ఈసారి దర్శకుడిగా నితిన్‌తో సినిమా చేస్తా : గౌతమ్‌మీనన్ | Gautham Menon- Nithin new movie? | Sakshi
Sakshi News home page

ఈసారి దర్శకుడిగా నితిన్‌తో సినిమా చేస్తా : గౌతమ్‌మీనన్

Published Sat, Sep 12 2015 11:24 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

ఈసారి దర్శకుడిగా నితిన్‌తో సినిమా చేస్తా : గౌతమ్‌మీనన్

ఈసారి దర్శకుడిగా నితిన్‌తో సినిమా చేస్తా : గౌతమ్‌మీనన్

 ‘‘నితిన్‌తో ‘కొరియర్‌బాయ్ కళ్యాణ్’ నిర్మాతగా లాంగ్ జర్నీ చేశా. అతనితో పనిచేయడం మంచి ఎక్స్‌పీరియన్స్. లవ్‌స్టోరీతో పాటు థ్రిల్లర్ ఎలిమెంటున్న ఫ్యామిలీ ఎంటర్‌ై టైనర్ ఇది. త్రివిక్రమ్‌తో నితిన్ చేస్తున్న ‘అ..ఆ..’ తర్వాత, నా దర్శకత్వంలో నితిన్ హీరోగా మంచి యాక్షన్ లవ్‌స్టోరీ సినిమా చేస్తా’’ అని దర్శకుడు గౌతమ్‌మీనన్ చెప్పారు. ఆయన సమర్పణలో  నితిన్, యామీగౌతమ్ జంటగా తయారైన చిత్రం ‘కొరి యర్ బాయ్ కళ్యాణ్’. ప్రేమ్‌సాయి దర్శకుడు. ఈ 17న ఈ చిత్రం విడుదల.
 
  శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లా డుతూ, ‘‘తమిళంలో కన్నా తెలుగులో ఇది భారీ చిత్రం. థియేటర్‌‌స ఖాళీ లేకపోవడంతో తమిళ వెర్షన్ (జై హీరోగా తయారైన ‘తమిళ్ సెల్వనుమ్- తనియార్ అంజలుమ్’) రెండు వారాల తర్వాత రిలీజవుతోంది’’ అని చెప్పారు. ‘‘ఓ అభిమాని ‘సీబికె’ అంటే కంటెంట్ బేస్డ్ కథ అని ట్వీట్ చేశాడు. నిజంగానే ఇది కంటెంట్ బేస్డ్ మూవీ. ఇమేజ్‌ను పక్కనపెట్టి కంటెంట్‌ను నమ్మి ఈ సినిమా చేశా. సిస్టర్ సెంటిమెంట్‌తో లాస్ట్‌ఫ్రేమ్ దాకా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఇలాంటి సినిమాలు సక్సెసైతే మరిన్ని వైవిధ్యమైన కథలు వస్తా’’యని నితిన్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement