
దీపావళి సందర్భంగా లెనోవో బ్రాండు మోటో తన స్మార్ట్‌ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది. రిలయన్స్ జియో డేటా ఆఫర్, ఈఎంఐ ఆప్షన్లతో పాటు పరిమిత కాల వ్యవధిలో డిస్కౌంట్లను మోటో అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే మోటో అందిస్తున్న 'స్పెషల్ దీపావళి ఆఫర్' కేవలం ఆఫ్‌లైన్ స్టోర్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 21 వరకు ఈ డిస్కౌంట్లను కంపెనీ ఆఫర్ చేయనుంది. ట్వీట్ ద్వారా కంపెనీ ఈ విషయాన్ని తెలిపింది.
డిస్కౌంట్ల వివరాలు...
- మోటో ఈ4 స్మార్ట్‌ఫోన్ ధరను రూ.8,999 నుంచి రూ.8,199కు తగ్గించింది
- మోటో జీ5 స్మార్ట్‌ఫోన్ రూ.10,999కే అందుబాటు, ఈ ఫోన్ అసలు ధర రూ.12,599
- మోటో ఎం స్మార్ట్‌ఫోన్ ధరను 4వేల రూపాయల మేర తగ్గించింది. రూ.16,999 రూపాయలుగా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ రూ.12,999కే అందుబాటులోకి తెచ్చింది.
- మోటో జెడ్2 ప్లే స్మార్ట్‌ఫోన్ ధర రూ.29,499 నుంచి రూ.24,999కు తగ్గింపు
- ధరల తగ్గింపు మాత్రమే కాక, అదనంగా 100జీబీ 4జీ జియో డేటాను యూజర్లకు ఆఫర్ చేయనుంది. బజాజ్ ఫిన్‌సర్వ్, హోమ్ క్రెడిట్ నుంచి కూడా ఈఎంఐ స్కీమ్‌లను మోటో బ్రాండు ఆఫర్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment