
Nithin Is The First South Indian Hero With Highest Views: బాలీవుడ్ ఆడియెన్స్కు కొన్నిసార్లు తమ చిత్రాలకంటే ఇతర భాష సినిమాలను ఎక్కువగా ఆదరిస్తారు. అందుకే యూట్యూబ్లో బీటౌన్ చిత్రాలకంటే హిందీలో డబ్ అయిన మూవీస్కే ప్రజాదరణ వస్తోంది. ఇలా హిందీలో ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన ఏకైక సౌత్ ఇండియా హీరోగా నితిన్ మాత్రమే రికార్డ్కెక్కాడు. గత కొన్నేళ్లుగా యూట్యూబ్లో నితిన్ సినిమాలకు ఎక్కవ వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్లో తన చిత్రాలు హిందీలో డబ్ అవడమేకాకుండా బాలీవుడ్ ప్రేక్షక అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు నితిన్.
నితిన్ నటించిన హిందీ డబ్బింగ్ చిత్రాలన్నింటికి కలిపి యూట్యూబ్లో 2.3 బిలియన్ల వ్యూస్ రావడం విశేషంగా మారింది. నితిన్ నటించిన తెలుగు మూవీస్ అన్నీ హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం భారీ మొత్తంగా వసూలు చేయడంతో నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్ఎస్ రాజా శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment