12 లక్షల సీట్లపై డిస్కౌంట్‌ ఆఫర్‌ | IndiGo Offers Discounts On 12 Lakh Seats For 4 Days | Sakshi
Sakshi News home page

12 లక్షల సీట్లపై డిస్కౌంట్‌ ఆఫర్‌

Jul 10 2018 11:29 AM | Updated on Aug 28 2018 8:04 PM

IndiGo Offers Discounts On 12 Lakh Seats For 4 Days - Sakshi

ఇండిగో ఎయిర్‌లైన్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ ఇండిగో డిస్కౌంట్‌ సేల్‌ ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా 12 లక్షల సీట్ల ఛార్జీలను అత్యంత తక్కువగా రూ.1,212కే ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈ డిస్కౌంట్‌ టిక్కెట్లు 2018 జూలై 25 నుంచి 2019 మార్చి 30 వరకు  ప్రయాణ కాలానికి వర్తించనున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఇండిగో సేల్‌ మంగళవారం నుంచి ప్రారంభమై, శుక్రవారంతో ముగుస్తుంది. ఈ సేల్‌ వివరాలను ఇండిగో క్యారియర్‌ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అన్ని ఛానల్స్‌ ద్వారా బుక్‌ చేసుకున్న విమాన టిక్కెట్లకు ఈ ఆఫర్‌ వాలిడ్‌లో ఉంటుందని ఇండిగో తెలిపింది.  తక్కువ విమాన టిక్కెట్‌ ఛార్జీలే కాక, ఈ ఎయిర్‌లైన్‌ ఎస్‌బీఐ కార్డు ద్వారా పేమెంట్లు జరిపే బుకింగ్స్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ అందించనున్నట్టు కూడా పేర్కొంది. అయితే కనీస లావాదేవీ రూ.3000 మేర ఉండాలి. ఒక్కొక్కరికి 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. 2018 సెప్టెంబర్‌ 14న క్యాష్‌బ్యాక్‌ మొత్తాన్ని కస్టమర్ల అకౌంట్‌లో క్రెడిట్‌ చేయనున్నారు. 

‘దేశీయ విమానయాన సంస్థ సీట్లపై అతిపెద్ద సేల్‌ను ప్రకటించడం ఆనందాయకంగా ఉంది. ఆగస్టు 4న ఇండిగో 12వ ఏటా అడుగుపెడుతోంది. ఈ సందర్భాన్ని తీపి గుర్తుగా మరలుచుకునేందుకు, 57 సిటీల్లో తమ నెట్‌వర్క్‌ వ్యాప్తంగా ఉన్న 12 లక్షల సీట్లను ప్రత్యేక ధరల్లో అందుబాటులో ఉంచాం’ అని ఇండిగో చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ విలియం బౌల్టర్‌ చెప్పారు. దేశీయంగా ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ. ప్రస్తుతం 1,086 రోజువారీ విమానాలను ఇది ఆపరేట్‌ చేస్తోంది. 42 దేశీయ, 8 అంతర్జాతీయ మార్గాలను ఇది కనెక్ట్‌ చేస్తోంది. గోఎయిర్‌, ఎయిర్‌ఏసియా, స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థలు విమాన టిక్కెట్లపై డిస్కౌంట్‌ సేల్‌ ప్రకటించిన అనంతరం ఇండిగో ఈ ఆఫర్‌ ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement