జియో నుంచి మరిన్ని అద్భుత ఆఫర్లు!
జియో నుంచి మరిన్ని అద్భుత ఆఫర్లు!
Published Mon, Apr 10 2017 2:03 PM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM
న్యూఢిల్లీ : ఇప్పటికే ఉచిత ఆఫర్లతో టెలికాం సెక్టార్ ను హోరెత్తించిన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, మరిన్ని అద్భుత ఆఫర్లు ఇవ్వడానికి సిద్దమవుతుందట. త్వరలోనే రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్లు ప్రకటించనుందని కంపెనీ తన వెబ్ సైట్లో వెల్లడించింది. కొత్త కస్టమర్లకు ఆల్ట్రా-అఫోర్డబుల్ డేటా టారిఫ్స్ తో పాటు, జియో ప్రైమ్ మెంబర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ''త్వరలోనే మేము మా టారిఫ్ ప్యాక్స్ ను అప్ డేట్ చేస్తాం. మరిన్ని అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెడతాం'' అని ముంబాయికి చెందిన ఈ కంపెనీ తన అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది. టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు ఇస్తున్న పోటీని తగ్గకుండా ఇవ్వడానికి, కొత్త సబ్స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి కొత్త టారిఫ్ స్కీమ్ ను తాము లాంచ్ చేస్తామని జియో అధికార ప్రతినిధి కూడా పేర్కొన్నారు.
జియో ఇటీవల తీసుకొచ్చిన సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ కు ట్రాయ్ దెబ్బకొట్టడంతో ఈ ప్రభావం యూజర్ల మీద పడకుండా ఉండేందుకు ఈ ప్లాన్స్ లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రైమ్ మెంబర్ షిప్ గడువు 15 రోజుల పొడిగింపుతో పాటు రూ.303 ప్యాక్ తో రీఛార్జ్ చేసుకున్న వారికి మూడు నెలలు ఉచిత సేవలను అందించనున్నట్టు పేర్కొంటూ జియో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ను తీసుకొచ్చింది. కానీ ఆ ఆఫర్ ను వెంటనే విత్ డ్రా చేసుకోమని జియోను ట్రాయ్ ఆదేశించింది. జియో ఆఫర్ల వెల్లువతో ఇప్పటికే టెలికాం ఇండస్ట్రీలో ఇతర ఆపరేటర్లు చుక్కలు చూస్తున్నారు. సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ కు ట్రాయ్ చెక్ పెట్టడంతో వారు కొంత ఉపశమనం చెందారు. కానీ వారికి మరింత ఝలకిస్తూ మళ్లీ టారిఫ్ ప్లాన్స్ ను అప్ డేట్ చేయబోతున్నట్టు ప్రకటించింది.
Advertisement
Advertisement