ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ టీచర్లకు,విద్యార్ధులకు వారి తల్లిదండ్రులకు 'బ్యాక్ టూ స్కూల్' ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 22 వరకు జరిగే ఈ ఆన్‌లైన్ సేల్‌లో యాపిల్ ప్రొడక్ట్‌లను భారీ డిస్కౌంట్‌లకే అందిస్తుంది.
యాపిల్ ప్రత్యేకమైన అమ్మకాల్లో జత యాపిల్ ఎయిర్ పాడ్‌ను ఉచితంగా అందిస్తుంది. దీంతో పాటు 6నెలల వరకు యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా పొందవచ్చు. యాపిల్ కేర్ ప్లస్‌లో జరిపే మాక్ బుక్ ఎయిర్,ఐమాక్,మాక్ మిని,మాక్ స్టూడియో ప్రొడక్ట్‌లపై 20శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
అదనంగా యాపిల్ ఎడ్యుకేషన్‌లో అమ్మే మాక్,ఐపాడ్, యాపిల్ పెన్సిల్, స్మార్ట్ కీబోర్డ్‌ల వంటి ఉత్పత్తులపై టీచర్లకు, ఫ‍్యాకల్టీ,స్టాఫ్, హోం స్కూల్ టీచర్లు, గ్రేడ్ లెవల్, యూనివర్సిటీ లెవల్ స్టూడెంట్‌లతో పాటు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు యాపిల్ తెలిపింది
బ్యాక్ టూ స్కూల్‌లో డివైజ్‌లు, డిస్కౌంట్‌లు
బ్యాక్ టూ స్కూల్ పేరుతో యాపిల్ సంస్థ మాక్‌బుక్ ప్రో 13పై రూ.10వేల డిస్కౌంట్‌ను అందిస్తుంది. మాక్ బుక్ ప్రో అసలు ప్రారంభ ధర రూ.1,29,900 ఉండగా.. డిస్కౌంట్‌తో రూ.1,19,900కే సొంతం చేసుకోవచ్చు.
మాక్ బుక్ ప్రో 14పై రూ.19,490 వరకు డిస్కౌంట్‌కే కొనుగోలు చేసే సౌకర్యం ఉండగా.. ఈ డివైజ్ అసలు వాస్తవ ప్రారంభ ధర రూ.1,94,900 ఉండగా డిస్కౌంట్ తో రూ.1,75,410కే కొనుగోలు చేయోచ్చు.
మాక్ బుక్ ప్రో 16 అసలు వాస్తవ ప్రారంభ ధర రూ.2,39,900 ఉండగా.. రూ.23,990 డిస్కౌంట్‌తో రూ.2,15,910కే లభ్యం అవుతుంది
మాక్ బుక్ ఎయిర్(ఎం1) ధర రూ.99,900 ఉండగా.. ఇప్పుడు అదే డివైజ్‌ను రూ.10వేల డిస్కౌంట్‌తో రూ.89,900కే దక్కించుకోవచ్చు.
మాక్ బుక్ ఎయిర్ (ఎం2) అసలు వాస్తవ ధర రూ.1,19,900 ఉండగా యాపిల్ నిర్వహిస్తున్న బ్యాక్ టూ స్కూల్ ఆఫర్ సేల్‌లో రూ.10వేలు డిస్కౌంట్‌తో రూ.1,09,900కే పొందవచ్చు.
ఐ మాక్ అసలు ప్రారంభ ధర రూ.1,19,900 ఉండగా రూ.11,990 డిస్కౌంట్‌తో రూ.1,07,910కే కొనుగోలు చేయోచ్చు.
యాపిల్ ఐపాడ్ ప్రో అసలు ప్రారంభం ధర రూ. 71,900 ఉండగా రూ.3,600 డిస్కౌంట్‌తో రూ.68,300కే యాపిల్ అందిస్తుంది.
ఐపాడ్ ఎయిర్ అసలు ప్రారంభ ధర రూ.54,900 ఉండగా ఈసేల్‌లో రూ.4120 డిస్కౌంట్‌తో రూ.50,780కే కొనుగోలు చేయోచ్చు.
వీటితో పాటు అర‍్హులైన కస్టమర్లు కొనుగోలు చేసిన ఎయిర్ పాడ్స్‌ను రూ.6,400 నుంచి రూ.12,200లు చెల్లించి అప్‌గ్రేడ్ చేసే సౌకర్యాన్ని ఈ సేల్ సందర్భంగా యాపిల్ సంస్థ కల్పిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment