
సాక్షి, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం రంగస్థలం ఫస్ట్ లుక్ కాసేపటి క్రితం విడుదలైంది. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
పక్కా మాస్ గెటప్.. లుంగీ అవతార్‌లో చిందులేస్తున్న రామ్ చరణ్ పోస్టర్‌ను మేకర్లు వదిలారు. చిట్టిబాబు పాత్రలో చెర్రీ కనిపించబోతున్నాడు. అంతేకాదు చిత్ర విడుదలపై వస్తున్న పుకార్లకు ఎట్టకేలకు పుల్ స్టాప్ పెట్టేశారు. మార్చి 30న చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుందని ప్రకటించేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆదిపినిశెట్టి, అనసూయలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
#RangasthalamFirstLook 🕺 pic.twitter.com/ywDSA8e13r
— Mythri Movie Makers (@MythriOfficial) December 9, 2017