పరిచయం కావడానికి పాతికేళ్లు! | teaser talk about thrivikram new movie | Sakshi
Sakshi News home page

పరిచయం కావడానికి పాతికేళ్లు!

Published Thu, Apr 14 2016 10:50 PM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

పరిచయం కావడానికి పాతికేళ్లు!

పరిచయం కావడానికి పాతికేళ్లు!

‘అ’ అంటే ఏంటి? ‘అనసూయా రామలింగం’. మరి.. ‘ఆ’ అంటే ఆనంద్ విహారి. ఈ రెండక్షరాలూ పక్క పక్కనే ఉంటాయి. కానీ, అనసూయ, ఆనంద్ విహారి ఎక్కడెక్కడో ఉంటారు. ఓ సందర్భంలో ఒకే ట్రైన్ ఎక్కుతారు. మాటలు కలపకుండానే - ఒకరి పేర్లు ఒకరికి తెలిసిపోతాయ్. అప్పుడు  సమంత తనలో తాను ‘పక్క పక్కనే ఉండే అక్షరాలు. పరిచయం కావడానికి పాతికేళ్లు పట్టింది’ అనుకుంటుంది. బుధవారం విడుదలైన ‘అ.. ఆ’ టీజర్‌లో సమంత అనే ఈ మాటలు ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్నాయి. రొమాంటిక్ ఫీల్‌తో కనిపించే ఈ టీజర్ చాలు..

దర్శకుడు త్రివిక్రమ్ అందమైన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని ఇవ్వనున్నారని చెప్పడానికి! అనసూయా రామలింగం పాత్రలో సమంత, ఆనంద్ విహారిగా నితిన్ నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ మరో కథానాయిక. ఒక కీలకమైన పాత్రలో నదియా నటిస్తున్నారు. మమత సమర్పణలో సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘టీజర్‌కు మంచి స్పందన లభించినందుకు ఆనందంగా ఉంది. ఇది చక్కని ఫీల్‌గుడ్ రొమాంటిక్ మూవీ. మిక్కీ జె. మేయర్ స్వరపరచిన పాటలను ఈ నెలలో, మే ప్రథమార్ధంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.డి.వి. ప్రసాద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement