exciting offers
-
బిగ్ సి సంక్రాంతి పండుగ ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్స్ రీటైల్ విక్రయ సంస్థ బిగ్ సి కస్టమర్లకు కోసం సంక్రాంతికి అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సందర్భంగా మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లపై ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తున్నామని బిగ్ సి వ్యవస్థాపకులు, సీఎండీ బాలు చౌదరి తెలిపారు. మొబైళ్ల కొనుగోళ్లపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్దతిలో కొనుగోళ్లకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ప్రతీ మొబైల్‌పై కచ్చితమైన బహుమతి, స్మార్ట్ టీవీల కొనుగోలుపై రూ.4,000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తున్నామన్నారు. అమెజాన్ పే, డెబిట్‌కార్డు, పేటియం మాల్ ద్వారా కొనుగోళ్లపై పలు ఆఫర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. -
జియో నుంచి మరిన్ని అద్భుత ఆఫర్లు!
న్యూఢిల్లీ : ఇప్పటికే ఉచిత ఆఫర్లతో టెలికాం సెక్టార్ ను హోరెత్తించిన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, మరిన్ని అద్భుత ఆఫర్లు ఇవ్వడానికి సిద్దమవుతుందట. త్వరలోనే రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్లు ప్రకటించనుందని కంపెనీ తన వెబ్ సైట్లో వెల్లడించింది. కొత్త కస్టమర్లకు ఆల్ట్రా-అఫోర్డబుల్ డేటా టారిఫ్స్ తో పాటు, జియో ప్రైమ్ మెంబర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ''త్వరలోనే మేము మా టారిఫ్ ప్యాక్స్ ను అప్ డేట్ చేస్తాం. మరిన్ని అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెడతాం'' అని ముంబాయికి చెందిన ఈ కంపెనీ తన అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది. టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు ఇస్తున్న పోటీని తగ్గకుండా ఇవ్వడానికి, కొత్త సబ్స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి కొత్త టారిఫ్ స్కీమ్ ను తాము లాంచ్ చేస్తామని జియో అధికార ప్రతినిధి కూడా పేర్కొన్నారు. జియో ఇటీవల తీసుకొచ్చిన సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ కు ట్రాయ్ దెబ్బకొట్టడంతో ఈ ప్రభావం యూజర్ల మీద పడకుండా ఉండేందుకు ఈ ప్లాన్స్ లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రైమ్ మెంబర్ షిప్ గడువు 15 రోజుల పొడిగింపుతో పాటు రూ.303 ప్యాక్ తో రీఛార్జ్ చేసుకున్న వారికి మూడు నెలలు ఉచిత సేవలను అందించనున్నట్టు పేర్కొంటూ జియో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ను తీసుకొచ్చింది. కానీ ఆ ఆఫర్ ను వెంటనే విత్ డ్రా చేసుకోమని జియోను ట్రాయ్ ఆదేశించింది. జియో ఆఫర్ల వెల్లువతో ఇప్పటికే టెలికాం ఇండస్ట్రీలో ఇతర ఆపరేటర్లు చుక్కలు చూస్తున్నారు. సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ కు ట్రాయ్ చెక్ పెట్టడంతో వారు కొంత ఉపశమనం చెందారు. కానీ వారికి మరింత ఝలకిస్తూ మళ్లీ టారిఫ్ ప్లాన్స్ ను అప్ డేట్ చేయబోతున్నట్టు ప్రకటించింది. -
అదరగొట్టే ఆఫర్లతో మోటో జీ5 ప్లస్ లాంచ్
అదరగొట్టే ఆఫర్లతో మోటో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. న్యూ ఢిల్లీ ఈవెంట్ గా మోటో జీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను, రూ.14,999కు ఆవిష్కరించింది. గత ఫిబ్రవరిలో బెర్సిలోనాలో జరిగిన ఎండబ్ల్యూసీ 2017 ఈవెంట్లో గ్లోబల్ గా ఆవిష్కరించిన ఈ ఫోన్ ను, కొన్ని వారాల వ్యవధిలోనే ఇండియా మార్కెట్లోకి తెచ్చేసింది. నేటి అర్థరాత్రి 11.59 నుంచి ఎక్స్ క్లూజివ్ గా ఈ ఫోన్ ఫ్లిప్ కార్డ్ లోనే అందుబాటులో ఉండనుంది. లాంచింగ్ డే సందర్భంగా పలు ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఎక్స్చేంజ్ పై 1,500 ఆఫ్ ను, ఎస్ బీఐ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ను కంపెనీ అందించనుంది. అదనంగా రూ.1,199 విలువతో ఉచిత బైబ్యాక్ గ్యారెంటీని ఇది కల్పిస్తోంది. ఈ బైబ్యాక్ ఆఫర్ కింద మోటో జీ5 ప్లస్ ను కొనుగోలు చేసిన ఆరు లేదా ఎనిమిది నెలల్లో మరో స్మార్ట్ ఫోన్ ను యూజర్లు ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పై పొందవచ్చు. అంతేకాక ఎలాంటి ఈఎంఐ ఖర్చులు లేకుండా నెలకు రూ.1889 చెల్లింపుతో దీన్ని కొనుగోలు చేయొచ్చు. రూ.599, రూ.1299 విలువ కలిగిన మోటో పల్స్ హెడ్ సెట్లను యూజర్లు పొందవచ్చు. 2జీబీ, 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ వెర్షన్లలో ఇది లాంచ్ అయింది. మోటో జీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు... 5.2 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ డిస్ ప్లే ఆండ్రాయిడ్ నోగట్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ 3జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ధర రూ.14,999 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ ధర రూ.16,999 12ఎంపీ రియర్ ఫేసింగ్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ పూర్తిగా మెటల్ బాడీతో లాంచ్ అయిన తొలి మోటో ఫోన్ ఇదే.