లస్ ను రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానుంది. జీ5 ధరను సుమారు రూ.14వేలుగాను, జీ5 ప్లస్ ధరను రూ.15, 300గాను కంపెనీ 3జీబీ, 32జీబీ వేరియంట్ ధర సుమారు రూ.19,700గాను ఉండనునున్నాయి. మోటో 5 ఫీచర్లు 5 అంగుళాల డిస్ ప్లే ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టం 1.4గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజ్ 13ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 2800ఎంఏహెచ్ బ్యాటరీ మోటో 5 ప్లస్ ఫీచర్లు 5 .2 అంగుళాల డిస్ ప్లే 1.4గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ 12 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000ఎంఏహెచ్ బ్యాటరీ టర్బో చార్జర్ -
మోటో కొత్త ఫోన్లు లీక్.. ఫీచర్లివేనట!
లెనోవో మిడ్ రేంజ్లో తీసుకొస్తున్న మోటో జీ5, జీ5 ప్లస్ స్మార్ట్ఫోన్లు లాంచింగ్‌కు ముందే లీకైపోయాయి. ఫిబ్రవరి 26న బార్సిలోనాలో జరుగబోయే ఎండబ్ల్యూసీ 2017 ఈవెంట్లో వీటిని కంపెనీ అధికారికంగా లాంచ్ చేసేందుకు రంగం చేసుకుంది. కానీ అధికారికంగా లాంచింగ్‌కు ముందే వీటిని స్పానిస్ ఆన్ లైన్ రిటైలర్ తన సైట్ లో లిస్టుచేసేసింది. స్పెషిఫికేషన్స్, ఫీచర్లు, ఇతర వివరాలన్నింటిన్నీ ఈ రిటైలర్ లిస్టు చేసింది. మోటో జీ5, జీ5 ప్లస్ డిజైన్... మార్కెట్లోకి ఇక ఎంట్రీ ఇవ్వబోతున్న మోటో జీ5, జీ5 ప్లస్‌లు స్పోర్ట్ మెటల్ బాడీస్‌తో రాబోతున్నాయట. సైడ్ ప్యానెల్స్ విషయంలో లెనోవో బ్రాండింగ్ లో ఈ ఫోన్ మన ముందుకు వస్తోందని తెలుస్తోంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫ్రంట్ ప్యానెల్ లో ఉండబోతుందట. ప్రైమరీ కెమెరా వెనుకవైపు సర్క్యూలర్ డిజైన్ లో ఉంటుంది. మోటో ''ఎం'' లోగో కూడా వెనుకవైపే ఉంది. మోటో జీ5 స్పెషిఫికేషన్స్... 5 అంగుళాల ఫుడ్-హెచ్డీ డిస్ ప్లే, 32జీబీ బోర్డు స్టోరేజ్, 13 ఎంపీ రియర్ కెమెరా, 1.4గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 430 ఎస్ఓసీ, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ సపోర్టును కలిగి ఉంటుంది. మోటో జీ5 ప్లస్ స్పెషిఫికేషన్స్... 5.2 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ ప్లే, 64జీబీ స్టోరేజ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 ఎంపీ కెమెరా విత్ డ్యూయల్ ఆటోఫోకస్ ఫీచర్, 2 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీ, 4జీ ఎల్టీఈ, 155 గ్రాముల బరువు ఇవీ మోటో జీ5 ప్లస్ ప్రత్యేకతలు. రెండు ఫోన్లకు ఉండబోయే సిమిలర్ ఫీచర్స్.. ఫుల్-హెచ్డీ స్క్రీన్ రెజుల్యూషన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కవర్ ఆండ్రాయిడ్ 7.0 నోగట్ 128జీబీ వరకు ఎక్స్ పాండబుల్ మెమరీ 2జీబీ ర్యామ్ 5ఎంపీ ఫ్రంట్ కెమెరా వాటర్ రిపేలెంట్ కోటింగ్