సాక్షి, కరీంనగర్ : రామడుగు మండలం, గోపాలరాపు పేటలో కరీంనగర్ టాస్క్ ఫోర్స్ విస్తృత తనిఖీలు చేశారు. ఈసందర్భంగా నాలుగు సెల్ పాయింట్స్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు నీలిచిత్రాల సీడీలతో పాటు, ఇటీవలే విడుదలైన కొత్త చిత్రాల పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్‌లపై తనిఖీలు చేశారు. 14 సిలిండర్లు, ఫిల్లింగ్ మిషన్‌తో పాటు, వెయింగ్ మెషీన్‌ను పట్టుకున్నారు. మరో దుకాణంపై జరిపిన దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 50 లీటర్ల పీడీఎస్ కిరోసిన్, 2క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీన పరచుకున్నారు. ఈసందర్భంగా టాస్క్‌పోర్స్ అధికారులు మాట్లాడుతూ భవిష్యత్తులో దాడులనున విస్తృతం చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment