ప్రియాంక చోప్రా స్టైలిష్ లుక్‌ : విలువ రూ. 20 లక్షలు! | Rs. 20 Lakh Outfit, Diamond Bulgari Jewellery - Check Priyanka Chopra's New Look | Sakshi
Sakshi News home page

ప్రియాంక చోప్రా స్టైలిష్ లుక్‌ : విలువ రూ. 20 లక్షలు!

Published Sat, Oct 19 2024 4:56 PM | Last Updated on Sat, Oct 19 2024 5:26 PM

Rs. 20 Lakh Outfit, Diamond Bulgari Jewellery - Check Priyanka Chopra's New Look

గ్లోబల్ ఐకాన్  ప్రియాంక చోప్రా గురించిప్రత్యేక పరిచయం  అవసరం లేదు. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్  పోటీనుంచి  బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా ఎదిగింది. తరువాత హాలీవుడ్‌ దాకాఎదిగి అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరిగా తనను తాను నిలబెట్టుకుంది. తాజాగా ముంబై ఈవెంట్‌లో స్టైలిష్ లుక్‌లో తళుక్కున మెరిసింది ప్రియాంక  చోప్రా.  ఆమె మొత్తం ఔట్‌ఫిట్‌ ధర ఏకంగా  రూ. 20 లక్షలట. దీంతో ధరించిన డ్రెస్‌, నగలు, హీల్‌ ఇలా ప్రతీదీ హాట్‌ టాపిక్‌గా మారింది.

 ఈ ఈవెంట్‌లో  కాస్త సన్నగా తయారైన ఆమె అందరినీ ఆకర్షించడమే కాకుండా ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది.  ప్రియాంక  చోప్రా ధరించిన  అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ వివియన్ వెస్ట్‌వుడ్‌కు చెందిన డ్రెస్‌ ఖరీదు  ధర రూ. 2.26 లక్షలు. అలాగే  ఆమె ధరించిన క్రిస్టియన్ లౌబౌటిన్ హీల్‌ ధర 71 వేల రూపాయలు. ఆగండి ఆగండి ఇంకా ఉంది. ప్రియాంక చోప్రా Bvlgari బ్రాండ్‌కి  అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో ఆమె ధరించిన Bvlgari బ్రాండ్, రోజ్ గోల్డ్  అండ్‌  డైమండ్ నెక్లెస్ ధర రూ. 7.6 లక్షలు. ఇక డైమండ్‌ చెవిపోగులు ధర  తొమ్మిది లక్షలని ఫ్యాన్స్‌ అంచనా.

ఇదీ చదవండి: అపుడు కటిక పేదరికం : ఇపుడు పూలసాగుతో కోట్ల ఆదాయం



విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, ప్రియాంకకు  దేశంపై ఉన్న ప్రేమ పాత్ర అపారం. తన కిష్టమైన గేట్‌వే అంటూ ఒక వీడియోను కూడా ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.  అలాగే తన నిర్మాణ సంస్థ పర్పుల్ పెబుల్ పిక్చర్స్ ద్వారా ప్రాంతీయ సినిమాల్లో ముఖ్యమైన చిత్రాలకు సపోర్ట్‌ చేస్తోంది. నిర్మాతగా మరాఠీ-భాషా డ్రామా చిత్రం పానీకి సంబంధించిన ప్రచార కార్యక్రమానికి  స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా  తన తల్లి మధు చోప్రా , కొత్త పెళ్లికొడుకు, సోదరుడు సిద్ధార్థ్ చోప్రాతో కలిసి పోజులిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement