అదరగొట్టే ఆఫర్లతో మోటో జీ5 ప్లస్ లాంచ్
అదరగొట్టే ఆఫర్లతో మోటో జీ5 ప్లస్ లాంచ్
Published Wed, Mar 15 2017 2:02 PM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM
అదరగొట్టే ఆఫర్లతో మోటో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. న్యూ ఢిల్లీ ఈవెంట్ గా మోటో జీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను, రూ.14,999కు ఆవిష్కరించింది. గత ఫిబ్రవరిలో బెర్సిలోనాలో జరిగిన ఎండబ్ల్యూసీ 2017 ఈవెంట్లో గ్లోబల్ గా ఆవిష్కరించిన ఈ ఫోన్ ను, కొన్ని వారాల వ్యవధిలోనే ఇండియా మార్కెట్లోకి తెచ్చేసింది. నేటి అర్థరాత్రి 11.59 నుంచి ఎక్స్ క్లూజివ్ గా ఈ ఫోన్ ఫ్లిప్ కార్డ్ లోనే అందుబాటులో ఉండనుంది. లాంచింగ్ డే సందర్భంగా పలు ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఎక్స్చేంజ్ పై 1,500 ఆఫ్ ను, ఎస్ బీఐ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ను కంపెనీ అందించనుంది.
అదనంగా రూ.1,199 విలువతో ఉచిత బైబ్యాక్ గ్యారెంటీని ఇది కల్పిస్తోంది. ఈ బైబ్యాక్ ఆఫర్ కింద మోటో జీ5 ప్లస్ ను కొనుగోలు చేసిన ఆరు లేదా ఎనిమిది నెలల్లో మరో స్మార్ట్ ఫోన్ ను యూజర్లు ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పై పొందవచ్చు. అంతేకాక ఎలాంటి ఈఎంఐ ఖర్చులు లేకుండా నెలకు రూ.1889 చెల్లింపుతో దీన్ని కొనుగోలు చేయొచ్చు. రూ.599, రూ.1299 విలువ కలిగిన మోటో పల్స్ హెడ్ సెట్లను యూజర్లు పొందవచ్చు. 2జీబీ, 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ వెర్షన్లలో ఇది లాంచ్ అయింది.
మోటో జీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు...
5.2 అంగుళాల ఎఫ్హెచ్డీ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ నోగట్
ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్
3జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ధర రూ.14,999
4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ ధర రూ.16,999
12ఎంపీ రియర్ ఫేసింగ్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
పూర్తిగా మెటల్ బాడీతో లాంచ్ అయిన తొలి మోటో ఫోన్ ఇదే.
Advertisement
Advertisement