
స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం యశోద. హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌ఫై శివలెంక కృష్ణ ప్రసాద్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
అయితే ఇప్పటివరకు సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మాత్రమే రిలీజ్ చేసిన మూవీ టీం తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో సమంత ప్రెగ్నెంట్ లేడీగా నటించింది.
మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ పని చేసినా దెబ్బ తగలకుండా చూసుకోవాలని అంటూ డాక్టర్ సలహాలు చెబుతుండగా అందుకు పూర్తి భిన్నంగా సమంతకు పరిస్థితులు ఎదురవుతాయి. యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్ అంశాలతో ఎంతో ఉత్కంఠభరితంగా టీజర్‌ను కట్ చేశారు.
లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Strength, willpower & adrenaline!https://t.co/Dv8OQkBntW#YashodaTheMovie @Samanthaprabhu2 @Iamunnimukundan @varusarath5 @harishankaroffi @hareeshnarayan #Manisharma @krishnasivalenk @SrideviMovieOff @PulagamOfficial @DoneChannel1 @SanchitaTrivedi @PRO_SVenkatesh @DiljithAthira
— Samantha (@Samanthaprabhu2) September 9, 2022
Comments
Please login to add a commentAdd a comment