భాష లేని ఊసులాట! | Nithin Rang De Movie Video Song Release | Sakshi
Sakshi News home page

భాష లేని ఊసులాట!

Published Fri, Nov 13 2020 6:05 AM | Last Updated on Fri, Nov 13 2020 6:05 AM

Nithin Rang De Movie Video Song Release  - Sakshi

‘‘ఏమిటో ఇది వివరించలేనిది.. మది ఆగమన్నది తనువాగనన్నది.. భాష లేని ఊసులాట సాగుతున్నది.. అందుకే ఈ మౌనమే ఓ భాష అయినది.. కోరుకోని కోరికేదో తీరుతున్నది...’’ అంటూ ప్రేయసికి తన ప్రేమను తెలియజేస్తున్నారు నితిన్‌. ఈ ప్రేమ పాట ‘రంగ్‌ దే’ చిత్రం కోసమే. నితిన్, కీర్తీ సురేష్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘ఏమిటో ఇది వివరించలేనిది..’ అంటూ సాగే ఈ చిత్రంలోని తొలి పాట వీడియోను విడుదల చేశారు. ఈ పాటకి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. హరిప్రియ, కపిల్‌ కపిలన్‌ పాడారు.

దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించారు. ‘‘ఈ రొమాంటిక్‌ మెలోడీని వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు వెంకీ అట్లూరి. ఈ నెల చివరి వారం నుంచి చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. దుబాయ్‌లో పాటల చిత్రీకరణతో త్వరలోనే షూటింగ్‌ పూర్తవుతుంది. 2021 సంక్రాంతికి సినిమా విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: పీడీవీ.ప్రసాద్, కెమెరా: పీసీ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.వెంకటరత్నం (వెంకట్‌). 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement