ఫోర్డ్ ఫిగో సరికొత్త మోడల్ విడుదల
ఫోర్డ్ ఇండియా తన కాంపాక్ట్ కారు ఫిగోను సరికొత్త మార్పులతో మళ్లీ మార్కెట్లోకి దించింది. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూం ధర గరిష్ఠంగా రూ. 6.09 లక్షలు. పెట్రోలు వేరియంట్ అయితే రూ. 3.87 లక్షల నుంచి రూ. 5.14 లక్షల వరకు ఉంది. అదే డీజిల్ వేరియంట్ అయితే రూ. 4.83 లక్షల నుంచి రూ.6.09 లక్షల వరకు ఉంది.
ఈ కొత్త ఫోర్డ్ ఫిగోకు సరికొత్త లుక్, మరింత స్టైల్ ఉంటాయని, ఇది బాగా ఆధారపడ్డగలిగే వాహనం అవుతుందని, వెచ్చించే డబ్బుకు పూర్తి విలువ ఉంటుందని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ పిపర్సానియా చెప్పారు. దీని 14 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫాగ్ ల్యాంప్, రియర్ బంపర్ అన్నీ సరికొత్తగా ఉంటాయంటున్నారు. రెండు సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వరకు వీటికి వారంటీ ఉంటుంది.