శ్రీనివాస కళ్యాణం బోల్తాకొట్టడంతో ఆచితూచి ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తున్నాడు హీరో నితిన్. అఆ తరువాత ఆ రేంజ్ హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం యువ దర్శకుడు వెంకీ కుడుములతో భీష్మ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడు.
మహానటితో కీర్తి సురేష్ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకుంది. అయితే మహానటి సినిమా తరువాత తెలుగులో ఇప్పటివరకు మరో చిత్రానికి ఓకే చెప్పలేదు. ప్రస్తుతం కీర్తి బోనీ కపూర్ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నటించనుంది. ఇదికాకుండా తమిళ,తెలుగు ద్విభాషా చిత్రానికి కూడా ఓకే చెప్పినట్లు టాక్. అయితే తాజాగా తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి చెప్పిన కథ కీర్తికి నచ్చిందని.. ఆ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ చిత్రంలో నితిన్‌కు జోడిగా కీర్తి సురేష్ నటించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రంపై ఇప్పటివరకు హీరోగానీ, హీరోయిన్‌గానీ అధికారికంగా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment