Amazon Provide 30% to 50% Discounts on Air Conditioners, Details Inside - Sakshi
Sakshi News home page

ఉక్కపోత నుంచి ఉపశమనం.. అమెజాన్‌లో ఏసీలపై క్రేజీ ఆఫర్లు !

Published Sat, Mar 19 2022 4:09 PM | Last Updated on Sat, Mar 19 2022 4:50 PM

Details About 30 to 50 Percent Discounts On Air Conditioners In Amazon - Sakshi

మార్చి చివర్లోకి వచ్చామో లేదా భానుడి ప్రతాపం మొదలైంది. చూస్తుండగానే సుర్రుమనే ఎండలు పెరిగిపోయాయి. గదిలో తిరిగే ఫ్యాను ఉక్కపోత నుంచి ఉపశమనం ఇవ్వలేపోతుంది. ఎయిర్‌ కండీషన్‌కి వెళ్ధామంటే సీజన్‌ ప్రారంభం కావడంతో ధరలు భగ్గుమంటున్నాయి. అయితే అమెజాన్‌లో యాభై శాతం ఆఫర్‌తో అందుబాటులో ఉన​‍్న స్మార్ట్‌ ఏసీల వివరాలు మీ కోసం..

Lloyd 1.5 Ton 3 Star, Wi-Fi, Inverter Split AC
- లాయిడ్‌ 1.5 టన్‌ 3 స్టార్‌ ఏసీ 2021 సీజన్‌లో మార్కెట్‌లో వచ్చినప్పడు ధర రూ.65,999లు కానీ ప్రస్తుతం అమెజాన్‌లో 50 శాతం ఆఫర్‌తో రూ.32,.999కే లభిస్తోంది. అంతేకాదు పలు బ్యాంకుల క్రెడిట్‌ కార్డులపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు కూడా అందిస్తోంది. ఈ ఏసీకి సంబంధించిన ఫీచర్లు పరిశీలిస్తే కాపర్‌ కంప్రెసర్‌, వైఫై ఏనేబుల్‌, ఆటోమేటిక్‌ హ్యుమిడిటీ కంట్రోల్‌, యాంటీ వైరల్‌, హెపా ఫిల్టర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎనర్జీ ఎఫిషియెన్సీలో 3 స్టార్‌ రేటింగ్‌ ఉంది. ప్రొడక్టు మీద ఏడాది, కంప్రెసర్‌ మీద పదేళ్ల వ్యారంటీ ఉంది.

TCL 1.5 Ton 5 Star 
- టీసీఎల్‌ 1.5 టన్‌ ఏసీ 2021 మోడల్‌ ఏసీ ప్రారంభ ధర రూ.50,999లు ఉండగా ప్రస్తుతం 37 శాతం డిస్కౌంట్‌తో రూ. 31,999 దగ్గర అమెజాన్‌లో లభిస్తోంది. పలు క్రెడిట్‌ కార్డ్‌ పేమెంట్స్‌ ద్వారా మరికొంత తగ్గింపు లభిస్తుంది. టీసీఎల్‌ 1.5 టన్‌ ఏసీలో కాపర్‌ కంప్రెషర్‌, విటమిన్‌ సీ, సిల్వర్‌ ఐయాన్‌ ఫిల్టర్‌, వైఫై, ఆల్ట్రా ఇన్వెర​​‍్టర్‌, గూగుల్‌ అసిస్టెంట్‌, స్మార్ట్‌ ఏసీ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఎనర్జీ ఎఫిషియేన్సిలో 5 స్టార్‌ రేటింగ్‌ కలదు. కేవలం 30 సెకన్లలో గది ఉష్ణోగ్రతను 27 సెల్సియస్‌ డిగ్రీల నుంచి 18 సెల్సియస్‌ డిగ్రీలకు తెస్తుందని టీసీఎస్‌ చెబుతోంది



Whirlpool 1 Ton 3 Star
- వర్ల్‌పూల్‌ 1 టన్‌ ఏసీ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు ధర రూ. 58,300లు ఉండగా ప్రస్తుతం 44 శాతం డిస్కౌంట్‌తో 25,810లకే వస్తోంది. ఈ ఏసీకి ఫీచర్లు పరిశీలిస్తే.. కాపర్‌ కంప్రెషర్‌, ఆల్ట్రా ఎన్‌ఎక్స్‌టీ వైఫై, కాపర్‌ ఇన్వెర్టర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎనర్జీకిలో 3 స్టార్‌ రేటింగ్‌ ఉంది.

LG 1.5 Ton 5 Star AI DUAL Inverter
- ఎల్‌జీ 1.5 టన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ డ్యూయల్‌ ఇన్వర్టర్‌ ఏసీ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు ధర రూ.58,490 ఉండగా ఇప్పుడు 20 శాతం డిస్కౌంట్‌తో రూ.46,590కే లభిస్తోంది. ఇందులో అధునాతమైన ఫీచర్లను ఎల్‌జీ పొందు పరిచింది. వాటిని పరిశీలిస్తే టచ్‌ ఫ్రీ ఆపరేషన్‌, ఆరు కూలింగ్‌ ఫీచర్లు, 6 స్టెప్‌ ఎనర్జీ కంట్రోల్‌, కంట్రోల్‌ ఏసీ ఎనీటైం, ఎనీవేర్‌, యాంటీ వైరస్‌ ప్రొటెక‌్షన్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. పవర్‌ సేవింగ్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ ఉంది.



LG 1.0 Ton 5 Star DUAL Inverter Wi-Fi Window AC
- ఇక స్మార్ట్‌ విండో ఏసీలకు సంబంధించి ఎల్‌జీ వన్‌ టన్‌ ఆర్టిఫిషియల్‌ డ్యూయల్‌ ఇన్వర్టర్‌ ఏసీపై ఏకంగా 49 శాతం తగ్గింపు ఉంది. ఈ ఏసీ ఎంఆర్‌పీ రూ.56,999 ఉండగా అమెజాన్‌లో రూ.27,810కే లభిస్తోంది. తక్కువ శబ్ధంతో పని చేసే ఈ ఏసీ 5 స్టార్‌ రేటింగ్‌తో అందుబాటులో ఉంది. విండో ఏసీల్లో స్మార్ట్‌ ఫీచర్లు దీని ప్రత్యేకత.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement