Ford Figo
-
ఇండియన్ మార్కెట్లో ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా ఫిగో హ్యాచ్‌బ్యాక్ మోడల్లో రెండు ఆటోమేటిక్ వేరియంట్లను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో వీటి ధర రూ.7.75 లక్షల నుంచి ప్రారంభం. టైటానియం, టైటానియం ప్లస్ ట్రిమ్స్‌లో లభిస్తాయి. స్పోర్ట్, సెలెక్ట్షిఫ్ట్ మోడ్స్‌లో 6 స్పీడ్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 96 పీఎస్ పవర్, 119 ఎన్ఎం టార్క్‌తో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఎలక్ట్రోక్రోమిక్ ఐఆర్వీఎం, 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, సైడ్, కర్టెయిన్ ఎయిర్‌బ్యాగ్స్, స్టాండర్డ్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి హంగులు ఉన్నాయి. -
ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్ కార్లపై భారీ డిస్కౌంట్లు
ఫోర్డ్ ఇండియా తన ఫిగో హ్యాచ్‌బ్యాక్, ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్‌చేసింది. ఈ రెండు కార్లను డీలర్ వద్ద లక్ష రూపాయల డిస్కౌంట్లో విక్రయానికి ఉంచింది. దీంతో కొనుగోలుదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరికొన్ని వారాల్లో వీటి ఫేస్‌లిఫ్ట్ మోడల్స్‌ను లాంచ్ చేయనున్న నేపథ్యంలో వాటి కంటే ముందే ఈ కార్ల పాత స్టాక్‌ను క్లియర్ చేయాలని ఫోర్డ్ ఇండియా భావిస్తోంది. గుజరాత్లో రూపొందిన ఫిగో నికర విక్రయాలు వెయ్యి యూనిట్లు ఉండగా.. ఆస్పైర్ విక్రయాలు సుమారు రెండు వేలు. 2015లో ఈ రెండు కార్లను ప్రవేశపెట్టారు. ఈ రెండు కార్లు దేశంలో కారు ఔత్సాహికులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. గత కొద్ది సంవత్సరాలుగా అమ్మకాలు నిలకడగా తగ్గుముఖం పట్టడంతో, కంపెనీ చివరకు ఈ వాహనాల ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ రెండు కార్లు త్వరలోనే ఫేస్‌లిఫ్ట్‌తో కొనుగోలుదారుల ముందుకు రానున్నాయి. త్వరలోనే మార్కెట్‌ప్లేస్‌లో పునఃప్రవేశించబోతున్నాయి. ముందస్తు కంటే మరింత తాజాగా, స్టయిల్‌గా ఫిగో, ఆస్పైర్ కార్లు రెండూ మార్కెట్లోకి రానున్నాయి. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్స్‌లో ఇంటీరియర్స్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. ఎంట్రీ-లెవల్ పెట్రోల్ ఇంజిన్‌ను డ్రాగన్ లైనప్ నుంచి 1.2 లీటర్, 3 సిలిండర్ యూనిట్‌తో రీప్లేస్ చేస్తోంది. 1.5 లీటరు టీడీసీఐ టర్బోఛేంజ్డ్ డీజిల్ ఇంజిన్‌ను మార్చడం లేదు. ఈ రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. ఫిగో, ఆస్పైర్ ఫేస్లిఫ్ట్స్ రెండింటికీ ఫక్షర్డ్ 1.5 లీటర్ డ్రాగన్ పెట్రోల్ ఇంజిన్‌ను జతచేయాలని ఫోర్డ్ భావిస్తోంది. -
ఫోర్డ్ ‘ఫిగో’, ‘యాస్పైర్’లలో స్పోర్ట్స్ ఎడిషన్లు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోర్డ్ ఇండియా’ తాజాగా తన హ్యాచ్‌బ్యాక్ ‘ఫిగో’, కాంపాక్ట్ సెడాన్ ‘యాస్పైర్’లలో కొత్త స్పోర్ట్స్ ఎడిషన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఫిగో స్పోర్ట్స్ ఎడిషన్ డీజిల్ వేరియంట్ ధర రూ.7.21 లక్షలుగా, పెట్రోల్ వేరియంట్ ధర రూ.6.31 లక్షలుగా ఉందని కంపెనీ తెలిపింది. ఇక యాస్పైర్ స్పోర్ట్స్ ఎడిషన్ (1.5 లీటర్ డీజిల్ టైటానియన్ వెర్షన్) ధరను రూ.7.6 లక్షలుగా, 1.2 లీటర్ పెట్రోల్ టైటానియమ్ వెర్షన్ యాస్పైర్ స్పోర్ట్స్ ఎడిషన్ ధరను రూ.6.5 లక్షలుగా నిర్ణయించామని పేర్కొంది. కాగా ఈ ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. కస్టమర్లకు నచ్చే ప్రొడక్టులను తీసుకువస్తూ, పోర్ట్‌ఫోలియోను విస్తరించుకుంటూ, మార్కెట్లో తమ వాటాను మరింత పదిలం చేసుకుంటామని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు. కొత్త వెర్షన్లలో 15 అంగుళాల అలాయ్ వీల్స్, డ్యూయెల్ ఫ్రంట్ డ్రైవర్ అండ్ ప్యాసెంజర్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. -
ఫోర్డ్ ఫిగో సరికొత్త మోడల్ విడుదల
ఫోర్డ్ ఇండియా తన కాంపాక్ట్ కారు ఫిగోను సరికొత్త మార్పులతో మళ్లీ మార్కెట్లోకి దించింది. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూం ధర గరిష్ఠంగా రూ. 6.09 లక్షలు. పెట్రోలు వేరియంట్ అయితే రూ. 3.87 లక్షల నుంచి రూ. 5.14 లక్షల వరకు ఉంది. అదే డీజిల్ వేరియంట్ అయితే రూ. 4.83 లక్షల నుంచి రూ.6.09 లక్షల వరకు ఉంది. ఈ కొత్త ఫోర్డ్ ఫిగోకు సరికొత్త లుక్, మరింత స్టైల్ ఉంటాయని, ఇది బాగా ఆధారపడ్డగలిగే వాహనం అవుతుందని, వెచ్చించే డబ్బుకు పూర్తి విలువ ఉంటుందని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ పిపర్సానియా చెప్పారు. దీని 14 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫాగ్ ల్యాంప్, రియర్ బంపర్ అన్నీ సరికొత్తగా ఉంటాయంటున్నారు. రెండు సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వరకు వీటికి వారంటీ ఉంటుంది.