నితిన్‌ రీమేక్‌ మూవీ: డైరెక్టర్‌.. | AndhaDhun Remake In Telugu With Hero Nithin | Sakshi
Sakshi News home page

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో..

Published Mon, Feb 24 2020 8:49 PM | Last Updated on Mon, Feb 24 2020 8:53 PM

AndhaDhun Remake In Telugu With Hero Nithin - Sakshi

భీష్మ సినిమా హిట్‌గా నిలవడంతో ఫుల్‌జోష్‌లో ఉన్న నితిన్‌ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈసారి స్ట్రేట్‌ సినిమాతో కాకుండా రీమేక్‌తో అభిమానులను అలరించనున్నాడు. బాలీవుడ్‌లో గత ఏడాది బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన చిత్రం ‘అంధాధూన్‌’.. విభిన్న కథాంశాలను ఎంచుకునే హీరో ఆయుష్మాన్‌ ఖురానా, టబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా రీమేక్‌ హక్కులను నిర్మాత సుధాకర్‌ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు నితిన్‌ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే.
 

ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి శ్రేష్ఠ్‌ మూవీస్‌ తాజా అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకుంది. నితిన్‌.. ‘అంధాధున్‌’ కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సినిమాను అధికారికంగా లాంచ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ రాజా వంటి సినిమాలతో మేర్లపాక గాంధీ హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక అంధాధున్‌ సినిమా ఒరిజినల్‌లో నటించిన టబు రీమేక్‌లోనూ కనిపిస్తారా? వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement