మోటో జీ5 ప్లస్‌ ధర తగ్గింది | Moto G5 Plus Price Cut in India, Following Moto G5S Plus Launch | Sakshi
Sakshi News home page

మోటో జీ5 ప్లస్‌ ధర తగ్గింది

Published Tue, Aug 29 2017 7:16 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

మోటో జీ5 ప్లస్‌ ధర తగ్గింది - Sakshi

మోటో జీ5 ప్లస్‌ ధర తగ్గింది

లెనోవో బ్రాండు మోటోరోలా తన మోటో జీ5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరను తగ్గించింది. మోటో జీ5ఎస్‌ ప్లస్‌ లాంచింగ్‌ అనంతరం వెంటనే మోటో జీ5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరను తగ్గిస్తున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. మార్చిలో లాంచింగ్‌ సందర్భంగా రూ.16,999గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర, అనంతరం రూ.15,999కు దిగొచ్చింది. ప్రస్తుతం మరో వెయ్యి రూపాయల మేర తగ్గి 14,999 రూపాయలకే మోటో జీ5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కంపెనీ చెప్పింది. ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే ఈ ఫోన్‌ అప్పట్లో లభ్యమయ్యేది. ఇటీవలే అమెజాన్‌ ఇండియా ద్వారా కూడా ఈ ఫోన్‌ను మోటో విక్రయిస్తోంది.
 
మోటో జీ5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు...
5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌
2గిగాహెడ్జ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ఆక్టాకోర్‌ ఎస్‌ఓసీ
4జీబీ ర్యామ్‌
12 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
4జీ ఎల్టీఈ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement