సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద క్యారియర్ ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా ఇతర విమానయాన సంస్థలు డిస్కౌంట్ స్కీమ్‌లను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇండిగో కూడా రూ. 981కే విమాన టికెట్‌ను అందిస్తోంది. ఎంపిక చేసిన మార్గాల్లో పరిమితకాల ఆఫర్ కింద పరిమిత సీట్లను అందిస్తున్నట్టు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 15లోపు మాత్రమే ఈ ఆఫర్‌లో టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇలా బుక్ చేసుకున్నటికెట్ల ద్వారా సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 8 మధ్య ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది.
వెబ్‌సైట్ అందించిన సమాచారం శ్రీనగర్, జమ్ము మధ్య రూ.981 టికెట్‌ను అందిస్తుండగా హైదరాబాద్-అహ్మదాబాద్ (రూ.1,992), హైదరాబాద్-లక్నో (రూ.2,456), కోల్కతా-బెంగళూరు (రూ .3,634), కోలకతా-భువనేశ్వర్ (రూ .1,379), కోలకతా-ఢిల్లీ (రూ. 2,836), కోలకతా-హైదరాబాద్ (రూ.2,594) ముంబై-బెంగళూరు (రూ.1,748), ముంబై-ఢిల్లీ (రూ .2,255), బెంగళూరు-ఢిల్లీ (రూ .2,929) అహ్మదాబాద్-బెంగళూరు (రూ.2,078), అహ్మదాబాద్-ఢిల్లీ (రూ.1,415), బాగ్డోగ్ర-కోల్‌కతా (రూ .1,613), బెంగళూరు-గోవా (రూ.1,782), బెంగళూరు-గోవా (బెంగళూరు) రూ.1,782), గౌహతి-కోల్‌కతా (రూ .1,793) ధరల్లో విమాన టికెట్లు లభ్యం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment