ప్యాషన్‌నే ప్రొఫెషన్‌గా మలుచుకుంటే అంతకు మించిన ఘన విజయం ఏముంటుంది?చిన్నప్పుడు సరదాగా కవిత్వం రాసిన, మన పాటలను ర్యాప్‌లోకి మార్చి సరదాగా పాడిన కలైవాణి నాగరాజ్ అలియాస్ లేడి కాష్ తొలి తమిళ్–ఇంగ్లీష్ ఫిమేల్ ర్యాపర్‌గా తనదైన గుర్తింపు సాధింంది. ఏఆర్ రెహమాన్ ఆమెకు పెట్టిన పేరు మినీ డైనమెట్.
కాష్ తండ్రి ప్రొఫెషనల్ డ్యాన్సర్. తల్లికి చిత్రకళ ఆసక్తికరమైన సబ్జెక్ట్. ఇంతకు మించి కష్‌కు కళానేపథ్యం లేదు. ఇక సంగీతం తెలిసిన వారు ఎవరూ లేరు. కథలు చెప్పడం, కవిత్వం పోటీలలో చురుగ్గా పాల్గొనేది. రేడియోలో పాటలు వినడం ద్వారా, మ్యూజిక్ చానల్స్ చూడడం ద్వారా సంగీతంపై ఆసక్తి మొదలైంది. ‘మ్యూజికే నా కెరీర్’ అని కాష్ అన్నప్పుడు తల్లిదండ్రులు అభ్యంతరం పెట్టకపోగా చాలా ప్రోత్సహించారు. తాను విన్న పాటలను ర్యాప్ సాంగ్ స్టైల్లో పాడడం కాష్‌కు ఒక సరదా. కవిత్వం రాయడం మరో సరదా.
అయితే ఈ సరదాలేవి వృథా పోలేదు. తన కెరీర్‌కు గట్టి పునాదిరాళ్లుగా ఉపయోగపడ్డాయి. భాషపై పట్టు కోసం లైబ్రరీ నుంచి ఇంగ్లీష్, తమిళ భాషల్లోని పుస్తకాలను తెచ్చుకొని చదివేది. ర్యాప్‌లో తనదైన టాలెంట్ చూపుతున్న కాష్‌కు ‘రోబో’ సినిమా సౌండ్‌ట్రాక్ కోసం ఏఆర్ రెహమాన్‌తో పనిచేసే అవకాశం వచ్చింది. ఇది తనకు మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి లాంచ్‌ప్యాడ్‌గా ఉపయోగపడింది.
‘ఆ సౌండ్‌ట్రాక్ అనేది నా కెరీర్‌లో మైలుస్టోన్ మాత్రమే కాదు ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ల్యాండ్‌మార్క్‌గా నిలింది. యూఎస్, యూకే ఐట్యూన్ చార్ట్స్‌లో టాప్‌లో నిలింది. గతంలో ఏ ఆల్బమ్ ఇలాంటి ఘనతను సాధించలేదు. ఇదొక అద్భుతమైన, ఆనందకరమైన అనుభవం. మ్యూజిక్‌లో ఉండే పవర్ ఏమిటో తెలిసొచ్చింది. సంగీతం బాగుంటే సరిహద్దులు చెరిగిపోతాయి. అన్ని దేశాలు ఆ సంగీతాన్ని స్వంతం చేసుకుంటాయి’ అంటుంది లేడీ కాష్.
Comments
Please login to add a commentAdd a comment