ఛలో అమెరికా | Nithin movie Shooting At American | Sakshi
Sakshi News home page

ఛలో అమెరికా

Published Thu, Aug 31 2017 11:23 PM | Last Updated on Thu, Sep 27 2018 8:48 PM

ఛలో అమెరికా - Sakshi

ఛలో అమెరికా

నితిన్‌ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మేఘా ఆకాష్‌ కథానాయిక. నిఖితా రెడ్డి సమర్పణలో పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్, శ్రేష్ట్‌ మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కథ అందజేశారు. విభిన్న లోకేషన్లలో ఐదు రోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం నెక్ట్స్‌ షెడ్యూల్‌ యూఎస్‌లో జరగనుంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన వినోదాత్మక కథతో రూపొందుతున్న చిత్రమిది. ఈ రోజు నుంచి దాదాపు 35రోజుల పాటు యూఎస్‌లో షూటింగ్‌ జరపబోతున్నాం. అక్కడ కీలక సన్నివేశాలతో పాటు సాంగ్స్, ఫైట్స్‌ చిత్రీకరించనున్నాం’’ అన్నారు. నరేశ్, రావు రమేశ్, లిజి, ప్రగతి, నర్రా శ్రీను, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement