blackmailing girls
-
‘ఒంటరిగా ఉన్నాను ఇంటికిరా’.. అంటూ పిలిచి నిలువుదోపిడి చేసిన మహిళ
ముంబై: ముంబై నగరానికి చెందిన ఓ 57 ఏళ్లు వ్యక్తికి కొన్ని రోజుల క్రితం ఒక గుర్తుతెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తన పేరు జ్యోతి అని పరిచయం చేసుకున్న ఓ మహిళ ఆ వ్యక్తితో మాటలు కలిపింది. తనకు ఎవరూ లేరు, ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాని ఆమె చెప్పింది. మెల్లిమెల్లిగా సన్నిహితంగా మాట్లాడటం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆ వ్యక్తిని తన మాటలతో రెచ్చగొట్టింది. ఆమె మాటలకు లొంగిపోయిన సదరు వ్యక్తి మార్చి 23న ఆ మహిళకు ఫోన్ చేసి కలుస్తానని చెప్పాడు. దీంతో ఆ మహిళ తన ఫ్లాట్‌కు రావాల్సిందిగా చెప్పి తూర్పు భయాందర్‌లోని షిరిడీనగర్‌లో ఉన్న ఒక అపార్టుమెంట్ అడ్రస్ ఇచ్చింది. ఇక, ఈ వ్యక్తి ఎంతో ఉత్సాహంతో ఆమె చెప్పిన చోటుకి వెళ్లి ఇంటి తలుపు తట్టాడు. ఇతణ్ని లోపలికి ఆహ్వానించిన సదరు మహిళ నేరుగా బెడ్ రూంలోకి తీసుకెళ్లింది. ఇంతలోనే అతనికి షాకిస్తూ ఓ ముగ్గురు వ్యక్తులు పోలీసు యూనిఫాంలో సరాసరి వాళ్లు ఉన్న బెడ్ రూంలోకి చొచ్చుకు వచ్చి ఏం చేస్తున్నారంటూ బెదిరించారు. అరెస్ట్ చేస్తామని చెప్పి ఆ వ్యక్తిని భయపెట్టారు. దీంతో తనకేం తెలియదని వదిలేయమని ఆ పెద్దమనిషి ప్రాధేయపడగా రూ. 2 లక్షలు ఇస్తే వదిలేస్తామని చెప్పారు. ఈ రకంగా అతడి ఖాతాలో ఉన్న రూ. 70 వేలను దుండగులు లాగేసుకున్నారు. మిగతా డబ్బును రెండు రోజుల్లోగా ఇవ్వాలి, లేకపోతే ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామని బెదిరించి అక్కడ్నించి పంపించారు. అయితే వారి వ్యవహార శైలిపై అనుమానపడిన బాధితుడు, నేరుగా వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు స్కెచ్ వేశారు. మిగతా డబ్బును ఇస్తామని బాధితుడి ద్వారా ఫోన్ చేయించి ఒక చోటుకి పిలిపించారు. వారు రాగానే అరెస్ట్ చేశారు. ఇక వారు అసలు పోలీసులే కాదని తేలింది.వీరు ఒక ముఠాగా ఏర్పడి ఈ తరహాలో హాని ట్రాప్ చేసి అమాయకుల నుంచి డబ్బులు గుంజడం చేస్తున్నారని పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. నిందితులను సుదర్శన్ 32, విజయ్ 56, ఆయుబ్ ఖాన్ 45లుగా పోలీసులు గుర్తించారు. అయితే మహిళ పేరును మాత్రం పోలీసులు చెప్పలేదు. వీరిని అరెస్ట్ చేశారు. చదవండి: నోట్ రాసి మహిళా డాక్టర్ సూసైడ్.. రంగంలోకి దిగిన సీఎం -
ఎన్నారైనంటూ ప్రేమ, సహజీవనం.. ఆపై బ్లాక్‌మెయిలింగ్
సాక్షి, హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా నుంచి వలసవచ్చి గచ్చిబౌలిలో స్థిరపడిన షేక్ మహ్మద్ రఫీ సోషల్‌మీడియాలో కార్తీక్ వర్మగా మారిపోయాడు. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ ద్వారా అనేక మంది యువతులకు ఎర వేశాడు. ప్రేమ, సహజీవనం, పెళ్లి పేరుతో వారిని నమ్మించాడు. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు దిగి అందినకాడికి దండుకుని నిండా ముంచాడు. ఈ ఘరానా మోసగాడిని ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు బుధవారం వెల్లడించారు. ► తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరానికి చెందిన రఫీ పాలిటెక్నిక్ విద్య మధ్యలో మానేశాడు. బతుకు తెరువు కోసం 2010లో నగరానికి వచ్చి గచ్చిబౌలిలో స్థిరపడ్డాడు. తొలినాళ్లల్లో అక్కడక్కడా పని చేసినా ఆపై మానేశాడు. ► 2017లో ఓ యువతిని వివాహం చేసుకోవడంతో పాటు కుమార్తెకు తండ్రి అయ్యాడు. ఇతగాడి వరకట్న వేధింపులు తట్టుకోలేక వేరుపడిన భార్య నెల్లూరు జిల్లాలోని గూడూరు టౌన్ పోలీసుస్టేషన్లో కేసు పెట్టింది. ► విలాసవంతంగా బతకడానికి అలవాటుపడిన రఫీ అందుకు అవసరమైన డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. కార్తీక్ వర్మ పేరుతో ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్లో ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. వీటి ఆధారంగా యువతులు, మహిళలకు రిక్వెస్ట్ పంపాడు. ► ఇలా తనకు ఫ్రెండ్స్‌గా మారిన వారితో తాను భారత సంతతికి చెందిన వాడినైనా అమెరికాలో పుట్టానని, తల్లిదండ్రులు చిన్నతనంలోనే వేరయ్యారని చెప్పేవాడు. తల్లి ప్రస్తుతం సింగపూర్‌లో డాక్టర్‌గా పని చేస్తోందంటూ నమ్మించేవాడు. ► తాను తాత్కాలిక ప్రాతిపదికనే ఇండియాకు వచ్చానని చెప్పి ప్రేమ, పెళ్లి, సహజీవనం అంటూ వారికి సన్నిహితంగా మారేవాడు. కొన్నాళ్లు ప్రేమగా వ్యవహరించే రఫీ ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడం మొదలెట్టాడు. ► కొందరికి బెదిరించి, మరికొందరితో అత్యవసరం... తిరిగి ఇస్తానంటూ చెప్పి డబ్బు, నగలు తీసుకునే వాడు. ఎవరైనా తమ డబ్బు, నగలు తిరిగి ఇవ్వమంటే వారి నెంబర్లు బ్లాక్ చేయడం, తన నివాసం మార్చేసి తప్పుకోవడం చేశాడు. ► ఇలా నగరంలోనే దాదాపు ఐదుగురిని మోసం చేశాడు. ఇతడి బారినపడిన ఓ యువతి ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని బృందం రఫీని పట్టుకుంది. ► ఇతడి నుంచి రూ.9 లక్షల విలువైన 18 తులాల బంగారు ఆభరణాలు, నకిలీ గుర్తింపుకార్డులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు. -
చనువుగా ఫోటోలు, వీడియో కాల్స్.. కట్ చేస్తే..
సాక్షి, పటాన్చెరు టౌన్: అమాయకులైన ఆడవాళ్లను లక్ష్యంగా చేసుకొని వారి ఫోన్ నంబర్లు తీసుకొని పరిచయాలు పెంచుకున్నాడు ఓ యువకుడు. అనంతరం వారితో చనువుగా ఫోన్లో సెల్ఫీలు దిగుతూ మీ భర్తలకు పంపుతాను అని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఇలానే ఓ మహిళ దగ్గర నుంచి రూ.18 లక్షలు వసూలు చేసి బెదిరిస్తుండగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆ యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాసులు రెడ్డి కథనం మేరకు.. అమీన్‌పూర్‌కు చెందిన ఎండీ అక్రమ్ బిన్ అహ్మద్ అలియాస్ అక్రం ఖాన్ (23) పాలిటెక్నిక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడి అమాయాకులైన ఆడవారిని ఆసరాగా చేసుకొని ఫోన్ నంబర్లు తీసుకునేవాడు. వారితో పరిచయం పెంచుకొని ఫోన్లో చాట్ చేసి వీడియో కాల్స్ మాట్లాడుతూ లోబర్చుకునేవాడు. ఆపై తను చెప్పిన చోటుకు పిలిచి దగ్గరగా సెల్ఫీలు తీసుకునేవాడు. వారు వీడియో కాల్స్ మాట్లాడుతున్న సమయంలో స్క్రీన్ షాట్లు తీసి వాటిని తల్లిదండ్రులు, భర్తలకు పంపుతా అని బెదిరించసాగాడు. చాలా మందితో ఇలానే ప్రవర్తించాడు. ఇలాగే ఓ మహిళతో పరిచయం పెంచుకొని లోబర్చుకున్నాడు. ఆపై భర్తకు చెబుతానని బెదిరించి ఆమె నుంచి రూ.18 లక్షలు వసూలు చేశాడు. అనంతరం ఇంకా బెదిరిస్తున్న క్రమంలో భరించలేని మహిళ శుక్రవారం అమీన్పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే అక్రమ్ బిన్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మహిళలు సోషల్ మీడియాలో అపరిచుతులతో మాట్లాడకూడదని, ఫొటోలు, ఫోన్ నంబర్లు పెట్టకూడదన్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే ధైర్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
గుంటూరు జిల్లాలో మరో దారుణం
సాక్షి, గుంటూరు : జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. అమ్మాయిల ఫొటోలను మార్ఫ్ చేసి.. బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. నిజాంపట్నం మండలం పుర్లమెరక గ్రామానికి చెందిన రఘు అనే వ్యక్తి ఓ యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరిపులకు పాల్పడుతున్నాడు. ఒరిజినల్ న్యూడ్ ఫొటోలు పంపాలని.. లేకుంటే మార్ఫింగ్ చేసినవాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు రఘును అదుపులోకి తీసుకున్నారు.(బీర్ సీసాతో భార్యపై దాడి) నిందితుడు రఘును బుధవారం సాయంత్రం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జిలా ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ.. నిందితుడిపై ఫిర్యాదు చేసిన యువతిని అభినందించారు. ప్రతి ఒక్కరు ఇలాంటి బెదిరింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు. పుర్లమెరక గ్రామానికి చెందిన కామరాజు గడ్డ రఘబాబు కేరళలో బీఎస్సీ యానిమేషన్ మల్టీమీడియా పూర్తి చేశాడని తెలిపారు. ప్రస్తుతం తన స్వగ్రామంలోనే ఉంటున్న రఘు తనతో చదువుకున్న యువతులతో ఇన్స్టాగ్రామ్, వాట్సప్ ల ద్వారా పరిచయాన్ని పెంచుకొని వారి ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేస్తున్నాడని వెల్లడించారు. మరిన్ని న్యూడ్ ఫొటోలు పంపించాలని లేకుంటే మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడని చెప్పారు. అలాగే సోషల్ మీడియా వినియోగించే యువతీ, యువకులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు. ఇదే తరహాలో 10 మంది మహిళలను రఘు వేధించినట్టుగా తెలుస్తోంది. (టీడీపీ నేత వేధింపులు.. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం) -
నమ్మించి స్నేహం, అశ్లీల ఫోటోలతో వేధింపులు
-
నమ్మించి స్నేహం, అశ్లీల ఫోటోలతో వేధింపులు
- అశ్లీల ఫొటోలు తీసి బ్లాక్‌మెయిలింగ్ - పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతులు - కంచరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు విశాఖ : అందమైన అమ్మాయిలతో మాటలు కలిపి నమ్మించి స్నేహం పెంచుకుంటాడు... అనంతరం వారితో చనువుగా ఉన్న సమయంలో ఫొటోలు తీస్తాడు... వాటిని ఆసరాగా చేసుకుని కోరిక తీర్చమని బ్లాక్‌మెయిలింగ్ చేస్తాడు... ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా సుమారు 30 మంది యువతుల జీవితాలతో ఆడుకున్నాడు మద్దిలపాలెంకు చెందిన నయవంచకుడు నితిన్. బీటెక్ చదువుతున్నానని, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యానని, త్వరలో ఉద్యోగం వస్తుందని నమ్మించి పలువురు అమ్మాయిలతో స్నేహం పెంచుకుని మోసం చేశాడు. అశ్లీల ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి లోబరుచుకున్నాడని కొందరు యువతులు కంచరపాలెం పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... మద్దిలపాలెంలో ఉంటున్న నితిన్ తన స్నేహితుని సాయంతో కంచరపాలెం స్టేషన్ పరిధిలో ఉన్న ఎలుకల గాయత్రి ఫోన్ నంబర్ సేకరించి స్నేహం పెంచుకున్నాడు. గాయత్రికి సినిమాలపై ఉన్న ఆసక్తిని గమనించి తాను షార్ట్‌ఫిల్మ్‌లు తీస్తానని, వాటిలో అవకాశాలు కల్పిస్తానని నమ్మించాడు. అందుకోసం మంచి ఫొటోలు తీయించుకోవాలని చెప్పాడు. దీంతో సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఫొటోలు తీయించుకునేందుకు గాయత్రి అంగీకరించింది. అయితే ఫొటోలు తీయించుకునే సమయంలోను, దుస్తులు మార్చుకునేటపుడు అశ్లీల ఫొటోలు తీసిన నితిన్ అప్పటి నుంచి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన కోరిక తీరిస్తేనే ఫొటోలు ఇస్తానని చెప్పి గాయత్రిని లోబరుచుకున్నాడు. ఇలా మరో అమ్మాయి ప్రియను కూడా ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి కూడా చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా రోజా అనే అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రాత్రి సమయంలో వీడియో కాల్ చేయాలని రోజూ వేధిస్తుండేవాడని ఆ యువతి వాపోయింది. ఇలా సుమారు 30 మంది యువతులను నితిన్ వేధించాడని పోలీసులు, బాధితులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని సీఐ చంద్రశేఖరరావు తెలిపారు.