నితిన్‌ సినిమాకు నో చెప్పిన బుట్టబొమ్మ! | Pooja Hegde Reject the Offer in Hero Nitin Remake Cinema | Sakshi
Sakshi News home page

నితిన్‌ సినిమాకు నో చెప్పిన బుట్టబొమ్మ!

Published Tue, Aug 4 2020 8:40 AM | Last Updated on Tue, Aug 4 2020 8:42 AM

Pooja Hegde Reject the Offer in Hero Nitin Remake Cinema - Sakshi

ఒక భాషలో హిట్టయిన చిత్రాలను మరో భాషలోకి రీమేక్‌ చేయడం సినీ పరిశ్రమలో సర్వసాధారణమైన విషయం. హిందీలో ఆయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘అంధాదున్‌’ సూపర్‌  హిట్‌ అయ్యింది. ఇందులో టబు ముఖ్యపాత్ర పోషించారు. అంధుడైన హీరో జీవితంలో టబు రావడం వల్ల జరిగిన మార్పులు ఈ సినిమాలో కథను మలుపు తిప్పుతాయి. అయితే హిందీలో హిట్టయిన ‘అంధాదున్’ చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం వరుస విజయాలతో దూసుకుపోతున్న బుట్టబొమ్మ  పూజా హెగ్డేను సంప్రదించగా  నిరాకరించినట్టు తెలుస్తోంది.  ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు అంత ప్రాముఖ్యత ఉండదని, అందుకే పూజా తిరస్కరించినట్లు కొందరు చెబుతుంటే, పారితోషికం సమస్య వల్ల నో చెప్పిందని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ న్యూస్‌ పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

చదవండి: బుట్ట‌బొమ్మ‌ను క‌న్నెత్తి చూడ‌ని అఖిల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement