హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా ఫిగో హ్యాచ్‌బ్యాక్ మోడల్‌లో రెండు ఆటోమేటిక్ వేరియంట్లను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో వీటి ధర రూ.7.75 లక్షల నుంచి ప్రారంభం.
టైటానియం, టైటానియం ప్లస్ ట్రిమ్స్‌లో లభిస్తాయి. స్పోర్ట్, సెలెక్ట్‌షిఫ్ట్ మోడ్స్‌లో 6 స్పీడ్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 96 పీఎస్ పవర్, 119 ఎన్‌ఎం టార్క్‌తో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఎలక్ట్రోక్రోమిక్ ఐఆర్‌వీఎం, 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్‌మెంట్ సిస్టమ్, సైడ్, కర్టెయిన్ ఎయిర్‌బ్యాగ్స్, స్టాండర్డ్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి హంగులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment