ఈ ఏడాదిలో తొలి సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే సందర్భంగా పలు రకాల ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022ను ప్రకటించింది. దీని కోసం వెబ్‌సైట్‌లో ఒక ప్రత్యేక పేజీని క్రియేట్ చేసింది. ఈ సేల్ జనవరి 17 నుంచి 22 వరకు కొనసాగుతుంది. అమెజాన్ కూడా 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' పేరుతో ప్రత్యేక సేల్‌ను తీసుకొస్తుంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17 నుంచి 20 వరకు కొనసాగనుంది.
ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ఐటమ్, దుస్తులపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం కొంత సేల్‌ను తీసుకువస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు జనవరి 16 నుంచి ఈ సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు తమ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10% డిస్కౌంట్ పొందుతారు. ఏ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ మీద ఎంత డిస్కౌంట్ అందిస్తున్నారో ఇంకా వెల్లడించలేదు.
వీటిపై 80% వరకు డిస్కౌంట్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022లో ఎలక్ట్రానిక్ వస్తువుల మీద 80% వరకు డిస్కౌంట్ అందిస్తే, హెడ్ ఫోన్లు & స్పీకర్లు 70 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. మరోవైపు స్మార్ట్ వేరియబుల్స్ మీద 60% వరకు డిస్కౌంట్, ల్యాప్ టాప్ & డెస్క్ టాప్స్ మీద 40 శాతం వరకు డిస్కౌంట్, మొబైల్ యాక్ససరీల మీద 70 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. అలాగే, టాప్ స్మార్ట్ వాచీల మీద 60% వరకు డిస్కౌంట్, టీవీ & గృహోపకరణాల మీద 75% వరకు డిస్కౌంట్, దుస్తుల మీద 60 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. త్వరలో ఏ ప్రొడక్ట్ మీద ఎంత డిస్కౌంట్ ఇవ్వనున్నారో ప్రకటించనుంది.
(చదవండి: 2021లో దేశంలో ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన మొబైల్ యాప్ ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment