ఫోర్డ్ ఇండియా తన ఫిగో హ్యాచ్‌బ్యాక్, ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్‌లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్‌చేసింది. ఈ రెండు కార్లను డీలర్ వద్ద లక్ష రూపాయల డిస్కౌంట్‌లో విక్రయానికి ఉంచింది. దీంతో కొనుగోలుదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరికొన్ని వారాల్లో వీటి ఫేస్‌లిఫ్ట్ మోడల్స్‌ను లాంచ్ చేయనున్న నేపథ్యంలో వాటి కంటే ముందే ఈ కార్ల పాత స్టాక్‌ను క్లియర్ చేయాలని ఫోర్డ్ ఇండియా భావిస్తోంది. గుజరాత్‌లో రూపొందిన ఫిగో నికర విక్రయాలు వెయ్యి యూనిట్లు ఉండగా.. ఆస్పైర్ విక్రయాలు సుమారు రెండు వేలు. 2015లో ఈ రెండు కార్లను ప్రవేశపెట్టారు. ఈ రెండు కార్లు దేశంలో కారు ఔత్సాహికులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. గత కొద్ది సంవత్సరాలుగా అమ్మకాలు నిలకడగా తగ్గుముఖం పట్టడంతో, కంపెనీ చివరకు ఈ వాహనాల ఉత్పత్తిని నిలిపివేసింది.
ఈ రెండు కార్లు త్వరలోనే ఫేస్‌లిఫ్ట్‌తో కొనుగోలుదారుల ముందుకు రానున్నాయి. త్వరలోనే మార్కెట్‌ప్లేస్‌లో పునఃప్రవేశించబోతున్నాయి. ముందస్తు కంటే మరింత తాజాగా, స్టయిల్‌గా ఫిగో, ఆస్పైర్ కార్లు రెండూ మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్స్‌లో ఇంటీరియర్స్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. ఎంట్రీ-లెవల్ పెట్రోల్ ఇంజిన్‌ను డ్రాగన్ లైనప్ నుంచి 1.2 లీటర్, 3 సిలిండర్ యూనిట్‌తో రీప్లేస్ చేస్తోంది. 1.5 లీటరు టీడీసీఐ టర్బోఛేంజ్డ్ డీజిల్ ఇంజిన్‌ను మార్చడం లేదు. ఈ రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. ఫిగో, ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్స్ రెండింటికీ ఫక్షర్డ్ 1.5 లీటర్ డ్రాగన్ పెట్రోల్ ఇంజిన్‌ను జతచేయాలని ఫోర్డ్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment