
ఒకటి కొంటే ఒకటి ఉచితం, పండగ ప్రత్యేక తగ్గింపు లాంటి ఆఫర్లు మనమిప్పటి వరకు చూశాం. కానీ బ్రాండ్ ప్రమోషన్‌తో పాటు సోషల్ అవైర్‌నెస్ పెంచేందుకు హైదరాబాద్‌కి చెందిన ఓ రెస్టారెంట్ ఇస్తున్న ఆఫర్ నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉంది. దీంతో ఈ రెస్టారెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
నగరంలోని ఐటీ కారిడార్‌లో ఉన్న ఖాజాగూడలో ఇటీవల దక్షిణ్ 5 పేరుతో ఓ రెస్టారెంట్‌ని ప్రారంభమైంది. దీని ఓనర్లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వెరైటీ డిస్కౌంట్లు ప్రకటించారు. చూడటానికి కొత్తగా ఉన్న ఈ డిస్కౌంట్లు అందిస్తున్న తీరు దాని వెనుక దాగున్న పరమార్థం తెలుసుకున్న వారు ఈ రెస్టారెంట్ ఓనర్లను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
పాజిటివ్ వైబ్స్
ఈ రెస్టారెంట్‌కి వచ్చిన కష్టమర్లు ఆర్డర్ చేసే సమయంలో ప్లీజ్, థాంక్యూ, హావ్ ఏ నైస్‌డే, గుడ్‌మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్ వంటి పదాలు వాడుతూ ఆర్డర్ చేస్తే ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తున్నారు. ఉదాహారణకి ఈ హోటల్‌కి వెళ్లి మెనూ కార్డు చూసి థాళీ ఆర్డర్ చేస్తే బిల్ రూ. 275 అవుతుంది. అదే థాళీ ప్లీజ్ అని ఆర్డర్ చేస్తే రూ.20 డిస్కౌంట్‌తో థాళీ రూ. 255కే లభిస్తుంది. అలా కాకుండా గుడ్ ఈవినింగ్ ఏ థాళీ ప్లీజ్ అని ఆర్డర్ చేస్తే మరో రూ.10 అదనపు డిస్కౌంట్‌తో థాళీ కేవలం రూ. 240కే వస్తుంది. ఇలా అన్ని పదార్థాలపై ఈ తరహా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఆఫర్ ఎందుకంటే
హోటల్స్, రెస్టారెంట్లలో మనకు సర్వ్ చేసే వ్యక్తులతో మర్యాదగా మెలగడం అనేది కామన్‌సెన్స్. కానీ క్రమంగా అది కనుమరుగైపోతుంది. చాలా సార్లు చేయని తప్పుకి సర్వర్ల పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంటారు. కొన్ని సంరద్భాల్లో వారిని మనుషులుగా కూడా గౌరవించరు. ఈ పద్దతిలో మార్పు తెచ్చేందుకు ఈ కొత్త రకం డిస్కౌంట్లు అందిస్తున్నామని రెస్టారెంట్ నిర్వాహాకులు అంటున్నారు. అంతేకాదు ఈ డిస్కౌంట్ల వల్ల కస్టమర్లు సైతం త్వరగా ప్రశాంత వదనం అలవరుచుకుంటున్నారని, అప్రయత్నంగా వారి మోములో చిరునవ్వులు పూస్తున్నాయంటూ వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Must see for #Foodies in #Hyderabad. Dakshin 5 restaurant in Khajaguda introduces 'Courtesy #Discounts'. Say "please" to get ₹15 discount. Say "Good Afternoon & a thali please" get ₹30 disc. More courtesies, more discounts. Also flat discs on total bill for elders=to their age. pic.twitter.com/iQvgYIMZ4F
— Krishnamurthy (@krishna0302) March 5, 2022
మరో ఆఫర్
ఈ కుటుంబ సమేతంగా భోజనాలకు వచ్చే వారి కోసం ఎల్డర్ ది బెటర్ ఆఫర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉందని కొందరు కస్టమర్లు అంటున్నారు. ఈ ఆఫర్ ప్రకారం ఫ్యామిలీ లేదా గ్రూపుగా ఈ రెస్టారెంట్ వెళ్లే వారిలో పెద్ద వయసు వారు ఉన్నట్టయితే వారి వయస్సుని బట్టి ప్రత్యేక డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు.
ట్రెండింగ్‌లో
ఈ కొత్త రకం ఆఫర్ల వెనుక వ్యూహాం ఏదైనా సరే.. ఇటీవల రోజుల్లో ఏ రెస్టారెంట్‌కి దక్కని ప్రచారం దక్షిణ్ 5కి లభిస్తోంది. ఐటీ సెక్టార్‌లో ఉన్న రెస్టారెంట్ కావడంతో ఇక్కడికి వెళ్లిన వారు.. ఈ డిస్కౌంట్లకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అనతి కాలంలోనే ఇది జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది. ఎంతో ఖర్చు చేస్తే కూడా రాని బ్రాండ్ ఇమేజ్ సోషల్ అవేర్‌నెస్‌తో కూడిన వెరైటీ డిస్కౌంట్‌తో వచ్చింది.
Say please, thank you, have a nice day, .....show common #courtesies and get discounts on your food ordered in this Hyderabadi restaurant #Dakshin5, a one stop restaurant for 5 #SouthernStates of #India #Idea #Restaurant #Promotion #NewIdea #HyderabadRestaurants #HyderabadFood pic.twitter.com/ZIP78fxWn2
— D. Ramchandram (@Dramchandram) March 5, 2022
Comments
Please login to add a commentAdd a comment