అందమైన అమ్మాయిలతో మాటలు కలిపి నమ్మించి స్నేహం పెంచుకుంటాడు... అనంతరం వారితో చనువుగా ఉన్న సమయంలో ఫొటోలు తీస్తాడు... వాటిని ఆసరాగా చేసుకుని కోరిక తీర్చమని బ్లాక్‌మెయిలింగ్ చేస్తాడు... ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా సుమారు 30 మంది యువతుల జీవితాలతో ఆడుకున్నాడు మద్దిలపాలెంకు చెందిన నయవంచకుడు నితిన్. బీటెక్ చదువుతున్నానని, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యానని, త్వరలో ఉద్యోగం వస్తుందని నమ్మించి పలువురు అమ్మాయిలతో స్నేహం పెంచుకుని మోసం చేశాడు. అశ్లీల ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసి లోబరుచుకున్నాడని కొందరు యువతులు కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు.