తాజాగా ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తూ ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ పేరుతో మరో ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. నిన్ననే ముగిసిన బిగ్ సేవింగ్ డేస్ తర్వాత ఈ సేల్ ప్రకటించడం విశేషం. ఫ్లిప్‌కార్ట్ 'ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్' జనవరి 23 నుంచి 26 వరకు కొనసాగుతుంది. అయితే, ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్‌లో మీకు మొబైల్ కవర్, స్మార్ట్ వాచ్, టీడబ్ల్యుఎస్, ల్యాప్ టాప్, కెమెరాల వంటి వాటి మీద అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా సేల్‌కు పోటీగా ఈ సేల్ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఈ రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ కూడా జనవరి 26 వరకు కొనసాగనుంది.
ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ల్యాప్ టాప్స్ మీద 30 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. డెల్ ఇన్ స్పిరాన్ రైజెన్ 5, డెల్ ఇన్ స్పిరాన్ వోస్ట్రో కోర్ ఐ3 11వ-జెన్, ఇన్ స్పిరాన్ కోర్ ఐ3 11వ జెన్ మోడల్స్ మీద ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. హెచ్‌పీ, ఎంఎస్ఐ, ఎల్జి, డెల్, ఏసర్, లెనోవోతో సహా కొన్ని ప్రముఖ బ్రాండ్లపై కూడా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే,యాపిల్,శామ్ సంగ్ కంపెనీలకు చెందిన టాబ్లెట్లపై కూడా ఆఫర్స్ అందిస్తుంది. బోస్ ఆడియో ప్రోడక్ట్స్ మీద 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. టిడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్, సౌండ్ బార్లు, హోమ్ థియేటర్లు, బ్లూటూత్ స్పీకర్ల మీద వరుసగా 30 శాతం, 40 శాతం, 60 శాతం, 40 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ డిఎస్ఎల్ఆర్ కెమెరాలు, స్మార్ట్ వాచ్ మీద కూడా ఆఫర్స్ లభిస్తున్నాయి. డిఎస్ఎల్ఆర్ & మిర్రర్ లెస్ కెమెరాలపై రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఈ సేల్‌లోఫిట్ నెస్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్లను రూ.1,999 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ.699 నుంచి పవర్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. చివరగా, మొబైల్ కేసులు మరియు కవర్లు కేవలం రూ.99 నుండి అందుబాటులో ఉంటాయి.
(చదవండి: టాటా మోటార్స్ దూకుడు.. ఇక ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ తగ్గేదె లే!)
Comments
Please login to add a commentAdd a comment