ఓహోహో.. రామలక్ష్మి... ఏం వయ్యారం! | Rangasthalam Samantha Teaser Out | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 9 2018 12:04 PM | Last Updated on Fri, Feb 9 2018 12:54 PM

Rangasthalam Samantha Teaser Out - Sakshi

సాక్షి, సినిమా : మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తాజా చిత్రం రంగస్థలం నుంచి మరో టీజర్‌ వచ్చేసింది. హీరోయిన్‌ సమంత పాత్రను పరిచయం చేస్తూ కాసేపటి క్రితం ఓ టీజర్‌ను విడుదల చేశారు.

‘ఓహోహోహో.. ఏం వయ్యారం.. ఏం వయ్యారం. ఏ మాటకామాట సెప్పుకోవాలండి. ఈ పిల్ల ఎదురస్తుంటే మా ఊరికే 18 సంవత్స​రాల వయసొచ్చినట్లుందండి. ఈ సిట్టిగాడికి గుండెకాయని గొలెట్టేచేసింది ఈ పిల్లేనండీ. పేరు రామ లక్ష్మి’... అంటూ చెర్రీ వాయిస్‌ ఓవర్‌తో సామ్‌ పాత్రను పరిచయం చేసేశారు. మునెపన్నడూ లేని విధంగా డీగ్లామర్‌ రోల్‌లో కనిపించబోతోంది ఈ సౌత్‌ బ్యూటీ. 

అయితే డైలాగులు లేకుండా కట్‌ చేసిన టీజర్‌తో సమంత మూగ పాత్ర పోషిస్తుందా అన్న సస్పెన్స్‌ను సుకుమార్‌ అలాగే కంటిన్యూ చేశాడు. ఈ చిత్రంలో మొదటి పాటను ఫిబ్రవరి 13న విడుదల చేయనున్నట్లు చెప్పేశాడు. ఇక మార్చి 30న రంగస్థలం విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement