నాలుగు రోజుల పాటు అమెజాన్ ‘ఫ్రీడం సేల్’
ఈ-కామర్స్ కంపెనీలు మళ్లీ డిస్కౌంట్లతో మారుమోగించబోతున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నాలుగు రోజుల సేల్‌కు సిద్ధమైంది. ఆగస్టు 9 నుంచి 12వ తేదీ వరకు ‘ఫ్రీడం సేల్’ పేరుతో డిస్కౌంట్లకు తెరలేపుతోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, లార్జ్ అప్లియెన్స్, టీవీలు వంటి ఉత్పత్తులపై 20వేలకు పైగా డీల్స్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ సేల్‌లో వన్‌ప్లస్, వివో, జేబీఎల్, ఎల్‌జీ, ఫిలిప్స్, క్యాసియో వంటి అన్ని రకాల బ్రాండ్లు పాల్గొనబోతున్నాయి. అమెజాన్ ఎకో డివైజ్‌లు, ఫైర్ టీవీ స్టిక్, కిండ్లీ ఈ-రీడర్స్ వంటి అన్ని డివైజ్‌లపై అదనంగా గ్రేట్ డిస్కౌంట్లను అమెజాన్ అందించబోతుంది. వన్‌ప్లస్ 6, హానర్ 7ఎక్స్, రియల్‌మి 1, మోటో జీ6, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, వివో ఎక్స్21, హువావే పీ20 లైట్ స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలను కూడా ప్రకటించింది. ఈ సేల్‌లో అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు స్పెషల్ డీల్స్‌ను, డిస్కౌంట్లను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
పీసీ యాక్ససరీస్‌పై ప్రైమ్ మెంబర్లకు 60 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు అమెజాన్ టీజ్ చేసింది. మొబైల్ ఫోన్లు, యాక్ససరీస్‌పై 40 శాతం వరకు, రోజువారీ వస్తువులు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై 50 శాతం వరకు, ఫ్యాషన్ ప్రొడక్ట్‌లపై 50 నుంచి 80 శాతం వరకు, హోమ్, అవుట్‌డోర్ పరికరాలపై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది.భారత్‌లో ఎక్కువగా సందర్శించే షాపింగ్ ప్లేస్ అమెజాన్ అని, ప్రతి పండుగను తమ కస్టమర్లతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటామని అమెజాన్ ఇండియా కేటగిరీ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ చెప్పారు. ఈ సీజన్‌లో కస్టమర్లు ఆశించే ప్రతీది తాము ఈ ఫ్రీడం సేల్‌లో ఆఫర్ చేస్తామని తెలిపారు. కొత్త ప్రొడక్ట్‌ల లాంచింగ్, గ్రేట్ డీల్స్, ఎక్స్‌ట్రా క్యాష్‌బ్యాక్‌లు, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆప్షన్లను అందిస్తూ అమెజాన్.ఇన్ ఈ ఫ్రీడం సేల్‌ను ఘనంగా నిర్వహించనుందని పేర్కొన్నారు. ఈ ఫ్రీడం సేల్‌లో ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులను వాడుతూ ఉత్పత్తులు కొనేవారికి 10 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది.
Comments
Please login to add a commentAdd a comment