ఫ్లిప్‌కార్ట్ కొత్త ఏడాది సందర్భంగా నిర్వహిస్తున్న 2018 మొబైల్స్ బొనాంజ సేల్‌ను ప్రకటించింది. దేశీయ కొనుగోలుదారులు కొత్త స్మార్ట్‌ఫోన్‌తో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాలనే ఉద్దేశ్యంతో ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌ను ప్రారంభించబోతుంది. జనవరి 3 నుంచి జనవరి 5 మధ్యలో ఈ సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్ సందర్భంగా షావోమి ఎంఐ ఏ1, గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్, మోటో జీ5 ప్లస్, రెడ్‌మి నోట్4, లెనోవో కే5 నోట్, శాంసంగ్ గెలాక్సీ ఎస్7 స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. అంతేకాక పలు 4జీ హ్యాండ్‌సెట్లను డిస్కౌంట్ ధరలో విక్రయించనున్నట్టు తెలిపింది. స్వల్ప ఛార్జీతో బైబ్యాక్ గ్యారెంటీ, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, పలు ఎక్స్చేంజ్ ఆఫర్లు ఈ సేల్‌లో ఉండనున్నాయి.
మొబైల్స్‌పై సేల్ ఆఫర్స్...
- షావోమి ఎంఐ ఏ1 డిస్కౌంట ధర రూ.12,999కే అందుబాటు(ఎంఆర్‌పీ రూ.13,999)
- గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ అత్యంత తక్కువ ధర రూ.39,999కే లభ్యం( అసలు రూ.61వేల నుంచి ధర ప్రారంభం), దీనిలోనే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ ఈఎంఐ లావాదేవీలపై ఆఫర్ చేసే రూ.8000 డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది.
- మోటో జీ5 ప్లస్ రూ.9999కు విక్రయం(ఎంఆర్‌పీ రూ.16వేలు)
- రెడ్‌మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్ కొత్త ధర రూ.10,999(అసలు ధర రూ.12,999). ఈ డిస్కౌంట్ ధర 4జీబీ ర్యామ్, 64జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వేరియంట్‌కు మాత్రమే అమలు.
- లెనోవో కే5 నోట్ 4జీబీ వేరియంట్ రూ.11,481కి లిస్ట్ అయింది. దీని అసలు ధర రూ.13,499.
- మోటో సీ ప్లస్ రూ.5,999కే సేల్(ఎంఆర్‌పీ రూ.6,999)
- ప్యానాసోనిక్ ఎలుగా ఏ3 3జీబీ ర్యామ్ వేరియంట్ రూ.6,999 డిస్కౌంట్ ధరలో అందుబాటు. ఈ ఫోన్ అసలు ధర 11,490 రూపాయలు.
- గెలాక్సీ ఎస్ 7 రూ.26,990కి అందుబాటు(అసలు ఎంఆర్‌పీ రూ.46వేలు)
- లెనోవో కే8 ప్లస్ ధర రూ.8,981 నుంచి ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment