prime members
-
ఇరాక్ ప్రధానిపై హత్యాయత్నం
బాగ్దాద్: ఇరాక్ ప్రధానమంత్రి ముస్తఫా–అల్–కదిమి హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆదివారం వేకువజామున కదిమి నివాసమే లక్ష్యంగా సాయుధ డ్రోన్లతో దాడి జరిగిందని, ఆయనకు ఎటువంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. గత నెలలో వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఇరాన్ మద్దతుగల మిలీషియాలు తిరస్కరించడంతో తలెత్తిన ఉద్రిక్తతలకు తాజా ఘటన ఆజ్యం పోసినట్లయింది. ప్రభుత్వ ఆఫీసులు, దౌత్య కార్యాలయాలతో అత్యధిక భద్రతా ఏర్పాట్లుండే గ్రీన్ జోన్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ప్రధాని నివాసంపై పేలుడు పదార్థాలు నిండిన రెండు డ్రోన్లతో జరిగిన దాడిలో కదిమి భద్రతా సిబ్బంది ఏడుగురు గాయపడినట్లు పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఇద్దరు అధికారులు అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపారు. ‘దేవుని దయవల్ల నేను, నా ప్రజలు క్షేమంగా ఉన్నాం’అని ప్రధాని కదిమి దాడి అనంతరం ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా, దాడికి బాధ్యత తమదేనంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. ఇరాక్ ప్రధానిపై డ్రోన్ దాడిని అమెరికా, ఈజిప్టు, యూఏఈ ఖండించాయి. దేశంలో అక్టోబర్ 10వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణపై ఐరాస భద్రతామండలి కూడా హర్షం వ్యక్తం చేసింది. ఇరాన్ మద్దతున్న మిలీషియా గ్రూపులు మాత్రం రీకౌంటింగ్ చేపట్టాలంటూ గ్రీన్‌జోన్‌కు సమీపంలో టెంట్లు వేసుకుని నిరసనలు సాగిస్తున్నాయి. -
ప్రైమ్ యూజర్లకు బంపర్ఆఫర్ ప్రకటించిన అమెజాన్..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమైంది. తాజాగా ప్రైమ్ యూజర్లకు అమెజాన్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రైమ్ యూజర్లకు ‘ అడ్వాన్టేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్’ పేరిట సరికొత్త ప్రోగ్రాంను లాంచ్ చేసింది. చదవండి:75వేల కోట్ల కంపెనీ ..! అందులో అమితాబ్ బచ్చన్ ఎంట్రీ...! అడ్వాన్టేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్ ప్రోగ్రాం సహాయంతో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ప్రైమ్ సభ్యులకు నో కాస్ట్ ఈఏమ్ఐలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం కేవలం స్మార్ట్ఫోన్లకే వర్తించనుంది. దాంతో పాటుగా స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై అదనంగా కస్టమర్లు ఆరు నెలల ఉచిత స్క్రీన్ రిప్లేస్మెంట్ ప్రయోజనాలను కూడా పొందవచ్చును. హెచ్డీఎఫ్సీ బ్యాంకు వినియోగదారుల కోసం మరిన్నీ ప్రత్యేక ఆఫర్లను కూడా అందించనుంది. అమెజాన్ అందిస్తోన్న 'అడ్వాంటేజ్ - జస్ట్ ఫర్ ప్రైమ్' ప్రోగ్రామ్ కొత్తగా విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌లైన సామ్సంగ్ గెలాక్సీ M52 5జీ , ఐక్యూ జెడ్5, షావోమీ 11 లైట్ 5G ఎన్ఈ, ఒప్పో ఏ55 నో కాస్ట్ ఈఎమ్ఐలను అందిస్తోంది. నెల రోజుల పాటు జరిగే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ల్యాప్‌టాప్‌లు , స్మార్ట్ టీవీలు , మొబైల్ ఫోన్లు , ఎయిర్ ప్యూరిఫైయర్లు , గృహోపకరణాలు , వంటగది ఉపకరణాలు మరిన్నింటిపై అమెజాన్ డిస్కౌంట్లను అందిస్తోంది . చదవండి: అగ్రరాజ్యాలకు పోటీగా నిలుస్తోన్న భారత్...! -
అమెజాన్ ‘ఫ్రీడం సేల్’ : డిస్కౌంట్లే డిస్కౌంట్లు
ఈ-కామర్స్ కంపెనీలు మళ్లీ డిస్కౌంట్లతో మారుమోగించబోతున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నాలుగు రోజుల సేల్కు సిద్ధమైంది. ఆగస్టు 9 నుంచి 12వ తేదీ వరకు ‘ఫ్రీడం సేల్’ పేరుతో డిస్కౌంట్లకు తెరలేపుతోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, లార్జ్ అప్లియెన్స్, టీవీలు వంటి ఉత్పత్తులపై 20వేలకు పైగా డీల్స్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ సేల్‌లో వన్‌ప్లస్, వివో, జేబీఎల్, ఎల్జీ, ఫిలిప్స్, క్యాసియో వంటి అన్ని రకాల బ్రాండ్లు పాల్గొనబోతున్నాయి. అమెజాన్ ఎకో డివైజ్‌లు, ఫైర్ టీవీ స్టిక్, కిండ్లీ ఈ-రీడర్స్ వంటి అన్ని డివైజ్‌లపై అదనంగా గ్రేట్ డిస్కౌంట్లను అమెజాన్ అందించబోతుంది. వన్‌ప్లస్ 6, హానర్ 7ఎక్స్, రియల్‌మి 1, మోటో జీ6, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, వివో ఎక్స్21, హువావే పీ20 లైట్ స్మార్ట్ఫోన్లపై తగ్గింపు ధరలను కూడా ప్రకటించింది. ఈ సేల్‌లో అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు స్పెషల్ డీల్స్‌ను, డిస్కౌంట్లను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. పీసీ యాక్ససరీస్‌పై ప్రైమ్ మెంబర్లకు 60 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు అమెజాన్ టీజ్ చేసింది. మొబైల్ ఫోన్లు, యాక్ససరీస్‌పై 40 శాతం వరకు, రోజువారీ వస్తువులు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై 50 శాతం వరకు, ఫ్యాషన్ ప్రొడక్ట్‌లపై 50 నుంచి 80 శాతం వరకు, హోమ్, అవుట్డోర్ పరికరాలపై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది.భారత్‌లో ఎక్కువగా సందర్శించే షాపింగ్ ప్లేస్ అమెజాన్ అని, ప్రతి పండుగను తమ కస్టమర్లతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటామని అమెజాన్ ఇండియా కేటగిరీ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ చెప్పారు. ఈ సీజన్లో కస్టమర్లు ఆశించే ప్రతీది తాము ఈ ఫ్రీడం సేల్‌లో ఆఫర్ చేస్తామని తెలిపారు. కొత్త ప్రొడక్ట్‌ల లాంచింగ్, గ్రేట్ డీల్స్, ఎక్స్ట్రా క్యాష్‌బ్యాక్‌లు, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆప్షన్లను అందిస్తూ అమెజాన్.ఇన్ ఈ ఫ్రీడం సేల్‌ను ఘనంగా నిర్వహించనుందని పేర్కొన్నారు. ఈ ఫ్రీడం సేల్‌లో ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులను వాడుతూ ఉత్పత్తులు కొనేవారికి 10 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది. -
అమెజాన్ బంపర్ ఆఫర్..రెనాల్ట్ క్విడ్
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మళ్లీ డిస్కౌంట్ల పండుగకు తెరతీసింది. ప్రతీ ఏడాది ప్రకటించే డిస్కౌంట్ల ఉత్సవం ఈ రోజు అర్థరాత్రినుంచే ప్రారంభం. 2017 నూతన సంవత్సరంలో తొలి డిస్కౌంట్ సేల్ ను ప్రకటించింది. పెద్ద ఎత్తున పొదుపులు ప్రతీ ఒక్కరికి అంటూ ప్రకటించిన ఈ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్ల వెల్లువ జనవరి 20 అర్థరాత్రి నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాగనుంది. పాపులర్ బ్రాండ్స్‌పై గ్రేట్ డీల్స్ తోపాటు వెంటనే డెలివరీ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. స్మార్ట్ ఫోన్లు మొదలు డిజిటల్ కెమెరాలు, ఇతర యాక్ససరీస్ పై వివిధ రకాల డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు ఎస్ బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికి అదనపు ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా రూ. 4,999 కు పైన చెల్లింపులు చేస్తే అమెజాన్ వెబ్ సైట్ ద్వారా అయితే 10 శాతం, అమెజాన్ యాప్ ద్వారా 15 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఎస్ బీఐ కార్డ్ ద్వారా కనీస లావాదేవి 5వేలు.. గరిష్టంగా రూ.1,750 ల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అమెజాన్ యాప్ ద్వారా కనీస లావాదేవీ రూ.250, గరిష్టంగా రూ.750 క్యాష్ బ్యాక్ఆఫర్ ఇస్తోంది.అంతేకాదు అమెజాన్ ప్రీమియం సభ్యులకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. అంతేకాదు ప్రైమ్ మెంబర్స్ ..నాన్ ప్రైమ్ మెంబర్స్ కంటే 30నిమిషాల ముందు టాప్ డీల్స్ ను సొంతం చేసుకునేలా ఏర్పాటు చేసింది. వినియోగదారులకు పర్యటన అనుభవాన్నిఅందించేందుకు ముసాఫిర్.కాంతో జతకట్టింది అమెజాన్. ఈ భాగస్వామ్యంతో అమెజాన్ యాప్ ద్వారా కొనుగోళ్లు జరిపిన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ కూడా అందిస్తోంది. 10 మంది జంటలు అన్ని ఖర్చులతో కలిపి ఉచిత యూరప్ ట్రిప్ గెల్చుకోవచ్చు. అంతేనా 10మంది లక్కీ విన్నర్స్ ప్రతి రోజు రెనాల్ట్ క్విడ్ గెలుచుకోవచ్చు. కాగా వినియోగదారులకు వెనువెంటనే ఉత్పత్తులను డెలివరీ చేయడం కోసం ఈ సంస్థ ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉంది. ఇందుకుగాను తాత్కాలికంగా 7500 పైగా ఉద్యోగాలను సృష్టించనున్నట్టు అమెజాన్ ఇండియా తెలిపింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా అప్‌కమింగ్ సేల్ నిమిత్తం శిక్షణ ఇస్తున్నట్టు అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్-ఇండియా కస్టమర్ ఫుల్ఫిల్మెంట్ అఖిల్ సక్సేనా ప్రకటించిన సంగతి తెలిసిందే.