డాబా గార్డెన్స్ (విశాఖ దక్షిణ): ప్రత్యేక ఆఫర్లు, సరికొత్త మోడళ్లతో సెల్ పాయింట్ షోరూంలు కళకళలాడుతున్నాయి. కాంబో, జోడీ ఆఫర్లకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభి స్తోంది. ఈ సందర్భంగా సెల్ పాయింట్ ఎండీ మోహన్‌ప్రసాద్ పాండే, డైరెక్టర్ బాలాజీప్రసాద్ పాండే మాట్లాడుతూ దసరాతో పాటు షోరూం 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నామన్నారు. సామ్‌సంగ్, సోనీ, నోకియా, ఎల్‌జీ, మోటో, జియోనీ, ఐఫోన్, వివో, ఒప్పో, ఎంఐ తదితర కంపెనీల సెల్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నామని తెలిపారు. బజాజ్ ఫిన్‌సర్వ్, హోమ్ క్రెడిట్, కేపిటల్ ఫస్ట్ ద్వారా నెలవారీ సులభ వాయిదా పద్ధతులు, జీరో పర్సంట్ డౌన్‌పేమెంట్ అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలో ఉన్న 90 శాఖల ద్వారా రూ.కోట్ల విలువైన బహుమతులను గెలుచుకోవచ్చని చెప్పారు. బంపర్ డ్రా కింద వంద మంది వినియోగదారులకు 10 గ్రాముల బంగారం, లక్కీ డ్రా కింద వంద ఎల్‌సీడీ టీవీలు, వంద రిఫ్రిజరేటర్లు, వంద వాషింగ్ మెషీన్లు, వంద మైక్రో ఓవెన్లతో పాటు స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ప్రెజర్ కుక్కర్, ఐరన్ బాక్స్‌లు కచ్చిత బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. సామ్‌సంగ్ జే6+ కొనుగోలుపై రూ.1,500 క్యాష్‌బాక్, సామ్‌సంగ్ జే4+ కొనుగోలుపై రూ.750 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నామన్నారు. వీవో వి–11 ప్రోపై 5 శాతం క్యాష్‌బ్యాక్, ఒప్పో ఎఫ్–9 ప్రోపై 10 శాతం క్యాష్‌బ్యాక్, రూ.3,990 విలువ గల పెబ్బల్ (బ్లూటూత్ స్పీకర్) ఇస్తున్నట్టు చెప్పారు. నోకియా 6.1 కొనుగోలుతో ట్రాలీబ్యాగ్ అందజేయనున్నట్టు తెలి పారు. కొన్ని ఫోన్లు ఆన్‌లైన్ కన్నా తక్కువ ధరకే అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment