
'ఆగడు' మరో టర్నింగ్ పాయింట్: మహేశ్ బాబు
చెన్నై: త్వరలో విడుదల కానున్న ఆగడు చిత్రంపై అభిమానులే కాదు మహేశ్ బాబు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. తన కెరీర్లో ఈ చిత్రం మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని మహేశ్ బాబు భావిస్తున్నారు.
'నా కెరీర్లో ఓ సారి వెనక్కెళ్లి చూసుకుంటే కొన్ని చిత్రాలు నన్ను మంచి పొజిషన్లో నిలబెట్టాయి. అలాంటి వాటిలో దూకుడు సినిమా ఒకటి. నా జీవితంలో దూకుడు ఓ టర్నింగ్ పాయింట్. నా కెరీర్ కీలక దశలో ఉన్న సమయంలో ఆగడు కూడా మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నా. నా అభిమానులు మెచ్చేలా సినిమా తీయడం దర్శకుడు శ్రీను వైట్లకు తెలుసు. ఆయన దర్శకత్వంలో వచ్చిన దూకుడు విజయవంతమైంది' అని మహేశ్ అన్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఆగడు ఈ నెల 19న విడుదలవుతోంది. మిల్క్ బ్యూటీ తమన్నా మహేశ్ సరసన నటించారు. సోనూ సూద్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం ఇతర ముఖ్య తారాగణం.