
పబ్‌కెళ్తాను గానీ తాగను
చిన్నప్పుటి నుంచీ సినిమాలంటే ఇష్టం
నా ఆల్‌టైమ్ ఫేవరెట్ సినిమాలంటే...
చిన్నప్పుటి నుంచీ సినిమాలంటే ఇష్టం. కానీ... సినిమాపై ప్రత్యేక అభిమానాన్ని కలిగించిన సినిమా మాత్రం శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ నటించిన ‘భారతీయుడు’. ఇప్పటికీ ఆ సినిమా టీవీల్లో వస్తే వదలను. ఇక అందులో కమల్ సార్ నటన గురించి నేనుమాట్లాడటం అంటే... కామెడీగా ఉంటుంది. అలాగే పవన్ కల్యాణ్ నటించిన ‘సుస్వాగతం, తొలిప్రేమ’ కూడా నా ఆల్‌టైమ్ ఫేవరెట్లు.
సినిమా తర్వాత నాకు ఇష్టమైనది...
సినిమా తర్వాత గేమ్స్ అంటే ఇష్టం. క్రికెట్ బాగా ఆడతా. ఆల్‌రౌండర్‌ని కూడా. స్కూల్, కాలేజ్ టైమ్‌లో ఆడేవాణ్ణి. ఇండస్ట్రీకి వచ్చాక కూడా సీసీఎల్ ఆడాను. కానీ ఇప్పుడు ఆడటం లేదు. ఎందుకంటే... మమ్మల్ని అలంకారానికి మాత్రమే తీసుకుంటున్నారు. అక్కడకెళ్లాక ఆడేవాళ్లు వేరే. ఫీల్డింగులు చేసుకోవడంతోనే మాకు సరిపోతోంది. అందుకే... ఈ దఫా నేను వెళ్లలేదు.
నాకిష్టమైన దేశాలు...
మన భారతదేశమంటే చచ్చేంత ఇష్టం. తర్వాత దుబాయ్, స్పెయిన్. అక్కడి వాతావరణం, సంస్కృతులు నన్ను కట్టిపడేశాయి.
పుస్తకమా? వామ్మో!
నా వరకు నాకు అతి కష్టమైన పని పుస్తకాలు చదవడమే. పెద్ద బోరింగ్. అయితే... కొందరు ఫ్రెండ్స్ సలహాల మేరకు ఇప్పుడిప్పుడే చదువుదాం అనుకుంటున్నా.
నా ఫేవరెట్ డిష్....
పప్పు, ఆవకాయ ఉంటే చాలు.. ఫుల్‌గా లాగించేస్తా. అంతకు మించిన ఫేవరెట్ డిష్ నాకు ఇంకొకటి లేదు. ఎన్నిసార్లు తిన్నా వెగటు అనిపించని డిష్ అది.
నా గుడ్, బ్యాడ్ హ్యాబిట్స్...
ఎక్కువగా ఆలోచించడం నా బ్యాడ్ హ్యాబిట్ అని కొందరంటారు. నా ఉద్దేశంలో అదే నా గుడ్ హ్యాబిట్ కూడా!
నాకు రిలాక్సేషన్ ఇచ్చేది...
{ఫెండ్స్‌తో కలిసి పబ్బులకు వెళ్లతా. ఎంజాయ్ చేస్తా. పబ్బులకు వెళ్లడం తప్పు కాదని నా అభిప్రాయం. ఈ రోజుల్లో యూత్‌కు అది సహజం. అయితే అక్కడికెళ్లాక మందు మాత్రం తాగను. నేను చెప్పేది నిజం.
లవ్? ఎరేంజ్డ్? ఏదైనా నాకు ఓకే....
ఇప్పటివరకూ నేనెవర్నీ లవ్ చేయలేదు. నన్నే చాలామంది లవ్ చేశారు. అయితే... దాన్ని ప్రేమ అనకూడదు. ఆకర్షణ అన్నమాట. చదువుకునే రోజుల్లోనే నాలుగైదు ప్రేమలేఖలు అందుకున్నా. హీరో అయ్యాకైతే లెక్కే లేదు. ట్విట్టర్‌లోకి ఎక్కాక వేలల్లో లవ్ ట్వీట్స్ వస్తున్నాయి! ఇక పెళ్లి విషయానికి వస్తే... నాకు ప్రేమ వివాహమైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా... ఏదైనా ఓకే. అయితే... ప్రేమ వివాహం చేసుకోవడానికి తగ్గ అమ్మాయి ఇప్పటిదాకా నాకు కనిపించలేదు. కనిపిస్తే మాత్రం ప్రపోజ్ చేసి పెళ్లి చేసేసుకుంటా. అయితే మా పెద్దవాళ్లు అదే పనిలో ఉన్నారు. నాకు ఏ మాత్రం ఛాన్స్ దొరుకుతుందో చూద్దాం! - బుర్రా నరసింహ