
సూపర్ మచ్చి...
నగరానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోన.. సినీ నటుడు నితిన్‌తో కలిసి రెస్టారెంట్ రంగంలోకి అడుగుపెట్టారు.
నగరానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోన.. సినీ నటుడు నితిన్‌తో కలిసి రెస్టారెంట్ రంగంలోకి అడుగుపెట్టారు. మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో వీరు ‘టీ గ్రిల్’ పేరిట మల్టిక్యుజిన్ రెస్టారెంట్‌ను నెలకొల్పారు. దీనిని సినీ నటి సమంత శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ వంటకాలను టేస్ట్ చేసి ‘సూపర్ మచ్చి...’ అంటూ కితాబిచ్చారు. విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటైన ఈ రెస్టారెంట్‌ను రాయల్ ట్రెడిషనల్ థీమ్‌తో తీర్చిదిద్దారు. నోరూరించే వంటలు రుచి చూస్తూ.. ఫొటోలకు పోజులిస్తూ సందడి చేసింది. - సాక్షి, సిటీబ్యూరో