
సాక్షి, సినిమా : మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రంగస్థలం చిత్ర టీజర్ విషయంలో స్పష్టత వచ్చేసింది. ఈ నెల 24న సాయంత్రం టీజర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సంక్రాంతి కానుకగా చెర్రీ కొత్త పోస్టర్‌ను ట్వీటర్‌లో వదిలారు. దీంతో సంక్రాంతికి టీజర్ వస్తుందని ఆశించిన ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందినప్పటికీ.. వెంటనే క్లారిటీ లభించటంతో కాస్త ఊరట చెందారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు, ఆది, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పోస్టర్లతో ఆసక్తి రేకెతించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. మార్చి 30న రంగస్థలం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇక చెర్రీ సతీమణి ఉపాసన కూడా రంగస్థలం కోసం వెయిటింగ్ అంటూ ఓ ట్వీట్ చేశారు. అన్నట్లు ఈ చిత్రంలో చరణ్ చిట్టిబాబు పాత్రలో కనిపించబోతున్నాడన్నది తెలిసిందే కదా.
I’m waiting #ramcharan #Rangasthalam 😁 pic.twitter.com/fw2xSemziw
— Upasana Kamineni (@upasanakonidela) 15 January 2018
Comments
Please login to add a commentAdd a comment