mobile shops
-
సెల్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
డాబా గార్డెన్స్ (విశాఖ దక్షిణ): ప్రత్యేక ఆఫర్లు, సరికొత్త మోడళ్లతో సెల్ పాయింట్ షోరూంలు కళకళలాడుతున్నాయి. కాంబో, జోడీ ఆఫర్లకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభి స్తోంది. ఈ సందర్భంగా సెల్ పాయింట్ ఎండీ మోహన్‌ప్రసాద్ పాండే, డైరెక్టర్ బాలాజీప్రసాద్ పాండే మాట్లాడుతూ దసరాతో పాటు షోరూం 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నామన్నారు. సామ్సంగ్, సోనీ, నోకియా, ఎల్జీ, మోటో, జియోనీ, ఐఫోన్, వివో, ఒప్పో, ఎంఐ తదితర కంపెనీల సెల్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నామని తెలిపారు. బజాజ్ ఫిన్సర్వ్, హోమ్ క్రెడిట్, కేపిటల్ ఫస్ట్ ద్వారా నెలవారీ సులభ వాయిదా పద్ధతులు, జీరో పర్సంట్ డౌన్‌పేమెంట్ అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న 90 శాఖల ద్వారా రూ.కోట్ల విలువైన బహుమతులను గెలుచుకోవచ్చని చెప్పారు. బంపర్ డ్రా కింద వంద మంది వినియోగదారులకు 10 గ్రాముల బంగారం, లక్కీ డ్రా కింద వంద ఎల్సీడీ టీవీలు, వంద రిఫ్రిజరేటర్లు, వంద వాషింగ్ మెషీన్లు, వంద మైక్రో ఓవెన్లతో పాటు స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ప్రెజర్ కుక్కర్, ఐరన్ బాక్స్‌లు కచ్చిత బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. సామ్సంగ్ జే6+ కొనుగోలుపై రూ.1,500 క్యాష్‌బాక్, సామ్సంగ్ జే4+ కొనుగోలుపై రూ.750 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నామన్నారు. వీవో వి–11 ప్రోపై 5 శాతం క్యాష్‌బ్యాక్, ఒప్పో ఎఫ్–9 ప్రోపై 10 శాతం క్యాష్‌బ్యాక్, రూ.3,990 విలువ గల పెబ్బల్ (బ్లూటూత్ స్పీకర్) ఇస్తున్నట్టు చెప్పారు. నోకియా 6.1 కొనుగోలుతో ట్రాలీబ్యాగ్ అందజేయనున్నట్టు తెలి పారు. కొన్ని ఫోన్లు ఆన్లైన్ కన్నా తక్కువ ధరకే అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. -
సెల్ పాయింట్లపై టాస్క్‌ఫోర్స్ దాడులు
సాక్షి, కరీంనగర్ : రామడుగు మండలం, గోపాలరాపు పేటలో కరీంనగర్ టాస్క్ ఫోర్స్ విస్తృత తనిఖీలు చేశారు. ఈసందర్భంగా నాలుగు సెల్ పాయింట్స్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు నీలిచిత్రాల సీడీలతో పాటు, ఇటీవలే విడుదలైన కొత్త చిత్రాల పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్లపై తనిఖీలు చేశారు. 14 సిలిండర్లు, ఫిల్లింగ్ మిషన్‌తో పాటు, వెయింగ్ మెషీన్‌ను పట్టుకున్నారు. మరో దుకాణంపై జరిపిన దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 50 లీటర్ల పీడీఎస్ కిరోసిన్, 2క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీన పరచుకున్నారు. ఈసందర్భంగా టాస్క్‌పోర్స్ అధికారులు మాట్లాడుతూ భవిష్యత్తులో దాడులనున విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. -
బోర్డు తిప్పేశారు
► ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ రూ.2 కోట్లకు కుచ్చుటోపీ ► రెండు నెలలుగా సంస్థ కార్యాలయానికి తాళం ► లబోదిబోమంటున్న బాధితులు సాక్షి, కర్నూలు: ‘‘షోరూమ్, రెస్టారెంట్, షాపు, సెలూన్.. ఏదైనా పర్వాలేదు.. అందులో మా కంపెనీకి చెందిన ఎల్ఈడీ టీవీని ఏర్పాటు చేసుకోండి.. నెలకు రూ. 5వేలు అద్దెగా పొందండి’’ ... ఈ ప్రకటన చదివిన వారెవరైనా అబ్బా ఇదేదో మంచి అవకాశం.. షాపులో ఉంటూ ఏం చక్కా ప్రతినెలా రూ. 5వేలు సంపాదించొచ్చు అని ఎగిరి గంతేస్తారు. మన జిల్లాలో వారూ ఇలాగే చేశారు. కంపెనీ షరతులను అంగీకరించి.. వారికి డిపాజిట్ చెల్లించారు. తక్షణమే ఆ కంపెనీ టీవీలు తెచ్చి వారి షాపుల్లో అమర్చింది. రెండు నెలలు అద్దె డబ్బులు వచ్చాయి. మూడో నెల నుంచి అదిగో.. ఇదిగో అంటూ చివరకు చేతులెత్తేశారు. ఇలా డిపాజిట్ రూపంలో సేకరించిన కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టిన ఓ అడ్వటైజింగ్ ఏజెన్సీ నిర్వాకం ఇది. ఇదీ కథ.. అడిటస్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్.. హైదరాబాద్ ఏఎస్రావు నగర్ కేంద్రంగా పనిచేస్తోంది. డిజిటల్ యాడ్స్‌కు బ్రాండింగ్ చేయడమే ఈ సంస్థ పని. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ మన జిల్లాకు సంబంధించి కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని యూ కాన్ కాంప్లెక్స్‌లో ఆరునెలల క్రితం కార్యాలయాన్ని ప్రారంభించింది. ‘సంస్థకు చెందిన ఎల్ఈడీ టీవీని ఏర్పాటు చేసుకుని.. ప్రతి రోజూ ఉద యం నుంచి సాయంత్రం వరకు(టీవీ ఆయా వ్యాపార సంస్థల యాడ్స్ వస్తుంటాయి) 9 గంటలపాటు ఆన్‌చేసి ఉంచితే చాలు ప్రతినెలా రూ. 5 వేల అద్దె చెల్లిస్తాం’ అంటూ ప్రకటనలు గుప్పించారు. దీంతో కర్నూలు నగరంతోపాటు ఆదోని, నంద్యాల పట్టణాల్లోని వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న యువకులు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా మొబైల్ షాపులు, టిఫిన్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలు, ఆటో మొబైల్ షాపులు, హాస్పిటల్స్, జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు వీరి వలలో పడ్డారు. టీవీ ఏర్పాటు చేయాలంటే అడ్వాన్స్‌గా రూ. 40 వేలు చెల్లించాలని సంస్థ పెట్టిన షరతు మేరకు డీడీలు చెల్లించి టీవీ ఏర్పాటు చేయించుకున్నారు. వీరికి రూ. 5 వేలు చెల్లించే విధంగా కంపెనీ.. మూడు పోస్టు డేటెడ్ చెక్‌లను(పీడీసీ) ఇచ్చింది. మొదటి రెండు నెలలు అందరికీ అద్దె డబ్బులు అందాయి. తర్వాత ఫిబ్రవరి నుంచి చెల్లింపులు ఆగిపోయాయి. బాధితులు బ్రాంచ్ మేనేజర్‌ను ప్రశ్నించగా అదిగో ఇదిగో అంటూ చివరకు నెల రోజులుగా కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఇలా సుమారు 500 మంది నుంచి వసూలు చేసిన రూ. 2కోట్లకు కంపెనీ కుచ్చుటోపీ పెట్టింది. కంపెనీ డెరైక్టర్లనుఅడగండి.. అడిటస్ సంస్థ మోసాలను తెలుసుకున్న ‘సాక్షి’.. సంస్థ మేనేజర్ శ్రీనివాస్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అతని తండ్రి ఫోన్లో మాట్లాడాడు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదన్నారు. కంపెనీకి డెరైక్టర్లున్నారని, వారి నుంచి వివ రణ తీసుకోవాలన్నారు. నోటీసులు పంపారు.. మాకు నెలసరి అద్దె చెల్లించకపోగా ప్రస్తుతం కంపెనీ డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో లేదంటూ మాకు నోటీసులు పంపారు. ఇది ఎంతవరకు న్యాయం. ఇలాంటి వారి నుంచి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకుంటే మంచిది -
సెల్‌ఫోన్ దుకాణాల్లో భారీ చోరీ
బద్వేలు అర్బన్: వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత దొంగలు పలు సెల్‌ఫోన్ దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. సిద్ధవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్‌లో ఉన్న ఎస్ఎంఆర్ సెల్పాయింట్ షట్టర్ తాళాలు పగులగొట్టి రూ.5 లక్షల విలువైన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఎత్తుకు పోయారు. అలాగే, సీఎస్ఐ చర్చి కాంప్లెక్స్‌లో ఉన్న ఫ్రెండ్స్ సెల్ వరల్డ్ దుకాణంలోనూ రూ.50 వేల విలువ చేసే సెల్ఫోన్లు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు చోరీలు జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. క్లూస్‌టీమ్‌కు సమాచారం అందించి దర్యాప్తు ప్రారంభించారు.